Telugu Bible Stories
ఆదికాండం 1-2
ఆదిలో దేవుడు ఈ విధంగా సమస్త సృష్టిని చేసాడు. అయన ప్రపంచాన్ని సృష్టించాడు. దానిలోని సమస్తాన్ని ఆరు రోజులలో చేసాడు. దేవుడు భూమిని సృష్టించిన తరువాత అది చీకటిగానూ, శూన్యంగానూ ఉంది, ఎందుకంటే దానిలో ఆయన అప్పటికి ఇంకా ఏమీ సృష్టించలేదు. అయితే దేవుని ఆత్మ నీటిమీద అల్లాడుతూ ఉంది.
అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, “వెలుగు కలుగును గాక!” అప్పుడు వెలుగు కలిగింది. దేవుడు వెలుగును చూసినప్పుడు అది మంచిదిగా కనిపించింది. దానిని “పగలు” అని పిలిచాడు. పగటిని చీకటినుండి ఆయన వేరు చేసాడు. దానిని “రాత్రి” అని పిలిచాడు. దేవుడు సృష్టి మొదటి రోజున వెలుగును సృష్టించాడు.
సృష్టిలో రెండవ రోజున దేవుడు ఇలా అన్నాడు, “నీటి మీద విశాలం కలుగును గాక,” అక్కడ విశాలం కలిగింది. దేవుడు దానిని “ఆకాశం” అని పిలిచాడు.
మూడవ రోజున దేవుడు ఇలా చెప్పాడు: “నీరు అంతా ఒక చోటకు వచ్చును గాక, భూమి కనబడును గాక.” పొడి నేలను దేవుడు “భూమి” అని పిలిచాడు, నీటిని “సముద్రాలు” అని పిలిచాడు. తాను సృష్టించిన దానిని చూచినప్పుడు అది మంచిదిగా ఉంది.
అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, “భూమి సమస్త చెట్లనూ, మొక్కలనూ మొలిపించును గాక.” ఆ విధంగా జరిగింది. తాను చేసిన సృష్టి మంచిదిగా కనిపించింది.
సృష్టిలో నాలుగవ దినాన్న దేవుడు ఇలా పలికాడు, “ఆకాశంలో నక్షత్రాలు కలుగును గాక.” సూర్యుడూ, చంద్రుడూ నక్షత్రాలు కలిగాయి. భూమి మీద వెలుగునివ్వడానికీ, రాత్రినీ పగలునూ, కాలాలనూ, సంవత్సారాలనూ వేరు చెయ్యడానికి ఆ నక్షత్రాలను చేసాడు. తాను చేసిన సృష్టి మంచిదిగా కనిపించింది.
ఐదవ రోజున దేవుడు ఇలా పలికాడు: “జీవము కలిగినవన్నీ నీటిని నిండించును గాక, పక్షులు ఆకాశాన్ని నిండించును గాక.” ఈ విధంగా ఆయన నీటిలో ఈదే వాటన్నిటినీ, పక్షులన్నిటినీ చేసాడు. తాను చేసిన సృష్టి యావత్తూ మంచిదని దేవుడు చూసాడు, ఆయన దానిని ఆశీర్వదించాడు.
సృష్టి చేసిన ఆరవ రోజున దేవుడు ఇలా పలికాడు, “భూమి మీద సంచరించే సమస్త జంతువులు కలుగును గాక!” దేవుడు పలికిన ప్రకారం ఇలా జరిగింది. వాటిలో కొన్ని సాధు జంతువులు, కొన్ని నేలమీద పాకే జంతువులు, కొన్ని అడవి జంతువులు. తాను చేసిన సృష్టిని దేవుడు మంచిదిగా చూచాడు.
తరువాత దేవుడు, “మన పోలిక చొప్పున, మన స్వరూపంలో నరుని చేయుదము. వారు సమస్త భూమిమీదనూ, సమస్త భూజంతువుల మీదనూ ఏలుదురు గాక!” అని పలికాడు.
అప్పుడు దేవుడు కొంత మన్నును తీసుకొని దానితో మానవుణ్ణి చేసాడు, వానిలో జీవాత్మ ఊదాడు. ఈ మనిషి పేరు ఆదాము. దేవుడు ఆదాము నివసించడానికి ఒక తోటను నాటాడు, దానిని సేద్యపరచడానికి ఆదామును దానిలో ఉంచాడు.
తోట మధ్యలో దేవుడు రెండు ప్రత్యేకమైన చెట్లను నాటాడు-జీవవృక్షం, మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షం. తోటలో మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్ష ఫలములను తప్పించి మిగిలిన చెట్ల ఫలములన్నిటినీ ఆదాము తినవచ్చునని దేవుడు చెప్పాడు. ఆ వృక్షఫలములను తినునప్పుడు అతడు చనిపోతాడని చెప్పాడు.
అప్పుడు దేవుడు, “మనుష్యుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు” అన్నాడు. అయితే జంతువులలో ఏదియూ ఆదాముకు సహకారి కాలేదు.
కాబట్టి దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలుగ జేశాడు. అప్పుడు ఆదాము పక్కటెముకలలో ఒక దానిని తీసి దానిలోనుండి ఒక స్త్రీని కలుగ జేశాడు. ఆదాము ఆమెను చూచినప్పుడు ఇలా అన్నాడు, “చివరకు, ఈమె నాలా ఉంది! ఈమె “నారి” అని పిలువబడుతుంది, ఎందుకంటే ఆమె పురుషునిలో నుండి తీయబడింది.”
దేవుడు తన స్వరూపంలో స్త్రీని, పురుషుని చేశాడు. దేవుడు వారిని ఆశీర్వదించి వారితో ఇలా చెప్పాడు, “మీరు ఫలించి, సంతానంలో విస్తరించండి, భూమిని నిండించండి!” దేవుడు తాను చేసిన సమస్తమూ మంచిదిగా చూచాడు. దానిని బట్టి దేవుడు సంతోషించాడు. ఇదంతా సృష్టిలో ఆరవ రోజున జరిగింది.
ఏడవ రోజు వచ్చినప్పుడు దేవుడు తాను చేసిన ప్రతీదానిని ముగించాడు. ఏడవ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దానిని పరిశుద్ధపరచాడు. ఎందుకంటే ఆ దినం సృష్టి చెయ్యడం నిలుపు చేసాడు. ఈ విధంగా దేవుడు సమస్త లోకాన్నీ, దానిలోని సమస్తాన్ని సృష్టించాడు.
ఆదికాండం 3
ఆదాము, హవ్వలు దేవుడు వారికోసం తయారు చేసిన అందమైన ఏదెనులో సంతోషంగా ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికీ దుస్తులు లేవు. అయితే ఇది వారు సిగ్గుపడేలా చెయ్యలేదు, ఎందుకంటే లోకంలో పాపం లేదు. వారు తరచుగా తోటలో నడుస్తూ, దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. అయితే తోటలో ఒక సర్పం ఉంది, వాడు చాలా కుయుక్తి కలిగినవాడు. వాడు స్త్రీని ఇలా అడిగాడు. “ఏదెను తోటలో ఏ వృక్ష ఫలములనైనా తినకూడదని దేవుడు చెప్పాడా?”
ఆ స్త్రీ ఇలా జవాబిచ్చింది. “ఈ తోటలో ఏ వృక్ష ఫలములనైనా తనవచ్చు అని దేవుడు చెప్పాడు. అయితే మంచి చెడుల తెలివితేటల నిచ్చు వృక్ష ఫలాలను తినకూడదని చెప్పాడు, ఆలాగు తిను దినమున మీరు నిశ్చయముగా చనిపోతారు అని చెప్పాడు.”
సర్పం స్త్రీతో ఇలా అంది, “ఇది సత్యం కాదు! మీరు చావనే చావరు, మీరు ఈ ఫలమును తిను దినమున మీరు దేవుని వలే మారతారనీ, ఆయనకు వలే మంచి చెడులను తెలుసుకొందురని దేవునికి తెలుసు” ఆ స్త్రీ ఆ ఫలములు అందమైనవియునూ, రమ్యమైననవిగానూ ఉన్నాయని చూచింది. జ్ఞానం కలిగియుండాలని వాటిలో కొన్నింటిని తిని తన భార్తకునూ ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.
వెంటనే వారి కన్నులు తెరువబడ్డాయి, వారు దిగంబరులుగా ఉన్నారని గుర్తించారు. అంజూరపు ఆకులతో కచ్చడములు చేసుకొని వారు తమ దేహాలను కప్పుకోడానికి ప్రయత్నించారు. ఆదాము, అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుని స్వరాన్ని విన్నారు, వారిద్దరూ చెట్ల మధ్య దాగుకొన్నారు. అప్పుడు దేవుడు ఆదామును పిలిచాడు, “ఎక్కడ ఉన్నావు?” అన్నాడు. అందుకు ఆదాము ఇలా జవాబిచ్చాడు, “నీ స్వరమును వినినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, కనుక భయపడి దాగుకొంటిని.”
అప్పుడు దేవుడు ఇలా అడిగాడు, “నీవు దిగంబరివని నీ తెలిపినవాడెవడు? నీవు తినకూడడని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా?” ఆదాము ఇలా జవాబిచ్చాడు, “నాతో ఉండుటకు నీ నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకివ్వగా నేను తిన్నాను.” అప్పుడు దేవుడు స్త్రీతో నీవు చేసినది ఏమిటి? అని అడిగాడు?” ఆ స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నాను అని జవాబు చెప్పింది.
అందుకు దేవుడు సర్పముతో, “నీవు శపించబడ్డావు. నీ కడుపుతో ప్రాకుతూ మన్ను తింటావు, నీవునూ స్త్రీకినీ నీ సంతానమునకునూ ఆమె సంతానమునకునూ వైరము కలుగజేసెదను. స్త్రీ సంతానము నిన్ను కొట్టును నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.” అని చెప్పాడు. ఆ స్త్రీతో దేవుడన్నాడు, “ నీ ప్రసవ వేదనను నేను తప్పక అధికం చేస్తాను. నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగుతుంది. అతడు నిన్ను ఏలుతాడు.” ఆ మనిషితో దేవుడు అన్నాడు: “నీవు నీ భార్య మాట విని, నేను నీకాజ్ఞాపించి ‘తినవద్ద’న్న చెట్టు ఫలాన్ని తిన్నావు, గనుక నీకోసం భూమి శాపానికి గురి అయింది .నీవు బ్రతికే కాలమంతా కష్టించి దాని ఫలం తింటావు. నీ ముఖాన చెమటోడ్చితే నీకు ఆహారం దొరుకుతుంది, నిన్నునేలనుంచి తీయడం జరిగింది గనుక నీవు నేలకు మళ్ళీ చేరే వరకూ ఇలాగే ఉంటుంది. నీవుమట్టివి; మట్టికి తిరిగి పోతావు.” ఆదాము తన భార్యకు “హవ్వ” అని పేరు పెట్టాడు, ఎందుకంటే ప్రాణం ఉన్న మానవ జాతి అంతటికీ ఆమె తల్లి. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: “ఇదిగో, ఈ మానవుడు మేలు కీడులు తెలుసుకోవడంలో మనవంటివాడయ్యాడు. ఇప్పుడతడు తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలాన్ని తీసుకొని, తిని శాశ్వతంగా బ్రతకకూడదు. అందుచేత దేవుడు అతణ్ణి ఏదెను తోటనుంచి పంపివేసాడు. జీవవృక్షం ఫలాలను తినకుండా ఉండడానికి జీవవృక్షం దగ్గరికి వెళ్ళే మార్గానికి కావలిగా ఉండడానికి శక్తివంతమైన దేవదూతలను ఉంచాడు.
ఆదికాండము 4:1-16
ఆదాము తన భార్య హవ్వను కలిసినప్పుడు ఆమె గర్భం దాల్చి కయీనుకు జన్మనిచ్చింది. ఆమె “యెహోవా సహాయంతో నేనొక మగ బిడ్డకు జన్మనిచ్చాను” అంది. తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి. కయీను వ్యవసాయం చేసేవాడు. కొంతకాలం తరువాత కయీను వ్యవసాయంలో వచ్చిన పంటలో కొంత యెహోవాకు అర్పణ ఇవ్వడానికి తెచ్చాడు. హేబెలు కూడా తన మందలో తొలుచూలు పిల్లల్లో కొవ్వు పట్టిన వాటిని తెచ్చాడు. యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు.
కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు. యెహోవా కయీనుతో “ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు రుసరుసలాడుతున్నావు? నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదం లభిస్తుంది కదా. సరైనది చెయ్యకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీపర్చుకోవాలని చూస్తుంది. అయితే, నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి” అన్నాడు. కయీను తన తమ్ముడు హేబెలుతో మాట్లాడాడు. వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలు మీద దాడి చేసి అతణ్ణి చంపివేశాడు.
అప్పుడు యెహోవా కయీనుతో “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అన్నాడు. అతడు “నాకు తెలియదు. నేను నా తమ్ముడికి కాపలా వాడినా?” అన్నాడు. దేవుడు “నువ్వు చేసిందేమిటి? నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు మొరపెడుతూ ఉంది. ఇప్పుడు నీ మూలంగా ఒలికిన నీ తమ్ముడి రక్తాన్ని మింగడానికి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండాా నువ్వు శాపానికి గురయ్యావు.
నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు. నువ్వు భూమి మీద నుంచి అస్తమానం పారిపోతూ, దేశదిమ్మరిగా ఉంటావు” అన్నాడు. కయీను “నా శిక్ష నేను భరించలేనిది.
ఈ రోజు ఈ ప్రదేశం నుంచి నువ్వు నన్ను వెళ్ళగొట్టావు. నీ సన్నిధిలోకి నేనిక రావడం కుదరదు. ఈ భూమి మీద పలాయనం అవుతూ, దేశదిమ్మరిగా ఉంటాను. నన్ను ఎవరు చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు” అన్నాడు. యెహోవా అతనితో “అలా జరగదు. నిన్ను చూసిన వాడు ఎవడైనా నిన్ను చంపితే అతణ్ణి తీవ్రంగా శిక్షిస్తానని తెలియజేసేందుకు నీ మీద ఒక గుర్తు వేస్తాను. నిన్ను నేను శిక్షించిన దానికి ఏడు రెట్లు అలాటి వాణ్ణి శిక్షిస్తాను” అన్నాడు. అప్పుడు యెహోవా కయీను మీద ఒక గుర్తు వేశాడు. కాబట్టి కయీను యెహోవా సన్నిధిలోనుంచి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పువైపు ఉన్న నోదు దేశంలో నివాసం ఉన్నాడు.
ఆదికాండం 6-8
చాలాకాలం తరువాత లోకంలో జనాభా విస్తరించింది. వారు చాలా దుర్మార్గంగానూ, హింసాత్మకంగానూ తయారయ్యారు. మనుషుల చెడుతనం లోకంలో అధికం కావడం చేత దేవుడు లోకం అంతటినీ ఒక పెద్ద జలప్రళయం ద్వారా నాశనం చెయ్యాలని నిర్ణయించాడు. నోవహును బట్టి దేవుడు సంతోషించాడు, నోవహు తన తరం వారిలో న్యాయవంతుడూ, నిందారహితుడూ, దుష్టులైన ప్రజల మధ్య జీవిస్తున్నాడు. దేవుడు నోవహుతో తాను ఒక గొప్ప జలప్రళయంతో భూమిని నాశనం చెయ్యబోతున్నట్టు చెప్పాడు. కనుక ఒక పెద్ద ఓడను చెయ్యమని నోవహుతో చెప్పాడు.
ఆ ఓడ పొడుగు మూడు వందల మూరలు, వెడల్పు యాభై మూరల. ఎత్తు ముప్ఫయి మూరల. కొలతతో దానిని నిర్మించాలని దేవుడు నోవహుతో చెప్పాడు. నోవహును ఓడను మ్రానుతో మూడంతస్తులుగా కట్టాడు, దానిలో అనేక గదులూ, ఒక కప్పు భాగం, ఒక కిటికీని ఉంచాడు. నోవహూ, అతని కుటుంబం, ప్రతివిధమైన భూజంతువూ జలప్రళయం సమయంలో ఓడ వారిని క్షేమంగా ఉంచుతుంది. నోవహు దేవునికి లోబడ్డాడు. దేవుడు వారికి చెప్పిన విధంగా నోవహూ, అతని కుమారులు ఓడను కట్టారు. ఓడ కట్టడానికి చాలా సమయం పట్టింది. ఎదుకంటే అది చాలా పెద్దది. రాబోతున్న జలప్రళయం గురించి నోవహు మనుష్యులందరితోనూ చెప్పాడు, దేవుని వైపు తిరగాలని చెప్పాడు, అయితే వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు.
దేవుడు నోవహుకూ, అతని కుటుంబానికీ వారి కోసం, జంతువులన్నిటి కోసం ప్రతివిధమైన మేతనూ భోజన పదార్థాలనూ కూర్చుకొని వారి వద్ద ఉంచుకోవాలని ఆజ్ఞాపించాడు. సమస్తం సిద్ధం అయిన తరువాత నోవహూ, అతని భార్య; అతని ముగ్గురు కుమారులూ, వారి భార్యలూ ఓడలోనికి ప్రవేశించే సమయం అని నోవహుతో చెప్పాడు-మొత్తం ఎనిమిది మంది.
దేవుడు ఓడలోనికి వెళ్ళేలా అన్ని రకాల జంతువులలో మగవాటినీ, ఆడవాటినీ, పక్షులను నోవహు వద్దకు పంపాడు. నోవహు వాటిని ఓడలోనికి చేర్చేలా జలప్రళయం సమయంలో అవి క్షేమంగా ఉండేలా వాటిని పంపాడు. అన్ని రకాల శుద్ధ జంతువులను ఏడు మగవాటినీ, ఏడు ఆడవాటినీ అవి బలియాగం కోసం వినియోగించేలా నోవహు వద్దకు పంపాడు. వారందరూ ఓడలోనికి వచ్చినప్పుడు దేవుడు తానే ఓడ ద్వారాన్ని మూసివేసాడు.
ప్రచండ వర్షం భూమిమీద నలభై రాత్రింబగళ్ళు కురుస్తూ ఉంది జలప్రళయం భూమిమీద నలభై రోజులు ఉంది. సర్వ ప్రపంచం నీటితో నిండిపోయింది. నీళ్ళ లోతు అత్యధికం కావడంచేత ఆకాశం క్రింద ఉన్న గొప్ప పర్వతాలు మునిగి పొయ్యాయి. ఆరిన నేలమీద ఉన్న వాటన్నిటిలో ముక్కు పుటాలలో ప్రాణశ్వాస ఉన్న ప్రతిదీ చచ్చింది. ఓడ నీటి మీద తేలియాడింది. దానిలోని ప్రతీదీ నీటిలో మునిగిపోకుండా కాపాడబడ్డాయి.
వర్షాలు నిలిచిపోయిన తరువాత, ఓడ నీటి మీద ఐదు నెలలు తేలియాడింది. ఆ సమయంలో నీరు కిందికి ఇంకడం ఆరంభించింది. ఒకరోజు ఓడ ఒక పర్వతం మీద నిలిచింది. అయితే లోకం అంతా ఇంకా నీటితో నిండిపోయింది. మూడు నెలల తరువాత పర్వతాల కొనలు కనిపించాయి.
తరువాత నలుబది రోజులకు నోవాహు కాకిని వెలుపలికి పంపించాడు, లోకం మీద నీరు ఇంకిపోయాయని కనుగొనడానికి నోవహు దానిని పంపాడు. పొడి ప్రదేశం దానికి దొరకని కారణంగా అది తిరిగి లోపలి వచ్చింది.
తరువాత నోవహు ఒక పావురాన్ని పంపాడు. అయితే అది కూడా పొడి ప్రదేశాన్ని కనుగొనలేకపోయింది. నోవహు వద్దకు తిరిగి వచ్చింది. ఒక వారం తరువాత నోవహు దానిని మరల బయటికి పంపాడు. అది తన నోట ఒక ఒలీవ కొమ్మను ఉంచుకొని ఒకలోనికి నోవహు వద్దకు వచ్చింది. నీరు పూర్తిగా ఇంకిపోయాయి. మొక్కలు తిరిగి ఎదగడం ఆరంభం అయ్యాయి.
నోవహు మరొక వారం రోజులు ఎదురుచూచాడు. మూడవసారి పావురాన్ని బయటికి పంపించాడు, అయితే ఈ సారి అది విశ్రమించే చోటు దొరకడం వలన ఓడలోనికి రాలేదు. నీరు పూర్తిగా ఎండిపోయింది!
రెండు నెలలు తరువాత దేవుడు నోవహుతో ఇలా చెప్పాడు, “నీవునూ, నీ కుటుంబమూ, సమస్త జంతువులునూ ఓడలోనుండి వెలుపలికి రండి. సంతానాన్ని కలిగియుండండి, ఫలించి భూమిని నిందించండి.” కనుక నోవహూ, అతని కుటుంబమూ ఓడనుండి బయటికి వచ్చారు.
నోవహు ఓడ నుండి బయటకు వచ్చిన తరువాత ఒక బలి పీఠాన్ని నిర్మించాడు, ఒక్కొక్క రకం జంతువులలో నుండి బలికి వినియోగించే వాటిని కొన్నింటిని హోమబలిగా అర్పించాడు. ఆ బలులను బట్టి దేవుడు సంతోషించాడు. దేవుడు ఇలా చెప్పాడు, “మనుష్యుల దుష్టత్వాన్ని బట్టి ఇక మీదట భూమిని నేను తిరిగి శపించను లేక జలప్రళయాలను రప్పించడం ద్వారా లోకాన్ని నాశనం చెయ్యను, వారు బాల్యము నుండి పాపులుగా ఉన్నారు.”
ఆ వాగ్దానానికి గుర్తుగా దేవుడు మొదటి ఇంద్రధనుస్సును చేసాడు. అది ఆకాశంలో కనిపించిన ప్రతీ సారీ దేవుడు తాను వాగ్దానం చేసినదానిని జ్ఞాపకం చెసుకొంటాడు, ఆయన ప్రజలు కూడా జ్ఞాపకం చేసుకొంటారు.
ఆదికాండం 11-15
జలప్రళయం తరువాత అనేక సంవత్సరాలకు లోకంలోని మనుష్యులు తిరిగి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసారు. ఒకరి పట్ల ఒకరు పాపం చేసారు. ఎందుకంటే వారందరూ ఒకే బాష మాట్లాడేవారు. దేవుడు తమకు ఆజ్ఞాపించిన ప్రకారంగా లోకాన్ని నింపడానికి బదులు ఒక నగరాన్ని కట్టడానికి ఒక చోట సమావేశం అయ్యారు. వారు చాలా గర్విష్టులుగా ఉన్నారు, వారు జీవించే విధానంలో దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించాలని కోరుకోలేదు. చెడు చెయ్యడానికి వారు కలిసి పనిచేస్తున్నట్లయితే వారు మరిన్ని పాపపు కార్యాలు చెయ్యవచ్చునని దేవుడు చూసాడు.
అందుచేత దేవుడు లోకమంతట్లో ఉండే భాషను యెహోవా అక్కడ తారుమారు చేసి వాళ్ళను అక్కడనుంచి భూతలమంతటా చెదరగొట్టాడు. వాళ్ళు ఆ నగరాన్ని కట్టడం మానుకొన్నారు. ఆ నగరానికి “బాబెలు” అనే పేరు వచ్చింది. దాని అర్థం “తారుమారు.” వందల సంవత్సరాల తరువాత, దేవుడు అబ్రాము అనే వ్యక్తితో ఇలా అన్నాడు, “నీవు నీ దేశం నుంచీ, నీ బంధువుల దగ్గరనుంచీ, నీ తండ్రి ఇంటినుంచీ బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నేను నిన్ను ఒక గొప్ప ప్రజ గా చేసి నిన్ను దీవించి, నీ పేరు గొప్ప చేస్తాను. నీవు దీవెనగా ఉంటావు. నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను. నిన్ను శపించేవారిని శపిస్తాను, నీమూలంగా లోకంలోని అన్ని వంశాలు ధన్యం అవుతాయి.”
కాబట్టి దేవుడు తనతో చెప్పిన మాట ప్రకారం అబ్రాము బయలుదేరాడు. అబ్రాము తన భార్య శారాయినీ, తన తమ్ముని కొడుకు లోత్‌నూ, హారానులో వారంతా గడించిన సంపదనూ, సంపాదించుకొన్న వ్యక్తులనూ తీసుకొని కనాను దేశానికి బయలుదేరి అక్కడికి చేరాడు. అబ్రాము అక్కడకి చేరినప్పుడు దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై, “నేనీ దేశం నీ సంతానానికి ప్రసాదిస్తాను, నీ సంతానం దానిని స్వాధీన పరచుకొంటారు” అన్నాడు. అబ్రాము ఆ భూభాగంలో స్థిరపడిపోయాడు.
ఒక రోజున సర్వాతీతుడైన దేవుని యాజకుడైన మెల్కీసెదెకు, యుద్ధంలో ఉన్న అబ్రామును కలుసుకున్నాడు. ఆయన అబ్రామును దీవిస్తూ ఇలా అన్నాడు, “ఆకాశాలనూ, భూమినీ సృజించిన సర్వాతీతుడైన దేవుడు అబ్రామును దీవిస్తాడు గాక. నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వాతీతుడైన దేవునికి స్తుతులు కలుగుతాయి గాక.” అబ్రాము ఆయనకు అన్నిట్లో పదో భాగమిచ్చాడు.
అనేక సంవత్సరాలు గడిచిపోయాయి, అయితే అబ్రాము శారాయిలకు కుమారుడు లేడు. దేవుడు అబ్రాముతో మాట్లాడాడు, అబ్రాముకు కుమారుడు పుడతాడని మరల వాగ్దానం చేశాడు. అబ్రాము సంతానం ఆకాశపు నక్షత్రాల్లా అవుతారని వాగ్దానం చేసాడు. అబ్రాము దేవుణ్ణి విశ్వసించాడు. అబ్రాము దేవుని వాగ్దానాన్ని నమ్మాడు కనుక దేవుడు అతనిని నీతిమంతుడిగా ప్రకటించాడు.
అప్పుడు దేవుడు అబ్రాముతో నిబంధన చేసాడు. సాధారణంగా నిబంధన అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు సహాయ చేసుకోడానికి చేసే అంగీకారం. అయితే ఈ విషయంలో అబ్రాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు అబ్రాముకు ఒక వాగ్దానం చేసాడు. అయినా అబ్రాము దేవుని స్వరాన్ని వినగలిగాడు. దేవుడు అబ్రాముతో ఇలా చెప్పాడు, “నీలో నుండి నీకు ఒక కుమారుడిని అనుగ్రహిస్తాను, ఈ కనాను భూభాగాన్ని నీ సంతానానికి ఇస్తాను.” అయినా అప్పటికి అబ్రాముకు కుమారుడు కలుగలేదు
ఆదికాండం 16-22
కుమారుణ్ణి అనుగ్రహిస్తాను. బాలునికి ఇస్సాకు అని పేరు పెడతావు. నేను ఇస్సాకుతో ఒడంబడిక చేస్తాను. అతనిని గొప్ప జనాంగముగా చేస్తాను. ఇష్మాయేలును గొప్ప జనాంగముగా చేస్తాను. అయితే నా ఒడంబడిక ఇస్సాకుతో ఉంటుంది.” అప్పుడు దేవుడు అబ్రాము పేరును అబ్రాహాముగా మార్చాడు. ఆ మాటకు అర్థం “జనములకు తండ్రి.” దేవుడు శారాయి పేరును కూడా ‘శారా’గా మార్చాడు, ఆ మాటకు అర్థం “రాకుమారి.”
దేవుడు తనతో చెప్పినట్టు ఆ రోజునే అబ్రాహాము తన కొడుకు ఇష్మాయేల్‌కు అతని మర్మాంగ చర్మానికి సున్నతి చేశాడు. తన దాసుల్లోనూ తాను డబ్బిచ్చి కొనుకొన్నవారిలోనూ మగవాళ్ళందరికీ అలా చేశాడు. ఒక సంవత్సరం తరువాత అబ్రాహాము వయస్సు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు శారా వయసు 90 సంవత్సరాలు ఉన్నప్పుడు శారా అబ్రహాముకు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. దేవుడు వారికి చెప్పిన విధంగా వారు ఆ బాలునికి ఇస్సాకు అని పేరుపెట్టారు.
ఇస్సాకు యువకునిగా ఉన్నప్పుడు దేవుడు అబ్రాహామును పరిశోధించాడు “అతణ్ణి “అబ్రాహామూ” అని పిలవగా అతడు “చిత్తం, ప్రభూ” అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, “నీ ఒకే ఒక కొడుకును – నీ ప్రేమ చూరగొన్న కొడుకైన ఇస్సాకును తీసుకొని మోరీయా ప్రదేశానికి వెళ్ళు. అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతం మీద అతణ్ణి హోమబలిగా అర్పించు.” మరల అబ్రహాము దేవునికి లోబడ్డాడు. తన కుమారుడిని దేవునికి బలిగా అర్పించదానికి సిద్ధపడ్డాడు.
వారిద్దరూ కలిసి బలి అర్పించే స్థలానికి సాగిపోతూ ఉంటే, ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును ఉద్దేశించి “నాన్నా” అన్నాడు. అబ్రాహాము “ఏం బాబు?” అన్నాడు. “ఇవిగో నిప్పూ కత్తీ ఉన్నాయి గానీ, హోమబలికోసం గొర్రెపిల్ల ఎక్కడ?” అని అడిగాడు ఇస్సాకు. “దేవుడే హోమబలికోసం గొర్రెపిల్లను చూచుకొంటాడు బాబూ” అని అబ్రాహాము జవాబిచ్చాడు.
దేవుడు చెప్పిన బలి స్థలానికి వారు చేరుకొన్నప్పుడు అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠం కట్టి దానిమీద కట్టెలు చక్కగా పేర్చాడు. తన కొడుకైన ఇస్సాకును బంధించాడు, ఆ పీఠం మీద ఉన్న కట్టెలమీద పెట్టాడు. అప్పుడు అబ్రాహాము తన కొడుకును వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకొన్నాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, “అబ్బాయి మీద చెయ్యి వేయకు, దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసిపోయింది, ఎందుకంటే నీ ఒకే ఒక కొడుకును నాకివ్వడానికి వెనక్కు తీయలేదు.
అప్పుడు అబ్రాహాము తలెత్తి చూడగా వెనుక దిక్కున పొదలో కొమ్ములు చిక్కుకొన్న ఒక పొట్టేలు కనిపించింది. ఇస్సాకు స్థానంలో దేవుడు ఒక పొట్టేలును అనుగ్రహించాడు. అబ్రహాము దానిని పట్టుకొని, తన కొడుకు స్థానంలో హోమబలిగా సమర్పించాడు.
అప్పుడు దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నాడు, “నీవిలా చేసి నీ ఒకే ఒక కొడుకును ఇవ్వడానికి వెనక్కు తీయలేదు. గనుక నేను నిన్ను తప్పనిసరిగా దీవిస్తాను. నీ సంతానాన్ని తప్పక వృద్ధి చేసి, లెక్కకు ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్రతీరం ఇసుక రేణువులలాగా చేస్తాను. నీ సంతానం మూలంగా లోకంలోని జనాలన్నీ ధన్యమవుతాయి అని నాతోడని ప్రమాణం చేశాను. ఎందుకంటే, నీవు నా మాట విన్నావు.”
ఆదికాండం 24:1-25:26
అబ్రాహాము అబ్రాహాము వయసు మళ్ళిన వృద్ధుడు అయ్యాడు. ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు. కాబట్టి తన సేవకుని పిలిచి తన స్వదేశానికీ, తన బంధువుల దగ్గరికీ వెళ్ళి అక్కడ ఇస్సాకుకు భార్యను తీసుకొని రమ్మని పంపాడు. చాలా దూరంలో ఉన్న అబ్రాహాము బంధువులు నివసించే ప్రాంతానికి ప్రయాణం చేసిన తరువాత దేవుడు అబ్రాహాము సేవకుడిని రిబ్కా వద్దకు నడిపించాడు. ఆమె అబ్రాహాము సోదరుని మనుమరాలు.
రిబ్కా తన కుటుంబాన్ని విడిచిపెట్టడానికీ, సేవకునితో ఇస్సాకు ఇంటికి రావడానికీ అంగీకరించింది. ఆమె ఇంటికి వచ్చిన వెంటనే ఇస్సాకు ఆమెను పెండ్లి చేసుకొన్నాడు.
చాలా కాలం తరువాత అబ్రాహాము చనిపోయాడు, అప్పుడు దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనను బట్టి అబ్రాహాము కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. అసంఖ్యాకమైన సంతానాన్ని అనుగ్రహిస్తానని చేసిన వాగ్దానం ఆ నిబంధనలో ఒక భాగం. అయితే ఇస్సాకు భార్య రిబ్కాకు పిల్లలు లేరు.
ఇస్సాకు రిబ్కా కోసం ప్రార్థన చేసాడు. దేవుడు ఆమెకు కవల పిల్లలను గర్భం ధరించడానికి అనుమతించాడు. తల్లి గర్భంలో ఉండగానే ఇద్దరు బిడ్డలు ఒకరితో ఒకరు పోట్లాడుకొనేవారు, జరగబోతున్నదానిని గురించి రిబ్కా దేవుణ్ణి అడిగింది.
దేవుడు ఆమెతో ఇలా చెప్పాడు, “నీ గర్భంలో రెండు జనాలు ఉన్నాయి. నీలోనుంచి ఇద్దరు గోత్రకర్తలు వస్తారు. పుట్టుకనుంచే ఒకడంటే రెండోవాడికి గిట్టదు. ఒక గోత్రం కంటే మరో గోత్రం బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు.”
ప్రసవ దినం వచ్చింది. ఆమె గర్భంలో కవల పిల్లలున్నారు. మొదటివాడు ఎర్రని వాడుగా ఒళ్ళంతటికీ రోమ వస్త్రం చుట్టి ఉన్నట్టు బయటికి వచ్చాడు గనుక అతడికి ఏశావు అనే పేరు పెట్టారు. తరువాత ఏశావు మడమను పట్టుకొని అతడి తమ్ముడు బయటికి వచ్చాడు గనుక అతడికి యాకోబు అనే పేరు పెట్టారు.
ఆదికాండం 25:27-35:29
జ్యేష్టకుమారునిగా తన జన్మ హక్కునూ, తన ఆశీర్వాదాలన్నిటినీ యాకోబు దొంగిలించినందుకు అతని పట్ల ఏశావు ద్వేషాన్ని పెంచుకొన్నాడు. తన తండ్రి చనిపోయిన తరువాత యాకోబును చంపాలని ప్రణాళిక వేసుకొన్నాడు. అయితే రిబ్కా ఏశావు ప్రణాళికను గురించి విన్నది. తానునూ తన భర్త ఇస్సాకును కలిసి యాకోబును తన బంధువుల వద్దకు దూర ప్రదేశానికి పంపించివేశారు.
రిబ్కా బంధువుల వద్ద యాకోబు అనేక సంవత్సరాలు నివసించాడు. ఆ కాలంలో యాకోబు వివాహం చేసుకొన్నాడు, వారికి పన్నెండు మంది కుమారులు, ఒక కుమార్తె కలిగారు. దేవుడు యాకోబును అత్యంత సంపద కలిగిన వానిగా చేసాడు. కనానులోని తన ఇంటినుండి బయటకు వచ్చిన 20 సంవత్సరాల తరువాత యాకోబు తన కుటుంబంతోనూ, సేవకులతోనూ, తన పశుసంపద అంతటితోనూ స్వదేశానికి తిరిగి వచ్చాడు.
ఏశావు తనను ఇంకా చంపాలని తిరుగుతున్నాడని యాకోబు చాలా భయపడ్డాడు. కాబట్టి యాకోబు గొప్ప పశు సంపదను బహుమతిగా ఏశావు వద్దకు పంపాడు. ఈ బహుమతులను తీసుకొని సేవకులు ఏశావు వద్దకు వెళ్లి ఇలా అన్నారు, “నీ సేవకుడు యాకోబు ఈ బహుమతులు నీకిచ్చాడు, అతడు నీ వద్దకు వస్తున్నాడు.”
అయితే ఏశావు యాకోబు చంపాలని అనుకోవడం లేదు. దానికి బదులు తన సోదరుడు యాకోబు చూచినందుకు ఏశావు బహుగా సంతోషించాడు. యాకోబు నెమ్మదితో కనానులో నివసించాడు. అప్పుడు ఇస్సాకు చనిపోయాడు. యాకోబు, ఎశావులు అతనిని సమాధి చేసారు. దేవుడు అబ్రాహముతో చేసిన నిబంధన ఇస్సాకునుండి యాకోబుకు వచ్చింది.
ఆదికాండం 37-50అనేక సంవత్సరాల తరువాత, యాకోబు వృద్దుడయిన తరువాత తనకు అత్యంత ప్రీతి పాత్రుడైన కుమారుడు యోసేపును పొలములో మందను కాస్తున్న తన సోదరులను పరామర్శించడానికి పంపాడు.
యోసేపు సహోదరులు అతనిని ద్వేషించారు, ఎందుకంటే తమ తండ్రి యోసేపును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యోసేపు వారి పరిపాలకుడిగా ఉంటాడని కలలు కన్నాడు. యోసేపు అతని అన్నల వద్దకు వచ్చినప్పుడు వారు అతనిని అవమానపరచారు, బానిస వర్తకులకు అమ్మి వేశారు.
యోసేపు ఇంటికి రావడానికి ముందు, వారు యోసేపు అంగీని చించారు, గొర్రె పిల్ల రక్తంలో ముంచారు, ఆ అంగీని తమ తండ్రి యాకోబుకు చూపించారు, ఒక అరణ్యపు జంతువు యోసేపును చంపియుండవచ్చునవి యాకోబుకు చెప్పారు. యాకోబు చాలా దుఃఖపడ్డాడు.
బానిస వర్తకులు యోసేపును ఐగుప్తుకు తీసుకొని వెళ్ళారు. ఐగుప్తు దేశం నైలు నదీ తీరంలో ఉన్న అతి పెద్ద శక్తివంతమైన దేశం. ఒక ప్రభుత్వ అధికారికి యోసేపును ఒక బానిసగా వారు అమ్మి వేశారు. యోసేపు తన యజమానికి నమ్మకంగా సేవ చేసాడు. దేవుడు యోసేపును ఆశీర్వదించాడు.
అతని అధికారి భార్య యోసేపుతో వ్యభిచరించాలని ప్రయత్నించింది, అయితే యోసేపు దేవునికి వ్యతిరేకంగా ఈ విధంగా పాపం చెయ్యడానికి నిరాకరించాడు. ఆమె చాలా కోపగించుకొంది, యోసేపు మీద తప్పుడు నిందలు వేసింది, ఫలితంగా యోసేపును బంధించి చెరసాలలో వేశారు. చెరసాలలో సయితం యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుడు యోసేపును ఆశీర్వదించాడు.
రెండు సంవత్సరాల తరువాత తాను నిరపరాధి అయినప్పటికీ యోసేపు ఇంకా చెరసాలలో ఉన్నప్పుడు ఒక రాత్రి ఐగుప్తీయులు తమ రాజుగా పిలుచుకొనే ఫరోకు రెండు కలలు వచ్చాయి. అతని సలహాదారులలో ఏ ఒక్కరునూ ఆ కలల భావాన్ని చెప్పలేక పోయారు.
కలల భావాన్ని చెప్పే సామర్ధ్యాన్ని దేవుడు యోసేపు అనుగ్రహించాడు. కనుక ఫరో చెరసాలలో నుండి యోసేపును వెలుపలికి రప్పించాడు. యోసేపు ఆ కలల భావాన్ని ఫరోకు తెలియచెప్పాడు, రాజుతో ఇలా అన్నాడు, “దేవుడు రానున్న ఏడు సంవత్సరాలలో విస్తారమైన పంటను నీకు అనుగ్రహించబోతున్నాడు, దాని తరువాత ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది.” యోసేపు చెప్పిన దాని విషయంలో ఫరో చాలా సంతోషించాడు, ఐగుప్తులో చక్రవర్తి తరువాత స్థానంలో యోసేపును నియమించాడు.
ఏడు సంవత్సరాల పంట కాలంలో ఆ పంటను దాచియుంచాలని యోసేపు అధికారులకు ఆజ్ఞాపించాడు. కరువు వచ్చిన ఏడు సంవత్సరాల కాలంలో ధాన్యాన్ని ప్రజలకు అమ్మాడు, తద్వారా ప్రజల ఆహారానికి కొదువ లేకుండా ఉంది.
కరువు కాలం ఐగుప్తు కాలంలో మాత్రమే కాక యాకోబూ, అతని కుటుంబం నివసిస్తున్న కనానులో కూడా విస్తారంగా ఉంది. అందుచేత యాకోబు ఆహారాన్ని కొనడానికి తన పెద్ద కుమారులను ఐగుప్తుకు పంపాడు. ఆ సహోదరులు ఆహారాన్ని కొనడానికి యోసేపు ముందు నిలిచినప్పుడు యోసేపును గుర్తు పట్టలేక పోయారు. అయితే యోసేపు వారిని గుర్తుపట్టారు. తన సహోదరులు మార్పు చెందారో లేదో అని వారిని పరీక్షించిన తరువాత యోసేపు వారితో ఇలా అన్నాడు, “నేను మీ సహోదరుడను, యోసేపును! భయపడకండి. ఒక బానిసగా నన్ను అమ్మినప్పుడు మీరు నాకు హాని కలుగచెయ్యడానికి ప్రయత్నించారు. అయితే దేవుడు కీడును మేలుగా మార్చాడు! రండి, ఐగుప్తులో నివసించండి తద్వారా నేను మీకునూ, మీ కుటుంబాలకునూ పోషణ కలుగ జేస్తాను.” యోసేపు సహోదరులు ఇంటికి చేరినప్పుడు వారి జరిగినవాటన్నిటిని తమ తండ్రి, యాకోబుతో చెప్పారు. యోసేపు సజీవుడిగా ఉన్నాడని చెప్పారు. యాకోబు అధికంగా సంతోషించాడు. యాకోబు వృద్దుడైనప్పటికీ తన కుటుంబం అంతటితో ఐగుప్తుకు ప్రయాణం అయ్యాడు. వారు అందరూ అక్కడ నివాసం చేసారు. యాకోబు చనిపోవడానికి ముందు తన కుమారులందరినీ ఆశీర్వదించాడు. అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన నిబంధన వాగ్దానాలు ఇస్సాకుకు, తరువాత యాకోబుకు, ఆ తరువాత యాకోబు పన్నెండు మంది కుమారులు, వారి కుటుంబాలకు కొనసాగాయి. యాకోబు పన్నెండు కుమారుల సంతానం ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలుగా మారారు.
నిర్గమకాండం 1-4
మోషే తన మామ గొర్రెల మందను సంరక్షిస్తున్నాడు. ఒక పొద మండుచుండడం చూచాడు. ఆ పొద కాలిపోకుండా మండుతూ ఉంది. మోషే ఆ పొదవద్దకు వెళ్లి దానిని చూచాడు. మోషే ఆ పొద వద్దకు వెళ్లినప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “మోషే నీ చెప్పులు విడువుము, నీవు నిలుచుండిన స్థలం పరిశుద్ధ స్థలం.”
దేవుడు ఇలా చెప్పాడు, “నేను నీ తండ్రి యొక్క దేవుణ్ణి, అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిజంగా చూశాను. ఆ దేశంనుంచి విశాలమైన మంచి దేశానికి, పాలు తేనెలు నదులై పారుతున్న కనాను దేశానికి వారిని తీసుకు వెళ్ళడానికి దిగివచ్చాను.”
దేవునితో మోషే అన్నాడు, “ఫరో దగ్గరికి వెళ్ళడానికీ ఇస్రాయేలు ప్రజను ఐగుప్తు నుంచి తీసుకు రావడానికీ నేను ఏపాటివాణ్ణి? వారు నన్ను ‘ఆయన పేరేమిటి?’ అని అడగవచ్చు. అలాంటప్పుడు వారితో నేనేం చెప్పాలి?” అన్నాడు. దేవుడు మోషేకు జవాబిస్తూ “నేను శాశ్వతంగా ఉన్నవాడను” అన్నాడు. ఆయన ఇంకా అన్నాడు, “నీవు ఇస్రాయేలు ప్రజతో ‘ఉన్నవాడు’ నన్ను మీ దగ్గరికి పంపాడు అనాలి.” ‘మీ దగ్గరికి నన్ను పంపినది యెహోవా, మీ పూర్వీకుల దేవుడు – అబ్రాహాముకు దేవుడు, ఇస్సాకుకు దేవుడు, యాకోబుకు దేవుడు,
మోషే భయపడ్డాడు, ఫరో వద్దకు వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే తాను సరిగా మాట్లాడలేడు. కనుక దేవుడు మోషే సహోదరుడిని, ఆహారోనును అతనితో పాటు పంపాడు.
యోసేపు చనిపోయిన తరువాత అతని బంధువులందరూ ఐగుప్తులో నిలిచిపోయారు. ఆ విధంగా వాళ్ళు ఆ దేశం నలుమూలలా వ్యాపించారు. వారూ, వారి సంతానం అనేక సంవత్సరాలు అక్కడే కొనసాగారు, వారిని ఇశ్రాయేలీయులు అని పిలిచారు. ఇస్రాయేల్ ప్రజ ఫలవంతమై బహు సంతానంతో సంఖ్యలో అధికమై బలం గల జనం అయింది యోసేపు వారికి చేసిన సహాయం విషయంలో ఇక మీదట కృతజ్ఞత చూపించలేదు. ఇశ్రాయేలీయుల విషయంలో వారు భయపడ్డారు, ఎందుకంటే వారు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. అందుచేత ఆ కాలంలో ఐగుప్తును పాలిస్తున్న ఫరో ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులకు దాసులుగా చేసాడు.
ఐగుప్తీయులు అనేక కట్టడాలను నిర్మించదానికి ఇశ్రాయేలీయులను బలవంత పెట్టారు. పూర్తి నగరాలను వారితో కట్టించారు. వారు పడిన కష్టం వారిని మరింత దుఃఖపరచింది. అయితే దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారికి మరింత సంతానం కలిగింది. ఇశ్రాయేలీయులు తమ సంతానంతో మరింత విస్తరించడం ఫరో చూచాడు. కనుక ఇశ్రాయేలు మగ శిశువులను నైలు నదిలో పవేయడం ద్వారా వారిని చంపివేయాలని ఫరో తన ప్రజలకు ఆజ్ఞాపించాడు.
ఒక ఇశ్రాయేలు స్త్రీ ఒక మగశిశువుకు జన్మనిచ్చింది. ఆమె, తన భర్తతో కలిసి వారు దాచగలిగినంత కాలం ఆ మగబిడ్డను దాచియుంచారు. వారు ఆ బిడ్డను ఇంకా దాచిపెట్టలేక వాడికోసం జమ్ము గంప తీసుకొని దానికి జిగట మట్టినీ కీలునూ పూసింది. అందులో ఆ పిల్లవాణ్ణి ఉంచి నది ఒడ్డున ఉన్న జమ్ము గడ్డిలో దాన్ని పెట్టింది. వాడికి ఏం సంభవిస్తుందో చూడడానికి ఆ పిల్లవాడి అక్క కొంత దూరంగా నిలిచి ఉంది.
ఫరో కూతురు నదికి స్నానానికి వచ్చింది. ఆమె చెలికత్తెలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె అక్కడి తుంగలో ఆ జమ్ము గంపను చూచి తన దాసిని పంపి దాన్ని తెప్పించింది. దాన్ని తెరచి ఆ పిల్లవాణ్ణి చూచింది. వాడు ఏడుస్తున్నాడు. ఆమెకు వాడిమీద జాలి వేసింది. ఒక ఇశ్రాయేలు స్త్రీని ఆ పిల్లవాడికి దాదిగా ఉంచింది. ఆమె ఆ పిల్లవాని తల్లి అని ఆమెకు తెలియదు. తల్లిపాలు అవసరంలేనంత వరకు ఆ పిల్లవాడు పెరిగిన తరవాత ఆమె అతణ్ణి ఫరో కూతురు దగ్గరకు తీసుకువచ్చింది. అతడు చక్రవర్తి కూతురికి పెంపుడు కొడుకు అయ్యాడు. “నీళ్ళలోనుంచి అతణ్ణి తీశాను” అని చెప్పి ఆమె అతనికి ‘మోషే’ అనే పేరు పెట్టింది.
మోషే పెద్దవాడయ్యిన తరువాత ఒక రోజున ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలు బానిసను కొట్టడం మోషే చూసాడు, తన తోటి ఇశ్రాయేలీయుడిని కాపాడడానికి మోషే ప్రయత్నించాడు.
అతడు అటూ ఇటూ పారచూచి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఈజిప్టు వాణ్ణి చంపి అతడి శవాన్ని ఇసుకలో కప్పి పెట్టాడు. అయితే ఒకడు మోషే చేసిన దానిని చూచాడు.
మోషే చేసిన పని ఫరోకు తెలిసింది. మోషేను చంపదానికి ప్రయత్నించాడు. అయితే మోషే ఐగుప్తు నుండి అరణ్యంలోనికి పారిపోయాడు. ఫరో సైనికులు అతనిని కనుగొనలేకపోయారు.
ఐగుప్తునుండి దూరంలో ఉన్న అరణ్యంలో మోషే ఒక గొర్రెల కాపరి అయ్యాడు. ఆ స్థలం నుండి ఒక స్త్రీను మోషే వివాహం చేసుకొన్నాడు. వారికి ఇద్దరు కుమారులు కలిగారు.మోషే చేసిన పని ఫరోకు తెలిసింది. మోషేను చంపదానికి ప్రయత్నించాడు. అయితే మోషే ఐగుప్తు నుండి అరణ్యంలోనికి పారిపోయాడు. ఫరో సైనికులు అతనిని కనుగొనలేకపోయారు.
నిర్గమకాండం 5-10
ఫరో కఠినంగా ఉంటాడని మోషే ఆహారోనులకు దేవుడు ముందుగానే హెచ్చరించాడు. వారు ఫరో వద్దకు వెళ్ళినప్పుడు ఫరోతో ఇలా చెప్పారు, “ఇస్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు: నా ప్రజలు ఎడారిలో నాకు మహోత్సవం చేసేందుకు వారిని వెళ్ళనియ్యి.” అయితే ఫరో వారి మాటలు వినలేదు. ఇశ్రాయేలీయులను స్వతంత్రులను చెయ్యడానికి బదులు మరింత కఠినంగా పనిచెయ్యడానికి బలవంతపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలను విడుదల చెయ్యడానికి ఫరో నిరాకరిస్తూ ఉన్నాడు. అందుచేత దేవుడు భయంకరమైన పది తెగుళ్ళను వారి మీదకు పంపించాడు. ఈ తెగుళ్ళ ద్వారా దేవుడు తాను ఫరో కంటే, ఐగుప్తు దేవుళ్ళందరి కంటే అధికుడినని కనుపరచుకొన్నాడు
దేవుడు నైలు నదిని రక్తంగా మార్చాడు, అయినా ఫరో ఇశ్రాయేలీయులను విడిచిపెట్టలేదు. దేవుడు ఐగుప్తు మీదకు కప్పలను పంపించాడు. కప్పలను తొలగించాలని ఫరో మోషేను బతిమాలాడు. కప్పలు చనిపోయిన తరువాత ఫరో తన హృదయాన్ని కఠినపరచుకొన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టలేదు.
అందుచేత దేవుడు దోమల వల్లనైన తెగులును పంపించాడు. తరువాత దేవుడు ఈగలను తెగులుగా పంపించాడు. ఫరో మోషే ఆహారోనుల కోసం కబురు పంపించాడు, ఈ తెగులును నిలుపు చేసిన యెడల ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్ట వచ్చునని చెప్పాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఐగుప్తునుండి సమస్త ఈగలను తొలగించాడు. అయితే ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకొన్నాడు. ప్రజలను విడిచి పెట్టడానికి నిరాకరించాడు.
తరువాత ఐగుప్తీయులకు చెందిన జంతువులన్నింటినీ చనిపోయేలా చేసాడు. అయినా ఫరో హృదయం కఠినం అయ్యింది, ఇశ్రాయేలీయులను విడిచిపోనివ్వలేదు.
అప్పుడు దేవుడు మోషే అహరోనులతో “మీరు కొలిమిలోనుంచి పిడికిళ్ళ బూడిద తీసుకొని ఫరో చూస్తుండగానే మోషే దాన్ని ఆకాశంవైపు విసిరివెయ్యాలి. బూడిద ఈజిప్ట్ దేశమంతటిమీద సన్నని దుమ్ము అవుతుంది: అది ఐగుప్టు దేశంలో అంతటా మనుషులమీదా జంతువులమీదా చీము పట్టే కురుపులవుతుంది” అన్నాడు. దేవుడు చెప్పిన విధంగా మోషే చేసినప్పుడు అది మనుషులమీదా జంతువులమీదా చీము పట్టే కురుపులయింది. అయితే ఫరో గుండె బండబారిపోయేలా యెహోవా చేశాడు. యెహోవా మోషేతో చెప్పిన ప్రకారమే అతడు వారి మాటను నిర్లక్ష్యం చేశాడు.
దాని తరువాత దేవుడు బాధకరమైన వడగండ్లను కురిపించాడు, ఆ వడగండ్లు ఐగుప్తు అంతటా వెలుపల ఉండేదాన్నంతా జంతువులనూ మనుషులనూ పొలాల్లో మొక్కలనూ పడగొట్టాయి. ప్రతి చెట్టూ కూడా విరిగిపోయింది. అప్పుడు ఫరో మోషేనూ అహరోన్నూ పిలిపించి వారితో “ఈ సారి నేను తప్పిదం చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేనూ నాప్రజా దోషులం.✝ దేవుడు పంపిన ఈ ఉరుములూ వడగండ్లూ ఇక చాలు, వాటిని ఆపమని యెహోవాను వేడుకోండి . నేను మిమ్మల్ని వెళ్ళనిస్తాను. ఇకనుంచి మిమ్మల్ని నిలుపను” అన్నాడు. మోషే ప్రార్థన చేసాడు, వడగండ్లు ఆకాశం నుండి నిలిచిపోయాయి.
అయితే ఫరో మరల పాపం చేసాడు, తన హృదయాన్ని కఠినం చేసుకొన్నాడు. ఇశ్రాయేలీయులను పోనివ్వలేదు. అప్పుడు దేవుడు ఐగుప్తు దేశం అంతటిమీద గాలిలో ఎగిరే మిడతలను రప్పించాడు. అవి దేశాన్నంతా కమ్మాయి; దేశం చీకటిగా అయిపోయింది. వడగండ్ల వల్ల నాశనం గాక పొలాల్లో మిగిలిన ప్రతి మొక్కనూ చెట్ల పండ్లన్నిటినీ తినివేశాయి.
తరువాత దేవుడు దట్టమైన చీకటిని పంపాడు, అది ఆ దేశం అంతా మూడు రోజులు ఉంది. ఆ మూడు రోజుల్లో ఒకరినొకరు చూడలేకపోయారు. ఎవ్వరూ తానున్న స్థలంనుంచి లేవలేకపోయారు. అయితే ఇస్రాయేల్ ప్రజ నివసించే స్థలాల్లో వెలుగు ఉంది. తొమ్మిది తెగుళ్ళు అయిన తరువాత కూడా ఇశ్రాయేలీయులను విడిచిపెట్టడానికి నిరాకరించాడు. ఫరో దేవుని మాటను వినని కారణంగా ఫరో మనసు మారునట్లు దేవుడు చివరి తెగులును పంపించడానికి ప్రణాళిక చేసాడు.
నిర్గమకాండం 11:1-12:32
దేవుడు మోషే, ఆహారోనులను ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వాలని చెప్పాడానికి ఫరో వద్దకు పంపాడు. తమ ప్రజలను వెళ్ళనివ్వని యెడల మొదట పుట్టిన సంతానమంతా చనిపోవడం జరుగుతుంది. అంటే, తన సింహాసనం మీద కూర్చున్న ఫరోకు మొదట పుట్టిన సంతానం మొదలుకొని తిరగలి విసిరే పనికత్తెకు మొదట పుట్టిన సంతానం వరకు, పశువుల్లో కూడా తొలి సంతానమంతా చనిపోవడం జరుగుతుంది.’ అని వారు ఫరోను హెచ్చరించారు. ఈ హెచ్చరికను ఫరో వినినప్పుడు అతడు ఆ మాటను ఇంకా నిరాకరించాడు, దేవునికి విధేయత చూపించడానికి తృణీకరించాడు.
తనను విశ్వసించిన ప్రతి ఒక్కరి మొదటి కుమారుడు రక్షించబడే ఏర్పాటును దేవుడు చేసాడు. ప్రతీ ఒక్క కుటుంబం ఒక పరిపూర్ణమైన గొర్రెపిల్లను ఎంపిక చేసుకోవాలి, దానిని చంపాలి.
జంతువు రక్తంలో కొంత తీసుకొని దాని మాంసం ఏ ఇంట్లో తింటారో ఆ ఇంటి గుమ్మం రెండు నిలువు కమ్ములమీదా పైకమ్మిమీదా పూయాలి అని దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు, ఆ రాత్రే వారు దాన్ని కాల్చి ఆ మాంసం తినాలి . పొంగజేసే పదార్థం లేకుండా చేసిన రొట్టెతోను చేదు కూరాకులతోను దాన్ని తినాలి. వారు ఆ భోజనం చేసిన వెంటనే ఆ రాత్రి ఐగుప్తును విడిచి వెళ్ళడానికి సిద్ధపడి యుండాలని దేవుడు వారికి చెప్పాడు.
దేవుడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు చేసారు. మధ్య రాత్రి దేవుడు ఐగుప్తు అంతటిలోనూ ప్రతీ ప్రథమ సంతానాన్ని హతం చేసాడు. పస్కాపశువు రక్తం తమ ఇంటి ద్వారా బంధాలమీద రాసిన ప్రతీ ఇంటిని దేవుడు దాటి వెళ్ళాడు. ఆ ఇంటిలో ఉన్న ప్రతీ ఒక్కరూ భద్రంగా ఉన్నారు. గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి వారు రక్షణ పొందారు.
అయితే ఐగుప్తీయులు దేవుణ్ణి విశ్వసించలేదు. ఆయన ఆజ్ఞలకు లోబడలేదు. అందుచేత దేవుడు వారు గృహాలను దాటి వెళ్ళలేదు. ఐగుప్తీయులలోని ప్రతీ ప్రథమ సంతానాన్ని దేవుడు హతం చేసాడు. తన సింహాసనం మీద కూర్చుండే చక్రవర్తి మొదలుకొని చెరసాలలో ఉండే ఖైదీ వరకు వాళ్ళకు మొదట పుట్టిన సంతానాన్నంతా, పశువుల తొలిపిల్లలను కూడా, దేవుడు సంహారం చేశాడు. శవం లేని ఇల్లంటూ ఒక్కటీ లేదు, గనుక ఐగుప్తులో గొప్ప ఏడ్పు పుట్టింది.
ఆ రాత్రి చక్రవర్తి మోషేనూ అహరోన్నూ పిలిపించి ఇలా అన్నాడు: “మీరూ ఇస్రాయేల్ ప్రజలంతా లేచి నా ప్రజల మధ్యనుంచి వెళ్ళిపొండి. మీరు కోరుకున్నట్టు యెహోవాను ఆరాధించి సేవించండి. ఐగుప్తు ప్రజలు కూడా ఇశ్రాయేలీయులను వెంటనే వెళ్లిపోవాలని బతిమాలాడారు.
నిర్గమకాండం 12:33-15:21
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని సంతోషంగా విడిచి పెట్టారు. వారిక మీదట బానిసలు కాదు. వారు వాగ్దాన దేశానికి వెళ్తున్నారు. అంతకుముందు ఇస్రాయేలు ప్రజలు మోషే మాట ప్రకారం చేసి ఐగుప్తు వాళ్ళ దగ్గర వెండి బంగారు నగలనూ వస్త్రాలనూ అడిగి తీసుకొన్నారు. ఐగుప్తువాళ్ళు ఇస్రాయేల్ ప్రజలను దయచూచేలా యెహోవా చేశాడు గనుక వారేమేమి కోరారో వాటిని వారికిచ్చారు. ఇతర దేశాల ప్రజలు దేవుణ్ణి విశ్వసించారు, వారు ఇశ్రాయేలీయులతో పాటు వెళ్ళారు.
పగటివేళ వారికి వెళ్ళవలసిన దారి చూపడానికీ రాత్రివేళ వెలుగు ఇవ్వడానికీ వారికి ముందుగా యెహోవా వెళ్ళాడు. పగటి వేళ స్తంభంలాంటి మేఘంలో, రాత్రివేళ స్తంభంలాంటి అగ్నిలో వెళ్ళాడు. ఈ విధంగా వారు పగలూ రాత్రీ ప్రయాణం .చేయగలిగారు. అన్ని సమయాలలో దేవుడు వారితో ఉన్నాడు, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని నడిపించాడు. వారు చెయ్యవలసినదంతా దేవుణ్ణి అనుసరించడమే.
కొంత కాలం అయిన తరువాత ప్రజలు పారిపొయ్యారని ఐగుప్తు చక్రవర్తికి తెలియవచ్చినప్పుడు అతడూ అతడి పరివారమూ వారిని గురించి మనసు మార్చుకొన్నారు. వారు ఇశ్రాయేలీయులను తిరిగి తమ బానిసలుగా చేసుకోవాలని కోరుకున్నారు. కనుక అతడు తన రథాన్ని సిద్ధం చేయించుకొని తన జనాన్ని వెంటబెట్టుకొని బయలుదేరాడు. ఐగుప్తు చక్రవర్తి ఫరో గుండె బండబారిపోయేలా యెహోవా చేశాడు గనుక అతడు ఇస్రాయేల్ ప్రజను తరిమాడు. యెహోవా దేవుడు ఫరో కంటెనూ, ఐగుప్తులో ఉన్న దేవుళ్ళకంటెనూ శక్తిగలవాడు..
ఫరో వారిదగ్గరకు వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఫరో సైన్యానికి, ఎర్రసముద్రానికి మధ్య చిక్కుకుపోయామని గుర్తించారు. ఇస్రాయేల్‌ప్రజలు చాలా భయంతో యెహోవాకు ఆక్రందన చేశారు. వారు మోషేతో ఇలా అన్నారు, “ఐగుప్తులో సమాధులు లేవని ఈ ఎడారిలో మేము చచ్చిపోవాలని మమ్మల్ని ఇక్కడికి తెచ్చారా?వచ్చారు. అందుకు మోషే “భయపడకండి! దేవుడు మీకోసం యుధ్ధం చేస్తాడు.” అప్పుడు దేవుడు మోషేతో ‘ముందుకు సాగిపోండి’ అని ఇస్రాయేలు ప్రజలతో చెప్పు.
అప్పుడు దేవుడు మేఘస్తంభాన్ని ముందుకు కదిపాడు, ఐగుప్తీయులకూ, ఇశ్రాయేలీయులకు మధ్య దానిని నిలిపాడు. కనుక ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను చూడలేక పోయారు. దేవుడు మోషేను తన చేతికర్రను ఎత్తి తన చెయ్యి సముద్రంమీద చాపమన్నాడు. దేవుడు బలమైన తూర్పు గాలి రాత్రంతా వీచేలా చేసి సముద్రాన్ని తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాడు.
ఇస్రాయేల్ ప్రజలు సముద్రం మధ్య ఆరిన నేలమీద నడుస్తూ వెళ్ళారు. వారి కుడిప్రక్కకూ ఎడమప్రక్కకూ నీళ్ళు గోడల్లాగా నిలిచాయి అప్పుడు దేవుడు మేఘ స్తంభాన్ని ఇశ్రాయేలు ప్రజల మీద నుండి తొలగించాడు తద్వారా వారు పారిపోతున్నట్టు ఐగుప్తు ప్రజలు చూసారు. వారిని తరిమి సంహరించాలని ఐగుప్తు ప్రజలు నిశ్చయించారు. ఐగుప్తు వారూ, ఫరో గుర్రాలూ రథాలూ రౌతులంతా వారిని తరుముతూ సముద్రంలోకి వెళ్ళారు. ఐగుప్తు వాళ్ళ సైన్యాన్ని భయపడేలా చేసి వాళ్ళ రథచక్రాలు ఊడిపడేలా చేశాడు. అందుచేత వారు “దేవుడు ఇస్రాయేలు ప్రజ పక్షాన యుద్ధం చేస్తున్నాడు! వాళ్ళ దగ్గరనుంచి పారిపోదాం!” అని చెప్పుకొన్నారు.
ఇశ్రాయేలు ప్రజలు సముద్రానికి ఆవలి వైపుకు చేరిన తరువాత, దేవుడు మోషేతో అన్నాడు, “నీ చెయ్యి సముద్రం మీద చాపు. మోషే చెయ్యి సముద్రం మీద చెయ్యి చాపగానే .ీళ్ళు మళ్ళీ ఫరో సైన్యమంతటినీ ముంచి కప్పివేశాయి. సముద్రతీరాన పడివున్న ఐగుప్తు వాళ్ళ శవాలను ఇస్రాయేల్‌ప్రజలు చూశారు. ఇస్రాయేలు ప్రజకు యెహోవా మీద భయభక్తులు కలిగాయి. వారు దేవుని మీదా ఆయన సేవకుడైన మోషేమీదా నమ్మకం ఉంచారు.
ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా సంతోషించారు, ఎందుకంటే మరణంనుండి దేవుడు వారికి కాపాడాడు, బానిసత్వం నుండీ వారిని కాపాడాడు. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికీ, విధేయత చూపించడానికీ వారు స్వతంత్రులయ్యారు. వారికి దొరకిన నూతన స్వేచ్చను బట్టి వారు అనేక కీర్తనలు పాడారు. ఐగుప్తు సైన్యం నుండి తమను కాపాడినందుకు వారు దేవునికి స్తుతి కీర్తనలు పాడారు. దేవుడు ఐగుప్తీయులను ఓడించి ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంనుండి ఏవిధంగా విడిపించాడో జ్ఞాపకం చేసుకోడానికి ప్రతీ సంవత్సరం వారు వేడుక చేసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ పండుగను పస్కాపండుగ అని పిలిచారు. ఆ పండుగలో వారు ఒక ఆరోగ్యవంతమైన గొర్రెపిల్లను వధిస్తారు, దానిని కాల్చుతారు, దానిని పులియని రొట్టెలతో భుజిస్తారు.
నిర్గమకాండం 19-34
దేవుడు ఎర్రసముద్రం నుండి ఇశ్రాయేలీయులను నడిపించిన తరువాత, అరణ్యమార్గము నుండి వారిని సీనాయి పర్వతం వద్దకు వారిని నడిపించాడు. ఈ పర్వతం వద్దనే మోషే మండుతున్న పొదను చూచాడు. ఆ పర్వతం అడుగుభాగంలో ఇశ్రాయేలీయులు గుడారాలు వేసుకొని స్థిరపడ్డారు. దేవుడు మోషేతోనూ, ఇశ్రాయేలీయులందరితోనూ ఇలా చెప్పాడు, “మీరు ఎల్లప్పుడూ నాకు విధేయత చూపించాలి, మీతో నేను చేస్తున్న నిబంధనను కొనసాగించాలి, ఈ విధంగా మీరు చేసినట్లయితే, మీరు నా సంపాద్య స్వాస్థ్యం అవుతారు, యాజక సమూహం అవుతారు, పరిశుద్ధజనాంగం అవుతారు.”
మూడు రోజులలో ప్రజలు దేవుడు తమ వద్దకు వచ్చేలా తమ్మును తాము సిద్ధపరచుకొన్నారు. అప్పుడు దేవుడు సీనాయి పర్వతం మీదకు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు పెద్ద ఉరుములు, మెరుపులు, పొగ, పెద్ద బూరల శబ్దాలు కలిగాయి. అప్పుడు మోషే పర్వతం మీదకు ఎక్కి వెళ్ళాడు. తరువాత దేవుడు తన ప్రజలతో ఒక నిబంధన చేసాడు. ఆయన ఇలా చెప్పాడు, “నేను మీ దేవుడైన యెహోవాను, ఐగుప్తులోని బానిసత్వంలోనుండి మిమ్మును రక్షించినవాడను నేనే, ఇతర దేవుళ్ళను పూజించవద్దు.”
“విగ్రహాలు చేసికొనవద్దు, వాటిని పూజించవద్దు, ఎందుకంటే నేనే యెహోవాను, మీ ఏకైక దేవుడను నేనే. నా నామమును వ్యర్ధముగా ఉచ్చరింప వద్దు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి. అంటే ఆరు దినములు పని చెయ్యాలి, ఏడవ దినాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోడానికి విశ్రమించాలి.” “నీ తల్లినీ తండ్రినీ సన్మానించాలి. నరహత్య చెయ్యవద్దు. వ్యభిచారం చెయ్యవద్దు, దొంగిలించవద్దు. నీ పొరుగువాని భార్యను ఆశింపవద్దు, నీ పొరుగువాని ఇంటినైననూ లేక నీ పొరుగువాని దేనినైననూ ఆశింపవద్దు.”
తరువాత దేవుడు ఈ పది ఆజ్ఞలను రెండు రాతి పలకల మీద రాశాడు, వాటిని మోషేకు ఇచ్చాడు. తన ప్రజలు అనుసరించడానికి దేవుడు ఇంకా అనేక చట్టాలనూ, నియమాలనూ ఇచ్చాడు. వారు ఈ శాసనాలకు విధేయత చూపించినట్లయితే వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసాడు. వాటికి వారు విధేయత చూపించిన యెడల వారిని శిక్షిస్తానని హెచ్చరించాడు.
దేవుడు ఇశ్రాయేలీయులను ఒక పెద్ద గుడారాన్ని చెయ్యమని కూడా చెప్పాడు-సమాజం అంతా కలుసుకొనే ప్రత్యక్షపు గుడారం. ఈ గుడారాన్ని ఏవిధంగా చెయ్యాలో ఖచ్చితమైన వివరాలు చెప్పాడు. దానిలో ఏయే వస్తువులు ఉంచాలో చెప్పాడు. ఈ పెద్ద గుడారాన్ని రెండు గదులుగా చెయ్యడానికి మధ్యలో ఒక తెరను ఉంచాలని చెప్పాడు. ఆ తెర వెనుకకు దేవుడు వచ్చి అక్కడ నివాసం చేస్తాడు, ప్రధాన యాజకులు మాత్రమే దేవుడు వచ్చే ఆ స్థలంలో ప్రవేశించడానికి అనుమతి ఉంది.
ప్రత్యక్షపు గుడారం యెదుట వారు ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చెయ్యాలి. దేవుని చట్టాన్ని మీరినవారు ఎవరైనా ఆ బలిపీఠం వద్దకు ఒక జంతువును తీసుకొని రావాలి. యాజకుడు ఆ జంతువును వధించాలి, దానిని ఆ బలిపీఠం మీద హోమబలిగా దహించాలి. ఆ జంతువు రక్తం ఆ వ్యక్తి పాపాన్ని కప్పివేస్తుందని దేవుడు చెప్పాడు. ఈ విధంగా దేవుడు ఆ వ్యక్తి పాపాన్ని చూడదు. దేవుని దృష్టిలో ఆ వ్యక్తి “శుద్ధుడు” అవుతాడు. దేవుడు మోషే సహోదరుడు, ఆహారోనును ఎంపిక చేసాడు, ఆహారోను సంతానం దేవుని యాజకులుగా ఉంటారు.
దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన శాసనాలకు విధేయత చూపించదానికి ప్రజలందరూ అంగీకరించారు. దేవునికి మాత్రమే చెందియుండడానికి అంగీకరించారు. ఆయనను మాత్రమే ఆరాధించడానికి అంగీకరించారు. అనేక దినాలుగా మోషే సీనాయి పర్వతం మీదనే ఉన్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. మోషే కోసం కనిపెట్టడంలో ప్రజలు అలసిపోయారు. అందుచేత వారు బంగారాన్ని తీసుకొని ఆహారోను వద్దకు వచ్చారు. దేవునికి బదులు ఆరాధించడానికి ఒక విగ్రహాన్ని చెయ్యమని ఆయనను అడిగారు. ఈ విధంగా వారు దేవునికి వ్యతిరేకంగా భయంకరమైన పాపం చేసారు.
ఆహారోను ఒక దూడ రూపంలో ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసాడు. ప్రజలు ఆ విగ్రహాన్ని బహిరంగంగా పూజించడం ఆరంభించారు. వారి పాపాన్ని బట్టి దేవుడు వారిని బహుగా కోపగించుకొన్నాడు. ఆయన వారిని నాశనం చెయ్యాలని చూసాడు. అయితే మోషే వారిని సంహరించవద్దని దేవుణ్ణి బతిమాలాడు. దేవుడు మోషే ప్రార్థన విని ప్రజలను నాశనం చెయ్యలేదు.
చివరికి మోషే సీనాయి పర్వతం నుండి దిగి వచ్చాడు. దేవుడు తన స్వహస్తాలతో రాసిన పది ఆజ్ఞల రెండు పలకలను మోషే తీసుకొని వచ్చాడు. అప్పుడు మోషే ఆ విగ్రహాన్ని చూచాడు. చాలా కోపపడి తన చేతులలోని రెండు పలకలను పగులగొట్టాడు. అప్పుడు మోషే ఆ విగ్రహాన్ని తుత్తునియలుగా చేసాడు. దాని పొడిని నీటిలో కలిపి ఆ నీటిని ప్రజలతో తాగించాడు. దేవుడు ఆ ప్రజల మీద ఒక తెగులును రప్పించాడు, ఫలితంగా వారిలో అనేకులు చనిపోయారు.
తాను పగులగొట్టిన పలకల స్థానంలో పది ఆజ్ఞల కోసం కొత్త పలకలను చేసాడు. అప్పుడు మోషే తిరిగి పర్వతం మీదకు వెళ్ళాడు, తన ప్రజలను క్షమించాలని దేవుణ్ణి ప్రార్థించాడు. రెండు నూతన పలకల మీద పది ఆజ్ఞలను తీసుకొని మోషే సీనాయి పర్వతం దిగి వచ్చాడు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను సీనాయి పర్వతం నుండి వాగ్దాన దేశం వైపుకు నడిపించాడు.
నిర్గమకాండం 10-14; 20; 27;
దేవుడు వారితో చేసిన నిబంధన కారణంగా ఇశ్రాయేలీయులు విధేయత చూపించేలా అన్ని శాసనాలను గురించి చెప్పడం ముగించాడు. ఆ తరువాత వారిని సీనాయి పర్వతం నుండి దూరంగా వారిని నడిపించాడు. వారిని వాగ్దాన భూమికి తీసుకొని వెళ్లాలని కోరాడు. ఈ భూమిని కనాను అని పిలిచారు. దేవుడు వారికి ముందుగా మేఘస్థంభం వలే నడిచాడు, ఇశ్రాయేలీయులు ఆయనను అనుసరించారు.
వారి సంతానానికి వాగ్దాన దేశాన్ని ఇస్తానని దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసాడు. అయితే అక్కడ అనేకమంది ప్రజలు నివసిస్తున్నారు. వారిని కనానీయులు అని అంటారు. కానానీయులు దేవుణ్ణి పూజించరు, ఆయనకు విధేయత చూపించరు. అబద్ధపు దేవుళ్ళను వారు పూజిస్తారు, అనేక దుష్ట కార్యాలు చేసారు.
దేవుడు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు. “మీరు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించిన తరువాత అక్కడ నివసించే కానానీయలందరిని తొలగించి వెయ్యాలి. వారితో సమాధానపడకూడదు, వారితో వివాహాలు చేసుకోకూడదు. వారి విగ్రహాలన్నిటినీ పూర్తిగా నాశనం చెయ్యాలి. మీరు నాకు లోబడని యెడల నాకు బదులుగా వారి విగ్రహాలను పూజిస్తారు.”
ఇశ్రాయేలీయులు కనాను సరిహద్దులకు సమీపించినప్పుడు, మోషే పన్నెండు మంది పురుషులను ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలనుండి ఎంపిక చేసాడు. వారు ఆ దేశాన్ని వేగు చూడడానికీ, ఆ దేశం ఏవిధంగా ఉందొ కనుగొనడానికి వారికి హెచ్చరికలు ఇచ్చాడు. కనానీయుల బలాలు, వారి బలహీనతలను గురించి వేగు చూడాలి.
ఆ వేగువారు కనాను దేశంలో నలుబది రోజులు ప్రయాణం చేసారు. తరువాత వారు తిరిగి వెనుకకు వచ్చారు. ఆ వేగువారు ప్రజలతో ఇలా చెప్పారు, “కనాను భూభాగం చాలా సారవంతమైన ప్రదేశం, పంటలు విస్తారంగా ఉన్నాయి!” అయితే వారిలో పదిమంది వేగువారు ఇలా చెప్పారు, “ఆ నగరాలు చాలా బలంగా ఉన్నారు, ప్రజలు బలవంతులు! వారి మీదకు మనం దండెత్తినట్లయితే వారు ఖచ్చితంగా మనలను ఓడిస్తారు, మనలను చంపివేస్తారు!” వెంటనే ఇద్దరు వేగువారు, యెహోషువా, కాలేబులు వారితో ఇలా చెప్పారు, “కనాను వారు ఉన్నత దేహులు, బలవంతులు అను మాట వాస్తవమే, అయితే మనం వారిని జయించగలం! దేవుడు మనం పక్షంగా యుద్ధం చేస్తాడు!
అయితే ప్రజలు యెహోషువా, కాలేబులు చెప్పిన మాట వినలేదు. మోషే, ఆహారోను పట్ల వారు కోపగించుకొన్నారు, మోషేతో ఇలా అన్నారు, “ఈ భయంకరమైన ప్రదేశానికి మమ్ములను ఎందుకు తీసుకొనివచ్చావు? మేము ఐగుప్తులోనే ఉండవలసినది కదా! ఈ నూతన భూభాగంలోనికి మేము ప్రవేశించినప్పుడు మనం యుద్ధంలో చనిపోతాం, కనానీయులు మన భార్యలనూ, పిల్లలనూ వారి బానిసలుగా చేసుకొంటారు.” వారిని తిరిగి ఐగుప్తులోనికి నడిపించడానికి కొత్త నాయకుడిని ఎంపిక చేసుకోవాలని కోరారు.
ప్రజలు ఈ మాట చెప్పినప్పుడు దేవుడు చాలా కోపగించుకొన్నాడు. ఆయన ప్రత్యక్షపు గుడారం వద్దకు వచ్చాడు. ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాడు, “మీరు నా మీద తిరుగుబాటు చేసారు, మీరందరూ అరణ్యంలో తిరుగులాడాలని కోరుతున్నారు. మీలో ఇరువది సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు చనిపోతారు, నేను మీకిచ్చు వాగ్దానదేశంలో ఎన్నటికీ ప్రవేశించారు. కేవలం యెహోషువా, కాలేబులు మాత్రమే ప్రవేశిస్తారు.”
దేవుని మాట ప్రజలు వినినప్పుడు వారు పాపం చేసారని విచారపడ్డారు. కనుక వారు కనానీయుల మీద దాడి చెయ్యడానికి సిద్ధపడ్డారు. మోషే వారిని వెళ్ళవద్దని హెచ్చరించాడు, ఎందుకంటే దేవుడు వారితో ఉండడు, వారు ఆయన మాట వినలేదు.
ఈ యుద్ధంలో దేవుడు వారితో వెళ్ళలేదు, కనుక కనానీయులు వారిని ఓడించారు, అనేకులను చంపారు. అప్పుడు ఇశ్రాయేలీయులు కనాను నుండి తిరిగి వచ్చారు. తరువాత నలభై సంవత్సరాలు అరణ్యంలో వారు తిరుగులాడారు.
ఇశ్రాయేలీయులు అరణ్యంలో నలుబది సంవత్సరాలు తిరుగులాడినప్పుడు దేవుడు వారికి ఆహారాన్ని సమకూర్చాడు. పరలోకం నుండి వారికి ఆహారాన్ని కురిపించాడు, దానిని “మన్నా” అని పిలిచారు, దేవుడు వారికి పూరేల్లను కూడా (ఒక మాదిరి బరువుండే ఉన్న చిన్న పక్షులు) వారి శిబిరాలలో కురిపించాడు. వారు దాని మాంసాహారాన్ని తినాలని వాటిని అనుగ్రహించాడు. ఆ సమయం అంతటిలోనూ దేవుడు వారి దుస్తులూ, కాలి చెప్పులు తరిగిపోకుండా వారిని సంరక్షించాడు.
దేవుడు ఆశ్చర్యకరంగా బండలోనుండి నీటిని బయటికి తెప్పించాడు. అయితే ఇలా జరిగినప్పటికీ ఇశ్రాయేలీయులు పిర్యాదులు చేసారు, దేవునికీ, మోషేకూ వ్యతిరేకంగా సణిగారు. అయినా దేవుడు వారి పట్ల నమ్మదగినవాడిగా ఉన్నాడు. ఆయన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు తాను వాగ్దానం చేసినదానిని వారికి అనుగ్రహించాడు.
మరొకసారి ప్రజలకు తాగడానికి నీరు లేనప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “రాయితో మాట్లాడు, దానిలోనుండి నీరు బయటికి వస్తుంది.” అయితే మోషే ఆ రాయితో మాట్లాడలేదు, దానికి బదులు ఆ రాయిని రెండు సార్లు కొట్టాడు. ఈ విధంగా మోషే దేవుణ్ణి అగౌరపరచాడు. దేవుడు మోషే పట్ల కోపగించుకొన్నాడు. దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “నీవు ఈ కార్యం చేసిన కారణంగా నీవు వాగ్దానదేశంలోనికి ప్రవేశించలేవు.”
ఇశ్రాయేలీయులు నలుబది సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడిన తరువాత దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారందరూ చనిపోయారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను తిరిగి వాగ్దానదేశం వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు మోషే బహుకాలం గడచిన వృద్దుడయ్యాడు. కనుక దేవుడు యెహోషువాను ఎంపిక చేసాడు. మోషే లాంటి ప్రవక్తను మనుష్యుల వద్దకు పంపిస్తానని దేవుడు మోషేకు వాగ్దానం చేసాడు.
అప్పుడు దేవుడు మోషేను పర్వతం చివరి కొన వరకు వెళ్ళమని చెప్పి వాగ్దానదేశాన్ని చూపించాడు. మోషే వాగ్దాన దేశాన్ని చూసాడు, అయితే దాని లోనికి ప్రవేశించడానికి దేవుడు అనుమతించలేదు. అప్పుడు మోషే చనిపోయాడు, ఇశ్రాయేలీయులు ముప్ఫై రోజులు ఏడ్చారు. యెహోషువా నూతన నాయకుడు అయ్యాడు. యెహోషువా గొప్ప నాయకుడు ఎందుకంటే అతడు దేవుణ్ణి విశ్వసించాడు, విధేయత చూపించాడు.
యెహోషువా 1-24
చివరకు ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమైన కనానులోకి ప్రవేశించారు. ఆ దేశంలో యెరికో అని పిలువబడిన ఒక పట్టణం ఉంది. దానిని రక్షించడానికి దాని చుట్టూ బలమైన గోడలు ఉన్నాయి. ఆ పట్టణంలోనికి యెహోషువ ఇద్దరు వేగులవారిని పంపించాడు. ఆ పట్టణంలో రాహాబు అనే వ్యభిచారి ఉంది. ఆమె ఈ గూఢచారాలను దాచిపెట్టింది. తరువాత ఆమె వారిని నగరం నుండి తప్పించుకోవడానికి సహాయం చేసింది. ఆమె దేవుణ్ణి విశ్వసించింది. కాబట్టి ఆమె ఇలా చేసింది. ఇశ్రాయేలీయులు యెరికోను నాశనం చేసినప్పుడు రాహాబును, ఆమె కుటుంబాన్ని రక్షించాలని వారు వాగ్దానం చేసారు.
ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి వారు యొర్దాను నదిని దాటవలసి వచ్చింది. దేవుడు యెహోషువతో ఇలా చెప్పాడు, "యాజకులు మొదట వెళ్ళాలి, ." డుఅడుగుపెట్టినప్పుయాజకులు , యొర్డాను నీళ్ళు ఎగువనుండి ఆగిపోయాయి, కనుక ఇశ్రాయేలీయులు పొడిగా ఉన్న ప్రదేశంలో నది యొక్క మరొక వైపుకు దాటగల్గారు.
ప్రజలు యొర్దాను నదిని దాటిన తర్వాత, దేవుడు యెరికో చాలా బలంగా ఉన్నప్పటికీ, దాని మీదకు దాడి చేయడానికి సిద్ధంగా ఉండాలని యెహోషువకు చెప్పాడు. ేయాజకులకూ, సైనికులకూ ఆరు రోజులు రోజుకు ఒకసారి చొప్పున నగరం చుట్టూ ప్రదక్షణ చెయ్యాలని చెప్పాడు. కనుక యాజకులూ, సైనికులూ దీనిని చేశారు.
ఏడవ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఆ నగరాన్ని చుట్టూ మరోసారి ప్రదక్షణ చేసారు, ఏడవ సారి వారు నగరాన్ని చుట్టుముట్టినప్పుడు యాజకులు వారి బూరలు ఊదారు, సైనికులు గట్టిగా అరిచారు. అప్పుడు యెరికో చుట్టూ గోడలు దేవుడు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు పట్టణంలోని ప్రతిదానిని ధ్వంసం చేశారు. వారు ఇశ్రాయేలీయులలో భాగమైన రాహాబునూ, తన కుటుంబాన్ని మాత్రమే విడిచిపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు యెరికోను నాశనం చేశారని కనానులో నివసిస్తున్న ఇతర ప్రజలు విన్నప్పుడు, ఇశ్రాయేలీయులు వారి మీద కూడా దాడి చేస్తారని వారు భయపడ్డారు.
ఇశ్రాయేలీయులు కనానులోని ప్రజల సమూహాలతో శాంతి ఒప్పందం చేసుకోవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ కనానీయుల సమూహాలలో ఒకటైన గిబియోనీయులు యెహోషువకు అబద్దం చెప్పారు, వారు కనాను నుండి చాలా దూరంలో ఉన్నట్లు చెప్పారు. వారితో శాంతి ఒప్పందం చేసుకోమని యెహోషువను అడిగారు., ఇశ్రాయేలీయుల ఇతర నాయకులు ఏమి చేయకూడదని చెప్పాడో డానికి వ్యతిరేకంగా , వారు గిబియోనీయులతో శాంతి ఒప్పందం చేశారు.
మూడు రోజుల తర్వాత, గిబియోనీయులు నిజంగా కనానులో నివసిస్తున్నారని ఇశ్రాయేలీయులు కనుగొన్నారు. గిబియోనీయులు వారిని మోసగించినందున వారు కోపంగా ఉన్నారు. అయితే వారు దేవుని యెదుట వాగ్దానం చేసినందువల్ల వారు తమతో చేసిన శాంతి ఒప్పందాన్ని వారు నెరవేర్చారు. కొంత కాలం తరువాత, గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో ఒక శాంతి ఒప్పందం చేసుకున్నారని కనానులోని అమోరీయుల సమూహానికి చెందిన మరో ప్రజల రాజులు విన్నారు, కాబట్టి వారు తమ సైన్యాలను ఒక పెద్ద సైన్యంతో కలిపి గిబియోనుపై దాడి చేశారు. గిబియోనీయులు సహాయాన్ని కోరుతూ యెహోషువకు ఒక సందేశాన్ని పంపారు.
కనుక యెహోషువ ఇశ్రాయేలు సైన్యాన్ని సమకూర్చాడు, గిబియోనీయుల దగ్గరకు చేరడానికి వారు రాత్రిపూట అంతా ప్రయాణం చేసారు. ఉదయాన్నే వారు అమోరీయుల సైన్యాన్ని ఆశ్చర్యపరిచారు, వారి మీద దండెత్తారు. ఆ రోజు ఇశ్రాయేలు కోసం దేవుడు పోరాడాడు. అయన అమోరీయులను గందరగోళానికి గురిచేశాడు. దేవుడు పెద్ద వడగళ్ళను పంపించాడు, అవి అమోరీయులనందరినీ చంపాయి.
ఇశ్రాయేలు అమోరీయులను పూర్తిగా ఓడించడంలో ఇశ్రాయేలీయులకు చాలినంత సమయము కలిగి ఉండడం కోసం సూర్యున్ని ఆకాశంలో ఒకే స్థలములో ఉండేలా దేవుడు చేసాడు. ఆ రోజున దేవుడు ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. దేవుడు ఆ సైన్యాలను ఓడించిన తరువాత, చాలామంది కనానీయుల ప్రజల గుంపులు ఇశ్రాయేలీయుల మీద దాడి చేయడానికి సమావేశం అయ్యారు. యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు వారి మీద దాడిచేసి నాశనం చేశారు.
ఈ యుద్ధాల తరువాత, దేవుడు ఇశ్రాయేలు ప్రతి గోత్రానికి వాగ్దాన భూమిలో వారి వారి వంతు ప్రకారం భాగాన్ని ఇచ్చాడు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు తమ సరిహద్దులన్నిటిలో నెమ్మదిని ఇచ్చాడు.
యెహోషువ వృద్ధుడయినప్పుడు, ఇశ్రాయేలీయులనందరినీ ఒక చోట సమావేశం కావడానికి పిలిచాడు. అప్పుడు యెహోషువ దేవుడు సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలీయులతో చేసిన ఒడంబడికకు వారు విధేయత చూపుతారని వాగ్దానం చేసినట్లు వారికి జ్ఞాపకం చేసాడు. ఇశ్రాయేలీయులందరూ దేవునికి నమ్మకంగా ఉండడానికీ, ఆయన నియమాలకు విధేయులుగా ఉంటామని వాగ్దానం చేశారు.
న్యాయాధిపతులు 1-3; 6-8; 1 సమూయేలు 1-10
యెహోషువ మరణించిన తరువాత ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులయ్యారు. . వారు దేవుని నియమాలకు విధేయత చూపలేదు, వాగ్దాన దేశము నుండి మిగిలిన కనానీయులను తరిమి వెయ్యలేదు. ఇశ్రాయేలీయులు యెహోవా దేవునికి బదులుగా కనానీయుల దేవతలను పూజించడం ఆరంభించారు. ఇశ్రాయేలీయులకు రాజు లేడు, కనుక ప్రతి ఒక్కరూ ఎవరికీ వారు తమకు సరియైనదిగా తోచిన విధంగా చేస్తూ వచ్చారు.
దేవునికి అవిధేయత చూపించడం ద్వారా ఇశ్రాయేలీయులు అనేకసార్లు పునరావృతమయ్యే ఒక విధానాన్ని కొనసాగించారు. అదేమిటంటే: ఇశ్రాయేలీయులు చాలా సంవత్సరాలుగా దేవునికి అవిధేయత చూపిస్తున్నారు, అప్పుడు దేవుడు వారిని ఓడించడానికి వారి మీదకు వారి శత్రువులను అనుమతించడం ద్వారా వారిని శిక్షిస్తున్నాడు, ఈ శత్రువులు ఇశ్రాయేలీయుల మీద దాడి చేసి వారిని దోచుకోవడం, వారి ఆస్తిని నాశనం చెయ్యడం, వారిలో అనేకమందిని చంపడం. ఇశ్రాయేలీయుల శత్రువులు చాలా సంవత్సరాలు వారిని అణచివేసిన తరువాత, ఇశ్రాయేలీయులు తమ పాపం విషయంలో పశ్చాత్తాపపడడం, తమను రక్షించమని దేవుణ్ణి అడగడం.
ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడిన ప్రతీసారి, దేవుడు వారిని కాపాడుతుండేవాడు, వారికి ఒక విమోచకుని అనుగ్రహించడం ద్వారా వారిని కాపాడుతుండేవాడు-వారి శత్రువులకు వ్యతిరేకంగా పోరాడి వారిని ఓడించేవాడు. వారి దేశంలో నెమ్మది ఉండేది. ఆ న్యాయాధిపతి వారిని సరిగా పరిపాలించేవాడు. దేవుడు ఇశ్రాయేలీయులను ఓడించేందుకు వారి మీదకు మిద్యానీయులను అనుమతించడం ద్వారా దీనిని తిరిగి చేసాడు.
మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పంటలను ఏడు సంవత్సరాలుగా ఆక్రమించారు. ఇశ్రాయేలీయులు చాలా భయపడ్డారు, మిద్యానువారు తమను కనుగొనకుండా వారు గుహలలో దాక్కునేవారు. చివరకు, తమ్మును రక్షించాలని వారు దేవుణ్ణి మొరపెట్టారు. ఇశ్రాయేలీయులలో గిద్యోను అనే మనిషి ఉన్నాడు. ఒక రోజున, అతను ఒక రహస్య స్థలంలో ధాన్యాన్ని దుళ్ళ గొట్టుతూ ఉన్నాడు. మిద్యానీయులు తనను చూడకుండా ఉండేలా రహస్యంగా ఆ పని చేస్తున్నాడు. దేవుని దూత గిద్యోను వద్దకు వచ్చి ఇలా అన్నాడు, “పరాక్రమము గల బలాడ్యుడా, వెళ్ళుము, మిద్యాను ప్రజల నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము."
గిద్యోను తండ్రి ఒక విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఆ బలిపీఠాన్ని కూలద్రోయాలని దేవుడు గిద్యోనుకు మొదట చెప్పాడు. అయితే ప్రజల విషయంలో గిద్యోను భయపడ్డాడు, అతను రాత్రిపూట వరకు వేచి ఉన్నాడు అప్పుడు అతడు బలిపీఠాన్ని పడగొట్టి దానిని సమూలంగా నాశనం చేసాడు. దానికి సమీపంలోనే గిద్యోను దేవునికి ఒక క్రొత్త బలిపీఠాన్ని నిర్మించాడు, దానిమీద దేవునికి హోమబలి అర్పించాడు.
మరుసటి ఉదయం బలిపీఠం ముక్కులుగా చెయ్యబడడం, అది పూర్తిగా నాశనం కావడం ప్రజలు, వారు చాలా కోపగించుకొన్నారు. వారు గిద్యోనును చంపడానికి అతని ఇంటికి వెళ్ళారు. అయితే గిద్యోను తండ్రి ఇలా చెప్పాడు, “మీరు మీ దేవునికి సహాయం చెయ్యడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అతను దేవుడు అయితే తనను తాను కాపాడుకోనివ్వండి!” ఆ విధంగా చెప్పిన కారణంగా ప్రజలు గిద్యోనును చంపలేదు.
అప్పుడు మిద్యానీయులు తిరిగి ఇశ్రాయేలీయుల నుండి దోచుకోడానికి వచ్చారు. గిద్యోను ఇశ్రాయేలీయులందరినీ ఒక చోట సమావేశపరచాడు, యుద్ధం చెయ్యాలని వారికి చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలీయులను కాపాడడానికి తనతో మాట్లాడాడు అనేది వాస్తవమైతే రెండు రుజువులు చూపించాలని గిద్యోను దేవుణ్ణి అడిగాడు.
మొదటి గురుతుకోసం, గిద్యోను నేలమీద ఒక గొర్రె చర్మం ఉంచాడు, ఉదయానికి గొర్రె చర్మం మీద మాత్రమే మంచు కురవాలి, దాని చుట్టూ ఉన్న నేలమీద మంచు కురవకూడదు అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఆ విధంగానే చేసాడు. మరుసటి రాత్రి, ‘నేల తడిగా ఉండాలి, గొర్రె చర్మం పొడిగా ఉండాలి’ అని గిద్యోను దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఆ విధంగా కూడా చేసాడు. ఈ రెండు సూచనలను బట్టి మిద్యాను ప్రజల నుండి ఇశ్రాయేలీయులను రక్షించాలని దేవుడు నిజంగా కోరుకున్నాడని గిద్యోను విశ్వసించాడు.
అప్పుడు గిద్యోను తన దగ్గరకు సైనికులను పిలిచాడు, 32,000 మంది వచ్చారు. అయితే ‘వారు చాలా అధికం’ అని దేవుడు కాబట్టి యుద్ధానికి భయపడిన వారందరినీ గిద్యోను 22,000 మంది ఇంటికి పంపించాడు. ఇంకా ఎక్కువమంది ఉన్నారని దేవుడు గిద్యోనుకు చెప్పాడు. కనుక గిద్యోను 300 మంది సైనికులను తప్పించి మిగిలిన వారందరినీ తమతమ ఇళ్ళకు పంపించాడు.
ఆ రాత్రి దేవుడు గిద్యోనుతో ఇలా చెప్పాడు, "మిద్యాను సైన్య శిబిరం వద్దకు వెళ్లి, అక్కడ సైనికులు మాట్లాడుతున్న దానిని వినాలని చెప్పాడు. వారు మాట్లాడుతున్నదానిని నీవు వినిన యెడల వారి మీదకు దండెత్తడానికి నీవు భయపడవు.” ఆ రోజు రాత్రి, గిద్యోను శిబిరానికి వెళ్ళి, ఒక మిద్యాను సైనికుడు మరొక మిద్యాను సైనికుడితో తనకు వచ్చిన కలను గురించి పంచుకొన్నాడు. “గిద్యోను సైన్యం మిద్యాను సైన్యం అయిన మనలను జయిస్తుంది అని ఈ కల అర్థం!” గిద్యోను ఈ మాట వినినప్పుడు అతడు దేవుణ్ణి ఆరాధించాడు.
అప్పుడు గిద్యోను తన సైనికుల వద్దకు తిరిగి వచ్చాడు, వారిలో ప్రతి ఒక్కరికీ ఒక కొమ్ము, ఒక మట్టి కుండ, ఒక కాగడా ఇచ్చాడు. మిద్యాను సైనికులు నిద్రపోతున్న శిబిరాలను వారు చుట్టుముట్టారు. గిద్యోనుతో ఉన్న 300 సైనికులు తమ మట్టి కుండలలో కాగడాలు ఉంచుకున్నారు, తద్వారా మిద్యానీయులు వారిని గమనించలేదు. అప్పుడు, గిద్యోను సైనికులందరూ తమ కుండలను పగులగొట్టారు, అకస్మాత్తుగా కాగాడాలలోని అగ్నిని చూపించారు. వారు తమ చేతులలోని బూరలు గట్టిగా ఊదారు, “యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం” అని అరిచారు
దేవుడు మిద్యానీయులను గందరగోళ పరిచాడు, తద్వారా వారు ఒకరినొకరి మీద దాడి చేసుకొని ఒకరినొకరు చంపుకోవడం ఆరంభించారు. తక్షణమే, గిద్యోను మిద్యానీయులను తరమడానికి ఇశ్రాయేలీయులలో అనేకమందిని తమ తమ గృహాలనుండి పిలవడానికి తన వార్తాహరులను పంపించాడు. వారు మిద్యానీయులలో అనేకమందిని హతం చేసారు. మిగిలిన వారిని ఇశ్రాయేలీయుల భూమి నుండి వెలుపలికి తరిమి వేశారు. ఆ దినాన్న 120,000 మంది మిద్యాను ప్రజలు చనిపోయారు. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలీయులను రక్షించాడు.
గిద్యోనును తమ రాజుగా చేసుకోవాలని ఇశ్రాయేలీయులు కోరుకున్నారు. అందుకు గిద్యోను వారిని అనుమతించలేదు. అయితే వారు మిద్యానీయుల నుండి తీసుకున్న బంగారు ఆభరణలలో కొన్నింటిని తీసుకొని రావాలని వారిని అడిగాడు. ప్రజలు గిద్యోనుకు పెద్ద మొత్తంలో బంగారం ఇచ్చారు.
ఆ తర్వాత గిద్యోను తన వద్ద ఉన్న బంగారంతో యాజకుడు వినియోగించే ప్రత్యేక వస్త్రాలను తయారు చేసాడు. అయితే ప్రజలు దానిని ఒక విగ్రహంగా ఆరాధించడం ప్రారంభించారు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులు విగ్రహాన్ని పూజించినందున మరలా శిక్షించాడు. వారి శత్రువులు వారిని వారిని ఓడించటానికి దేవుడు వారిని అనుమతించాడు. చివరకు వారు మరలా సహాయం కోసం దేవుణ్ణి అడిగారు, వారిని రక్షించడానికి దేవుడు వారికోసం మరొక విమోచకుని పంపించాడు.
ఇదే సంఘటన అనేక సార్లు జరిగింది:శ్రాయేలీయులు పాపం చెయ్యడం, దేవుడు వారిని శిక్షించడం, వారు పశ్చాత్తాపం చెందడం, వారిని రక్షించడానికి దేవుడు కొందరు విమోచకులను పంపించడం. ఇశ్రాయేలీయులను తమ శత్రువుల నుండి రక్షించడానికి అనేక సంవత్సరాలుగా అనేకమంది మనుష్యులను దేవుడు పంపించాడు. అంతిమంగా, ప్రజలు ఇతర దేశాల వలె వారికీ ఒక రాజు కావాలని దేవుణ్ణి కోరారు. ఎత్తుగానూ, బలంగానూ తమని యుద్ధంలో నడిపించగల రాజు కావాలని కోరారు. దేవుడు ఈ మనవిని ఇష్టపడలేదు, కానీ వారు అడిగినట్టుగా వారికి రాజును ఇచ్చాడు.
1 సమూయేలు 10:15-19; 24; 31; 2 సమూయేలు 5:7; 11-12
సౌలు ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు. ప్రజలు కోరుకున్నట్టుగా అతను పొడవుగానూ, అందంగానూ ఉన్నాడు. సౌలు ఇశ్రాయేలుపై పరిపాలించిన మొదటి కొన్ని సంవత్సరాలలో మంచి పాలన అందించాడు. అయితే అతడు దేవునికి విధేయత చూపించలేదు, దుష్టుడైన రాజుగా ఉన్నాడు. అందుచేత దేవుడు ఒక రోజు తన స్థానంలో రాజుగా ఉండగల వేరొక మనిషిని ఎన్నుకున్నాడు.
దేవుడు ఒక యువ ఇశ్రాయేలీయుడైన దావీదును ఎన్నుకున్నాడు, ఒక రోజు సౌలు తర్వాత రాజుగా అతడిని సిద్ధపరచడం ఆరంభించాడు. దావీదు బేత్లెహేము గ్రామ నివాసి, అతడు గొర్రెల కాపరి. తాను తన తండ్రి గొర్రెలను కాస్తుండగా వేరువేరు సమయాలలో వాటి మీద దాడి చేసిన ఒక సింహాన్ని, ఒక ఎలుగుబంటిని చంపాడు. దావీదు దేవునికి విధేయుడు, నీతిమంతుడు. దేవుణ్ణి విశ్వసించాడు, ఆయనకు విధేయత చూపించాడు.
దావీదు ఒక యువకుడిగా ఉన్నప్పుడు, ఉన్నత దేహుడైన గోల్యాతుకు వ్యతిరేకంగా పోరాడాడు. గొల్యాతు . చాలా బలమైన వాడు, దాదాపు మూడు మీటర్ల పొడవు ఉన్నాడు! అయితే దేవుడు గొల్యాతును చంపి ఇశ్రాయేలును రక్షించడంలో దావీదుకు సహాయంచేసాడు. ఆ తరువాత, దావీదు ఇశ్రాయేలు శత్రువులపై అనేక విజయాలను సాధించాడు. దావీదు ఒక గొప్ప సైనికుడు అయ్యాడు, ఇశ్రాయేలు సైన్యాన్ని ఆయన అనేక యుద్ధాల్లో నడిపించాడు. ప్రశంసించారు ప్రజలు అతన్ని చాలా..
ప్రజలు దావీదును యెంతో ప్రేమించారు, సౌలు రాజు దావీదు పట్ల అసూయపడ్డాడు. చివరకు సౌలు రాజు దావీదును చంపాలని కోరుకున్నాడు, అందుచేత దావీదూ, అతనితో ఉన్న సైనికులు తమని దాచుకోడానికి అరణ్యంలోకి పారిపోయారు. ఒకరోజు సౌలు, అతని సైనికులు దావీదు కోసం చూస్తున్నప్పుడు సౌలు ఒక గుహలోకి వెళ్లాడు. ఇది దావీదు దాగుకొన్న గుహ ఉంది, అయితే సౌలు దావీదును చూడలేదు. దావీదు సౌలు వెనుకకు చాలా దగ్గరగా వెళ్లి అతని వస్త్రం నుండి ఒక చిన్న ముక్కను కత్తిరించాడు, సౌలు గుహను విడిచిపెట్టిన తరువాత, అతడు పట్టుకొని ఉన్న వస్త్రపు ముక్కను చూడమని సౌలు వినేలా గట్టిగా అరచాడు. ఈ విధంగా, రాజు కావడం కోసం దావీదు తనను చంపడానికి నిరాకరించినట్లు సౌలు గుర్తించాడు.
కొద్దికాలానికే సౌలు యుద్ధంలో చనిపోయాడు, దావీదు ఇశ్రాయేలు రాజు అయ్యాడు. అతను మంచి రాజు, ప్రజలు దావీదు రాజును ప్రేమించారు. దేవుడు దావీదును ఆశీర్వదించి అతనిని విజయవంతంగా చేసాడు. దావీదు అనేక యుద్ధాలు చేసాడు. ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడించడానికి దేవుడు దావీదు సహాయం చేసాడు. దావీదు యెరూషలేము నగరాన్ని జయించాడు, దానిని తన రాజధాని నగరంగా చేసుకొన్నాడు. అక్కడ అతను జీవించి, నలభై ఏళ్ళు రాజుగా ఉన్నాడు.. ఈ సమయంలో, ఇజ్రాయెల్ శక్తివంతమైన, సంపన్నమైన దేశంగా మారింది.
ఇశ్రాయేలీయులందరూ దేవుణ్ణి ఆరాధించి, ఆయనకు బలులు అర్పించేలా ఒక దేవాలయాన్ని నిర్మించాలని దావీదు కోరుకున్నాడు. దాదాపు. 400 సంవత్సరాలు ప్రజలు మోషే తయారు చేసిన ప్రత్యక్షగుడారం వద్ద దేవుణ్ణి ఆరాధిస్తూ, బలులు అర్పిస్తూ వచ్చారు.
నాతాను అనే ప్రవక్త ఉన్నాడు, దేవుడు నాతానును దావీదు వద్దకు పంపాడు, నాతాను దావీదుతో, “నీవు అనేక యుద్ధాల్లో పోరాడావు, నీవు నా కోసం ఈ దేవాలయాన్ని నిర్మించవు, నీ కుమారుడు దాన్ని నిర్మిస్తాడు, అయితే నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నీ సంతతివారిలో ఒకడు నా ప్రజలను శాశ్వతంగా పరిపాలిస్తాడు!” దావీదు సంతానం శాశ్వత కాలం ప్రజలను పాలించగల ఏకైక రాజు మెస్సీయ. ఈ మెస్సీయ లోకంలోని ప్రజలను తమ పాపంనుండి రక్షిస్తాడు.
దావీదు నాతాను సందేశాన్ని విన్నప్పుడు, ఆయన దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. దేవుడు అతనిని ఘనపరచి, అనేక ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. అయితే దేవుడు ఇవన్నీ చేస్తాడని దావీదుకు తెలియదు. మెస్సీయ రావడానికి ముందు ఇశ్రాయేలీయులు దాదాపు 1,000 సంవత్సరాలు దురు చూడాల్సి వచ్చిందని మనకు తెలుసు.
దావీదు తన ప్రజలను చాలా సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన దేవునికి చాలా విధేయుడయ్యాడు, దేవుడు దావీదును ఆయనను ఆశీర్వదించాడు. అయితే తన జీవితపు అంతంలో దావీదు దేవునికి వ్యతిరేకంగా భయంకర పాపం చేసాడు. ఒక రోజు దావీదు తన రాజభవనం నుండి చూస్తూ ఒక అందమైన స్త్రీ స్నానం చేస్తుండడం చూసాడు. ఆమె అతనికి తెలియదు. అయితే ఆమె పేరు బత్షేబ అని తెలుసుకున్నాడు.
దానికి దూరంగా ఉండడానికి బదులు దావీదు ఆమెను తన దగ్గరకు తీసుకొచ్చేందుకు ఒకరిని పంపించాడు. దావీదు ఆమెతో పాపం చేసాడు, ఆమెను తన ఇంటికి తిరిగి పంపించాడు. కొంతకాలం తరువాత బత్షేబ తాను గర్భవతిని అని తెలియచేస్తూ దావీదుకు ఒక సందేశాన్ని పంపించింది.
బత్షెబ భర్త పేరు ఊరియా. అతడు దావీదు యొక్క ఉత్తమ సైనికులలో ఒకడు. అతడు ఆ సమయంలో యుద్ధంలో పోరాడుతూనే ఉన్నాడు. దావీదు యుద్ధరంగం నుండి అతణ్ణి రప్పించి తన భార్యతో ఉండమని చెప్పాడు. అయితే మిగిలిన సైనికులు యుద్ధంలో ఉన్నారు కనుక ఊరియా తన ఇంటికి వెళ్ళడానికి నిరాకరించాడు,. కనుక దావీదు ఊరియాను తిరిగి యుద్ధంలోనికి పంపించాడు. ఊరియా చంపబడేలా శత్రువు బలంగా ఉన్న చోట ఊరియాను ఉంచాలని దావీదు తన సైన్యాధిపతికి చెప్పాడు. ఇదే జరిగింది: ఊరియా యుద్ధంలో మరణించాడు.
ఊరియా యుద్ధంలో మరణించిన తరువాత, దావీదు బత్షేబను వివాహం చేసుకున్నాడు, తరువాత, ఆమె దావీదుకు ఒక కుమారునికి జన్మనిచ్చింది. దావీదు చేసిన దానిని బట్టి దేవుడు చాలా కోపంగా ఉన్నాడు, దావీదు చేసిన పాపం ఎంత దుష్టమైనదో దావీదుకు చెప్పాడానికి దేవుడు ప్రవక్త నాతానును పంపించాడు. దావీదు తన పాపం విషయంలో పశ్చాత్తాప పడ్డాడు. దేవుడు అతనిని క్షమించాడు. మిగిలిన తన జీవితంలో కష్టకాలాలలో కూడా దేవుణ్ణి అనుసరిస్తూ, విధేయుడయ్యాడు.
అయితే దావీదు మగ శిశువు చనిపోయాడు. దేవుడు దావీదును ఈ విధంగా శిక్షించాడు. ఆ విధంగా దావీదు చనిపోయేంతవరకు, తన సొంత కుటుంబంలో నుండి కొందరు అతనితో పోరాడుతూ వచ్చారు. దావీదు చాలా శక్తిని కోల్పోయాడు. అయితే దేవుడు నమ్మదగినవాడుగా ఉన్నాడు, దావీదు కోసం తాను చేస్తానని వాగ్దానం చేసిన దానిని దావీదు కోసం చేసాడు. తరువాత దావీదు, బత్షెబకు మరో కుమారుడు పుట్టాడు. ఆ బిడ్డకు సోలోమోను అనే పేరు పెట్టారు.
1 రాజులు 1-6; 11-12
రాజైన దావీదు నలుబది సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత దావీదు చనిపోయాడు. అతని కుమారుడు సొలోమోను రాజ్య పాలన ఆరంభించాడు. దేవుడు తాను సొలోమోను దేవుడు తనకు ఏమి చెయ్యాలని తాను కోరుకుంటున్నాడో దేవుడు అతనిని అడిగాడు. తనను జ్ఞాన వంతుడిగా చెయ్యాలని సొలోమోను అడిగాడు. అతని మనవి దేవునికి ఇష్టం అయ్యింది. కనుక ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతునిగా సొలోమోనును దేవుడు చేసాడు. సొలోమోను అనేక సంగతులను నేర్చుకొన్నాడు. జ్ఞానవంతుడైన పరిపాలకుడు అయ్యాడు. దేవుడు అతన సంపన్నమైన వాడిగా చేసాడు.
యెరూషలెంలో సోలోమోను దేవాలయాన్ని నిర్మించాడు. దీని కోసం తన తండ్రి దావీదు ప్రణాళిక చేసాడు, పరికరాలను సమకూర్చాడు. ఇప్పుడు ప్రజలు ప్రత్యక్షగుడారం లో కాకుండా దేవాలయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. దేవుడు దిగి వచ్చి దేవాలయంలో నివసిస్తున్నాడు. ఆయన తన ప్రజలతో నివసిస్తున్నాడు.
అయితే సొలోమోను ఇతర దేశాలనుండి వస్తున్న స్త్రీలను ప్రేమిస్తున్నాడు. అనేకమంది స్త్రీలను పెండ్లిచేసుకోవడం ద్వారా దేవునికి అవిధేయత చూపించాడు. వారిలో దాదాపు 1,000 మంది వరకూ ఉన్నారు! వీరిలో అనేకమంది ఇతర దేశాలనుండి వచారు, వారు తమతో పాటు తమ దేవతలనూ దేశంలోనికి తీసుకొనివచ్చారు. వారిని పూజించడం కొనసాగిస్తున్నారు. సొలోమోను వృద్ధుడైనప్పుడు తాను కూడా ఇతర దేవతలను పూజిస్తూ వచ్చాడు.
ఈ కారణంగా దేవుడు సొలోమోను పట్ల కోపగించుకొన్నాడు. దేశాన్ని రెండు దేశాలుగా విడగొట్టడం ద్వారా సొలోమోనును శిక్షిస్తానని చెప్పాడు. సొలోమోను చనిపోయిన తరువాత తాను శిక్షించబోతున్నాడు.  సొలోమోను చనిపోయిన తరువాత అతని కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. ఇశ్రాయేలు దేశంలోని ప్రజలందరూ ఒకచోటకు చేరి అతనిని రాజుగా అంగీకరించారు. అతని తండ్రి సొలోమోను తమ చేత అధిక పని చేయించేవాడనీ, తమ వద్ద అధిక పన్ను వసూలు చేసేవాడనీ రెహబాముకు పిర్యాదు చేసారు. పనిని తగ్గించమని రెహబాముకు మనవి చేసారు.
అయితే రెహబాము చాలా అజ్ఞానంగా వారికి జవాబు ఇచ్చాడు. అతడిలా అన్నాడు, “నా తండ్రి మిమ్మును పనిలో కష్టపెట్టాడని మీరు చెపుతున్నారు, అయితే ఆయన కంటే ఎక్కువగా మిమ్మును పని చేయిస్తాను. ఆయన కంటే ఎక్కువగా మిమ్మును కష్టపెడతాను.”  రాజు ఈ మాట చెప్పడం ప్రజలు వినినప్పుడు, వారిలో ఎక్కువ మంది రాజును వ్యతిరేకించారు. పది గోత్రాలు రాజును విడిచి పెట్టి వెళ్ళారు; రెండు గోత్రాల ప్రజలు మాత్రమే రాజుతో ఉన్నారు. ఈ రెండు గోత్రాలు తమ్మును తాము యూదా రాజ్యంగా పిలుచుకొన్నారు.
మిగిలిన పది గోత్రాలు యెరోబాము తమ రాజుగా ఉండడానికి అంగీకరించాయి. ఈ పది గోత్రాలు ఉత్తరభాగంలో ఉన్నారు. వారు తమ్మును తాము ఇశ్రాయేలు రాజ్యం అని పిలుచుకొన్నారు. అయితే యెరోబాము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాడు. ప్రజలు పాపం చేసేలా కారకుడు అయ్యాడు. దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి యూదా రాజ్యంలోని యెరూషలెంలో దేవాలయానికి వెళ్ళలేదు.
యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం ఒకరికి ఒకరు శత్రువులుగా మారారు. తరచుగా ఒకరికొకరు విరోధంగా యుద్ధాలు చేసుకొన్నారు. ఇశ్రాయేలు నూతన రాజ్యంలో రాజులందరూ దుష్టులుగా ఉన్నారు. వీరిలో అనేకులు ఇతర ఇశ్రాయేలీయుల చేత చంపబడ్డారు. వారి స్థానంలో రాజులు కావడం వారి కోరిక. ఇశ్రాయేలు దేశంలో అనేకమంది రాజులూ, ప్రజలూ విగ్రహాలను పూజించారు. వారు ఆ విధంగా చేసినప్పుడు వారు తరచుగా వేశ్యలతో పాపం చేసేవారు, కొన్నిసార్లు తమ పిల్లలను సహితం విగ్రహాలకు బలి ఇచ్చేవారు.
యూదా రాజ్యం రాజులు దావీదు సంతానం. వీరిలో కొందరు యధార్ధంగా ఉండేవారు, వారు నీతితో పరిపాలన చేసారు, దేవుణ్ణి ఆరాధించేవారు. అయితే యూదా రాజులలో అనేకులు దుర్మార్గులు. వారు దుర్మార్గంగా పరిపాలన చేసారు, వారు విగ్రహాలను ఆరాధించారు, వీరిలో కొందరు తమ పిల్లలను తమ దేవతలకు బలిగా అర్పించారు. యూదా రాజ్యంలోని అనేకులు దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు, ఇతర దేవుళ్ళను ఆరాధించారు.
రూతు 1-27
యూదా దేశంలో బెల్లెహేము అనే గ్రామం వుంది. ఆ ఊరిలో ఎలీమెలెకు అనే పేరుగల మనుష్యుడు తన భార్యతో ఉంటున్నాడు. వారికి యిద్దరు కుమారులున్నారు. వారి పేర్లు మహ్లాను, కిల్యోను. యూదా దేశంలో గొప్ప కరవు వ్యాపించింది. ప్రజలు తిండిలేక, పంటలు పండక చాల కష్టపడసాగారు. అందువల్ల ఎలీమెలెకు తన భార్యను, యిద్దరు కుమారులను తీసికొని మోయాబు దేశానికి వెళ్లాడు. బెల్లెహేము అను మాటకు రొట్టెల యిల్లు అని అర్ధం వుంది. ఎలీమెలెకు తాత్కాలికంగా వచ్చిన కష్టాలకు భయపడి, దీవెన కరమైన గ్రామాన్ని విడిచి, విగ్రహారాధనకు, అక్రమాలకు స్థావరమైన మోయాబుదేశానికి వెళ్ళాడు. అక్కడ తన కుమారులకు రూతు, ఓర్చా అనే మోయాబు యువతులను పెండ్లి చేశాడు. అక్కడ పది సం||లు గడిచిపోయాయి.
ఎలీమెలెకు, అతని యిద్దరు కుమారులు చనిపోయారు. నయోమి, ఆమె యిద్దరు కోడళ్లు మిగిలిపోయారు. నయోమిపై విధవలుగా వున్న యిద్దరు కోడళ్ల భారం పడింది... కాలం మారింది. వర్షాలు కురిశాయి. యూదా దేశంలో పంటలు పండాయని, దేవుడు ఆ దేశాన్ని కరుణించాడని నయోమి విన్నది. ఆమె తన యిద్దరు కోడళ్ళను తీసికొని బెల్లెహేముకు ప్రయాణమైంది. మార్గంలో ఆమె కోడళ్లతో - మీరు మీ తల్లుల దగ్గరికి వెళ్లండి అని బ్రతిమిలాడింది. ఎవరైనా మోయాబు దేశంలోని యువకులను పెండ్లాడి, సుఖపడమని చెప్పింది. ఓర్సాకు ఆమె సలహా నచ్చింది. ఆమె అత్తను ముద్దు పెట్టుకొని, ఆమె వద్ద సెలవు తీసికొని వెనక్కు వెళ్ళిపోయింది. కాని రూతు మాత్రం వెళ్ళలేదు. ఆమె నయోమితో యిలా అన్నది. "నీవు వెళ్ళిన చోటికే నేను కూడ వస్తాను. నీవు వున్న చోటనే నేను కూడ వుంటాను. నీ దేవుడే నా దేవుడు. నీ జనమే నా జనము. నీవు మరణించిన చోటనే నేను కూడ మరణిస్తాను" నయోమి రూతు మాటలకు సంతోషించింది. ఆమె యిష్టాన్ని మన్నించింది. ఆమెను తన వెంట పెట్టుకొని బెల్లె హేము గ్రామానికి చేరింది.
యూదా దేశంలో పంటలు బాగా పండాయి. యవల కోత ప్రారంభం అయింది. అత్త సలహా పాటించి రూతు, సమీప బంధువైన బోయజు పొలంలో పరిగి ఏరుకొనడానికి వెళ్ళింది. బోయజు చాల ధనవంతుడు, దయగలవాడు, ఉత్తమ గుణసంపన్నుడు. అతడు రూతును గురించిన విషయాలు తెలిసికొన్నాడు. ఆమె పరిస్థితికి జాలిపడ్డాడు. ఆమెను ప్రతిరోజు, తన పొలంలోనే పరిగె ఏరుకోమన్నాడు. తన కూలీల వెంబడే వుండమని చెప్పాడు. వాళ్ళతో పాటే తిని, వాళ్లు త్రాగే కుండల్లో నీళ్లు త్రాగమన్నాడు. సాయంత్రం రూతు బోయజు పొలం నుండి యింటికి వచ్చింది. ఆమె తన అత్త నయోమితో జరిగిన సంగతులన్నీ వివరించింది.
ఆమె రూతు చెప్పినదంతా విన్నది. బోయజు తమకు దగ్గరి బంధువనీ, రోజూ అతని పొలంలోనే పరిగే ఏరుకోవడం మంచిదనీ చెప్పింది. బోయజు మంచి వాడనీ, దయగలవాడనీ, బంధు ప్రేమ గలవాడనీ, రూతును తప్పక ఆదరిస్తాడని అర్థం చేసికొంది. యవల కోతలు పూర్తయ్యాయి. “నీవు రాత్రి సమయంలో వెళ్ళి కళ్లం దగ్గర పండుకొన్న బోయజు కాళ్ల దగ్గర పండుకొమ్మని" నయోమి రూతుకు సలహా యిచ్చింది. రూతు అత్త చెప్పిన విధంగా చేసింది. బోయజు రూతు వినయాన్ని, మంచి గుణాలను గ్రహించాడు. బోయజు రూతుతోయిలా అన్నాడు - "కుమారీ! నీ మునుపటి సత్ ప్రవర్తనకంటె, యిప్పటి సత్ప్ర వర్తన మెచ్చుకొనదగినది. నీవేమీ భయపడవద్దు. నేను నిన్ను ఆదరిస్తాను. నీకు అండగా వుంటాను. నీవు చాల యోగ్యురాలవి, అనే సంగతి నా బంధువులకు, నా గ్రామ ప్రజలందరికి బాగా తెలియును. నేను నీకు బంధు ధర్మము జరిగిస్తాను. నీ ఆస్తిని, నిన్ను విడిపిస్తాను. అయితే నీకు దగ్గరి బంధువైన వాడు, నిన్ను విడిపించ తగినవాడు
ఒకడున్నాడు. అతడు తన బంధు ధర్మము జరిగించకుంటే నేను తప్పక నిన్ను విడిపిస్తాను. ఆస్తిని నీకు యిప్పిస్తాను, నిన్ను నా దానినిగా చేసికొంటాను". తెల్లవారక ముందే బోయజు రూతును ఆమె యింటికి పంపించాడు. ఆమెకు 'ఆరు కొలలు (ఆరు మానికలు) యవలు యిచ్చి పంపించాడు. రూతు రాత్రి జరిగిన విషయమంతా నయోమికి చెప్పింది. అంతా విని నయోమి చాలా సంతోషించింది. రేపు బోయజు నీకు తప్పకుండా న్యాయం జరిగిస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు నిశ్చింతగా వుండు. అని ధైర్యం చెప్పింది.
-
మరుసటి రోజు బోయజు బెల్లె హేము పురద్వారం వద్దకు వెళ్ళాడు. పదిమంది పెద్దలను పిలిపించి, అక్కడ కూర్చండబెట్టాడు. ఆ దారిన వెళుతున్న నయోమి బందువును పిలిచాడు, నయోమి అమ్మదలచుకొన్న భూమిని గురించి, ఆమె కోడలైన రూతును గురించి వివరించాడు. బంధు ధర్మము జరిగించి వాళ్లకు మేలు చేయమని కోరాడు. అంతా విన్న బంధువు, తాను నయోమి పొలం తీసుకోవడానికి సిద్ధమేననీ, ఆమె కోడలు రూతును మాత్రం పెండ్లి చేసుకోననీ కచ్చితంగా చెప్పాడు. ఆమెను పెండ్లి చేసికొంటే నా స్వాస్థ్యం పోగొట్టుకుంటాను కదా అన్నాడు. అందువల్ల బోయజు ఎలీమెలెకు, అతని కుమారుల ఆస్తిని విడిపించి, కూతును తన భార్యగా స్వీకరించాడు. తాను చెప్పిన మాట నెరవేర్చారు.
1 రాజులు 16-18; 2 రాజులు 5; యిర్మియా 38
దేవుడు అన్ని సమయాలలో తన ప్రజల వద్దకు తన ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. ప్రవక్తలు దేవుని నుండి సందేశాలను వింటారు, వాటిని ప్రజలకు చెపుతుంటారు. ఇశ్రాయేలు దేశం మీద ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. ఆహాబు రాజు చాలా దుర్మార్గుడైన రాజు. ప్రజలు అబద్దపు దేవుడు బయలును పూజించేలా చెయ్యాలని ప్రయత్నించాడు. కనుక ఏలియా ఆహాబు రాజుతో దేవుడు ప్రజలను శిక్షించబోతున్నాడని చెప్పాడు. అతడు రాజుతో ఇలా చెప్పాడు.“నేను చెప్పేవరకు ఈ రాజ్యంపై వర్షం, మంచు కురవదు.” ఇది విని ఆహాబుకు కోపం వచ్చి ఏలియాను చంపాలనుకున్నాడు.
కనుక దేవుడు ఏలియా ఆహాబునుండి తప్పించుకోడానికి అరణ్య ప్రదేశానికి వెళ్లాలని చెప్పాడు. ఏలియా తనకు దేవుడు చెప్పిన అరణ్యప్రదేశానికి ఒక వాగు దగ్గరకు వెళ్ళాడు. ప్రతీ ఉదయం, ప్రతీ సాయంత్రం పక్షులు ఏలియాకు రొట్టెనూ, మాంసాన్ని తీసుకొనివచ్చాయి. ఈ కాలంలో ఆహాబు, అతని సైన్యం ఏలియా కోసం వెదికారు అయితే వారు అతనిని కనుగొనలేకపోయారు.
ఆ దేశంలో వర్షం లేదు, కొంత కాలానికి ఆ వాగులోని నీరు ఎండిపోయింది. కనుక ఏలియా దగ్గరలో ఉన్న మరొక దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో ఒక పేద విధవరాలు ఉంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. వారికి ఆహారం లేదు. ఎందుకంటే పంట లేదు. అయినా ఆమె ఏలియాకు ఆహారాన్ని పెట్టింది. అందుచేత దేవుడు ఆమెకూ, ఆమె కుమారునికి కావలసిన ఆహారాన్ని దయచేశాడు. వారి పిండి పాత్ర, నూనె బుడ్డి ఎప్పటికీ తక్కువ కాలేదు. కరువు కాలమంతయూ వారికి ఆహారం సమృద్ధిగా ఉంది. ఏలియా అక్కడ అనేక సంవత్సరాలు ఉన్నాడు.
మూడున్నర సంవత్సరాలు గడిచిన తరువాత, వర్షాన్ని తిరిగి రప్పిస్తానని దేవుడు ఎలియాతో చెప్పాడు. ఇశ్రాయేలు రాజ్యానికి వెళ్లి రాజైన ఆహాబుతో ఈ మాట చెప్పాలని దేవుడు చెప్పాడు. కనుక ఏలియా ఆహాబు వద్దకు వెళ్ళాడు. ఆహాబు ఏలియాను చూచినప్పుడు అతడు ఇలా అన్నాడు, “నీవే సమస్యల్ని సృష్టించేవాడవు!” ఏలియా ఇలా జవాబిచ్చాడు. “రాజా, నీవే సమస్యల్ని సృష్టించేవాడవు! యెహోవాను నిరాకరించావు. ఆయనే నిజమైన దేవుడు. అయితే నీవు బయలు దేవతను పూజిస్తున్నావు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కర్మెలు కొండవద్దకు తీసుకొని రావాలి.”
కనుక ప్రజలందరూ కర్మెలు కొండ వద్దకు వెళ్ళారు. బయలు సందేశాలు చెప్పేవారు అక్కడికి వచ్చారు. వారు బయలు ప్రవక్తలు. వారు 450 మంది ఉన్నారు. ఏలియా ప్రజలతో ఇలా చెప్పాడు, “మీరెంతకాలం మార్పు చెందకుండా ఉంటారు? యెహోవా దేవుడైన్తా ఆయనను పూజించండి! బయలు దేవుడైతే బయలును పూజించండి!”
అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలతో, “ఒక ఎద్దును వధించి, దాని మాంసమును ఒక బలిపీఠం మీద హోమబలిగా అర్పించండి, అయితే దాని మీద ఎటువంటి అగ్నిని రాజేయకండి, తరువాత నేను అదే కార్యాన్ని చేస్తాను. మరొక బలిపీఠం మీద మాంసాన్ని ఉంచుతాను. దేవుడు దాని మీదకు అగ్నిని పంపిన యెడల ఆయన నిజమైన దేవుడని మీరు తెలుసుకుంటారు.” కనుక బయలు ప్రవక్తలు ఒక బలిని సిద్ధపరచారు, అయితే అది అగ్నితో కాల్చబడలేదు.
అప్పుడు బయలు ప్రవక్తలందరూ బయలుకు ప్రార్థన చేసారు, “బయలూ మా ప్రార్థన ఆలకించు!” ఆ దినమంతా వారు ప్రార్థనలు చేసారు, గట్టిగా అరచారు. తమ శరీరాలను సహితం వారు కత్తులతో కోసుకున్నారు, అయినా బయలు జవాబు ఇవ్వలేదు. బలిపీఠం మీదకు అగ్నిని పంపించలేదు.
బయలు ప్రవక్తలు దాదాపుగా ఆ రోజంతా బయలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చివరికి వారు ప్రార్థన చెయ్యడం మానివేశారు. అప్పుడు ఏలియా మరొక ఎద్దును చంపి దాని మాంసమును బలిపీఠం మీద ఉంచాడు. దాని తరువాత దీని మీద ఆ మాంసం, బలిపీఠం, ఆ భూమి అంతా నిండిపోయేలా పన్నెండు పెద్ద కుండలతో నీళ్ళను పోయాలని ప్రజలతో చెప్పాడు.
అప్పుడు ఏలియా ఇలా ప్రార్థన చేసాడు, “యెహోవా, అబ్రాహాము, ఇస్సాకు, యూకోబుల దేవా నీవే ఇశ్రాయేలు నిజమైన దేవుడవనీ, నేను నీ సేవకుడననీ నేడు మాకు కనుపరచు. ఈ ప్రజలు నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొనేలా నా ప్రార్థనకు జవాబివ్వు.” వెంటనే ఆకాశంనుండి అగ్ని దిగివచ్చింది, ఆ మాంసాన్నీ, కట్టెలనూ, రాళ్ళనూ, ఆ భూమిని, బలిపీఠం చుట్టూ ఉన్న నీళ్ళనూ కాల్చి వేసింది. ప్రజలు ఈ కార్యాన్ని చూసినప్పుడు వారు నేలమీద సాగిలపడి, “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు!” అని గట్టిగా అరచారు.
అప్పుడు ఏలియా ఇలా అన్నాడు, “బయలు ప్రవక్తలను ఎవరినూ తప్పించుకోనివ్వకండి!” అందుచేత ప్రజలు బయలు ప్రవక్తలను పట్టుకొన్నారు, అక్కడినుండి వెలుపలికి తీసుకొని వెళ్లి వారిని చంపారు.
అప్పుడు ఏలియా ఆహాబు రాజుతో ఇలా చెప్పాడు, “నీవు త్వరపడి నీ ఇంటికి వెళ్ళు, ఎందుకంటే వర్షం రాబోతుంది.” వెంటనే ఆకాశం నలుపుగా మారింది. దేవుడు కరువు స్థితిని ముగించబోతున్నాడు. దానిని బట్టి ఆయనే నిజమైన దేవుడని రుజువు అయ్యింది.
ఏలియా తన కార్యాన్ని ముగించిన తరువాత, దేవుడు ఎలిషా అను ఒక వ్యక్తిని తన ప్రవక్తగా ఉండడానికి ఎంపిక చేసాడు. దేవుడు ఎలిషా ద్వారా అనేక ఆశ్చర్యకార్యాలు చేసాడు. నయమానుకు జరిగిన అద్భుతకార్యం దానిలో ఒకటి. నయమాని ఒక సైన్యాధికారి. అయితే అతనికి చర్మ వ్యాధి కలిగింది. నయమాను ఎలిషాను గురించి విన్నాడు. కనుక అతడు ఎలిషా వద్దకు వెళ్లి తనను బాగు చెయ్యాలని అడిగాడు. యొర్దాను నదిలో ఏడుసార్లు మునగాలని నయమానుకు ఎలిషా చెప్పాడు.
నయమాను కోపగించుకొన్నాడు, నదిలో మునగడానికి అతడు నిరాకరించాడు. అది అతనికి తెలివితక్కువ తనం అనిపించింది. తరువాత తన మనసును మార్చుకొన్నాడు. యొర్దాను నది వద్దకు వెళ్ళాడు. ఆ నీటిలో ఏడుసార్లు మునిగాడు, ఏడుసార్లు నీటిలో మునిగి బయటికి వచ్చినప్పుడు దేవుడు అతనిని బాగుచేసాడు.
దేవుడు ఇశ్రాయేలు ప్రజల వద్దకు అనేకమంది ప్రవక్తలను పంపించాడు. ప్రజలు విగ్రహాలను పూజించడం మానివేయాలని వారందరూ చెప్పారు. దానికి బదులు వారు ఒకరి విషయంలో ఒకరు నీతిగా జీవించాలని, ఒకరి పట్ల ఒకరు కరుణ కలిగి యుండాలని చెప్పారు. దుష్టత్వాన్ని మాని దేవునికి విధేయత చూపించాలని వారు ప్రజలను హెచ్చరించారు. ఇశ్రాయేలు ప్రజలు ఈవిధంగా చెయ్యని యెడల దేవుడు వారి దోషాన్ని బట్టి వారిని శిక్షిస్తాడు, వారికి తీర్పు చేస్తాడు.
ఎక్కువ కాలం ప్రజలు దేవునికి విధేయత చూపించలేదు. ప్రవక్తలకు కీడు కలిగించారు, కొన్నిసార్లు వారు ప్రవక్తలను చంపారు. ఒకసారి యిర్మియా ప్రవక్తను ఎండిపోయిన బావిలో పడవేశారు. అతడు బావి ఆడుగు ప్రాంతంలోని బురదలో కూరుకుపోయాడు. అయితే రాజుకు ప్రవక్త పట్ల జాలి కలిగింది. యిర్మియా అక్కడ చనిపోవడానికి ముందే దానిలోనుండి తీయాలని సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు.
ప్రజలు వారిని ద్వేషించినా ప్రవక్తలు ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నారు. వారు పశ్చాత్తాప పడని యెడల దేవుడు వారిని శిక్షిస్తాడని ప్రజలను వారు హెచ్చరించారు. వారికి మెస్సీయను పంపిస్తాడని దేవుడు చేసిన వాగ్దానాన్ని వారికి జ్ఞాపకం చేసారు.
న్యాయాధిపతులు 13-16;
ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుణ్ణి, ఆయన వారికి చేసిన మేళ్లను మరచారు. అన్యుల దేవతలను పూజింపసాగారు. అక్రమజీవితం గడపసాగారు. అందువలన యెహోవాకు కోపం తెప్పించారు. యెహోవా వారిని 40 సం॥ల పాటు వారి శతృవులైన ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఆ సమయంలో
దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడి వారి తరపున యుద్ధం చేయడానికి మహా బలశాలి, పరాక్రమశాలి అయిన సమ్సోనును బలపరచాడు. జొర్యా పట్టణంలో మనోహ అనే మనుష్యుడు ఉండే వాడు. అతని భార్యకు పిల్లలు లేరు. ఒక రోజు యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు. “నీవు త్వరలో ఒక కుమారుని కంటావు. నీవు ద్రాక్షారసముగాని, మద్యముగాని సేవించరాదు. అపవిత్రమైన పదార్ధములు తినకూడదు. పుట్టినది మొదలుకొని నీ కుమారుని తలమీద మంగలి కత్తి పెట్టకూడదు. అతడు ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల బానిసత్వం నుండి
కాపాడుతాడు” ఆ స్త్రీ దేవదూత తనతో చెప్పిన మాటలను భర్తతో చెప్పింది. భర్త ఆమె మాటలు నమ్మలేదు. యెహోవా దేవుని ప్రార్ధించాడు. కొన్ని దినాలు గడిచాయి. దేవుని దూత పొలంలో మనోహకు కనిపించి పుట్టబోయే కుమారుణ్ణి ఎలా పెంచాలో వివరించాడు. అప్పుడు మనోహ సంతోషంతో దేవునికి దహనబలి అర్పించాడు. కొంత కాలం తర్వాత మనోహ భార్య ఒక కుమారుని ప్రసవించింది. అతనికి “సమ్సోను" అని పేరు పెట్టింది.
సమ్సోను పెరిగి పెద్దవాడయ్యాడు. అతడు తిమ్నాతులో ఒక ఫిలిస్తి యువతిని ప్రేమించాడు. ఆమెను పెండ్లి చేసికోవాలని పట్టుపట్టాడు. తల్లిదండ్రులు యిష్టపడలేదు. సమ్సోను తిమ్నాతుకు వెళ్తున్నాడు. మార్గంలో ఒక కొదమ సింహము అతని మీదికి వచ్చింది. సమ్మోను చేతిలో ఎలాంటి ఆయుధము లేదు. సమ్పోనును దేవుడు బలపరచాడు. అతడు ఆ సింహాన్ని సునాయాసంగా చీల్చి చంపాడు. తాను సింహాన్ని చంపిన విషయం అతడు ఎవరికీ చెప్పలేదు. కొంతకాలమైన తరువాత సమ్సోను అదే దారిన నడిచి వెళ్తున్నాడు. తాను చంపిన సింహపు కళేబరములో తేనెపట్టు వుండడం చూశాడు అతడు ఆ తేనెను తిని, యింటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు కూడ కొంత యిచ్చాడు
సమ్సోను తిమ్నాతులోని ఫిలిష్తీయ యువతిని పెండ్లి చేసికొన్నాడు ఫిలిష్తీయుల ఆచారం ప్రకారము పెండ్లి కుమారుడు ముప్పది మంది స్నేహితులకు విందు చేయాలి. విందు జరుగు సమయంలో సమ్సోను ముప్పదిమందిని ఒక పొడుపుకథ అడిగాడు. దాని అర్ధం వివరించమని కోరాడు
బలమైన దానిలోనుండి తీపి వచ్చెను తిను దానిలో నుండి తిండి వచ్చెను"
ఫిలిష్తీయులు ఎంత ఆలోచించినా, పొడుపు కథకు సమాధానం చెప్పలేకపోయారు. వాళ్ళు సమ్సోను భార్య దగ్గరికి వెళ్ళారు. ఎలాగైనా నీ భర్తను అడిగి ఈ పొడుపు కథకు జవాబు తెలిసికొమ్మని బ్రతిమిలాడారు సమ్సోను ఆమెకు సమాధానం చెప్పలేదు. అప్పుడు ఫిలిష్తీయులు "ఈ రహస్యం తెలిసికొనకుంటే నిన్ను, నీ తండ్రి యింటివారిని కాల్చి వేస్తాము" అని సమ్సోను భార్యను బెదరించారు. కాబట్టి సమ్సోను భార్య ప్రతిరోజు ఏడుస్తూ, పొడుపు కథకు సమాధానం చెప్పమని బ్రతిమిలాడసాగింది. చివరకు సమ్సోను విసుగెత్తి జవాబు చెప్పాడు. ఏడవ దినము అందరు కూడి వచ్చి “తేనె కంటే తీయని వస్తువేది? సింహము కంటే బలమైనది ఏది?" అని చెప్పారు. అందుకు సమ్సోను "నా దూడతో దున్నకపోతే నా పొడుపుకథకు సమాధానం చెప్పగలిగేవారు కాదు" అన్నాడు. యెహోవా ఆత్మ సమ్సోనును ప్రేరేపింపగా అతడు ముప్పది మందిని చంపి, వారి సొమ్మును దోచుకొని,
పొడుపు కథకు భావం చెప్పినవారికి యిచ్చాడు. తర్వాత కోపంతో తన యింటికి వెళ్ళిపోయాడు. అందువలన సమ్సోను తన భార్యను విడిచి వెళ్ళాడని తలంచిన ఆమె తల్లిదండ్రులు, ఆమెను సమ్సోను స్నేహితునికి యిచ్చి పెండ్లి చేశారు.
కొంత కాలమైన తర్వాత సమ్సోను తన భార్య దగ్గరికి వచ్చాడు. ఆమెను తన స్నేహితునికి యిచ్చి పెండ్లి చేశారని తెలిసికొని చాల కోపపడ్డాడు. వెళ్లి 300 నక్కలను పట్టుకొని జతలుగా వాటి తోకలు కట్టాడు. తోకలకు దివిటీలు కట్టి వదిలాడు. అవి వెళ్ళి ఫిలిష్తీయుల గోధుమ పొలాలను, పనల కుప్పలను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగుల బెట్టాయి. ఈ నష్టం అంతటికి సమ్సోను కారకుడని తెలిసికొన్న ఫిలిప్తీయులు అతని భార్యను, మామను చంపివేశారు. ఈ సంగతి తెలిసిన సమ్సోనుయింకా చాలా మందిని తుంట్లు విరుగగొట్టి చంపివేశాడు. సమ్సోను వెళ్ళి ఏతాము బండ సందులో వుంటున్నాడు. అతనిని పట్టుకోవాలని ఫిలిపీయులు పెద్ద సైన్యంతో బయలుదేరారు. అప్పుడు యూదా ప్రజలు సమ్సోను దగ్గరికి వెళ్ళారు. అతన్ని బ్రతిమిలాడి, తాళ్లతో, సంకెళ్ళతో కట్టి తెచ్చి ఫిలిష్తీయులకు అప్పగించారు. సమ్సోను యెహోవా ఆత్మచేత బలపరచబడి ఆ తాళ్ళను, సంకెళ్ళను లైంపివేశాడు. అక్కడ పడివున్న ఒక గాడిద దవడ యెముకను తీసికొని దానితో వెయ్యిమందిని చంపాడు. - సమ్సోను గాజా పట్టణంలో ఒక వేశ్య యింటిలో వుంటున్నాడు. ఈ సంగతి తెలిసిన గాజా ప్రజలు అతన్ని చంపాలని పొంచి వున్నారు. అయితే సమ్సోను మధ్యరాత్రి వేళ లేచి, పట్టణపు తలుపులను, వాటి ద్వార బంధములతో సహా ఊడ పెరికి తన భుజాలపై పెట్టుకొని పారిపోయాడు. శతృవులు సమ్సోనును పట్టుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్ధమయ్యాయి.
సమ్సోను దెలీలా అను స్త్రీని ప్రేమించాడు. ఆమె యింట్లో ఎక్కువ సమయం వుండేవాడు. ఈ సంగతి తెలిసికొన్న ఫిలిష్తీయుల సర్దారులు దెలీలా దగ్గరికి వచ్చి - "సమ్సోను బలము దేనిలో వున్నదో తెలిసికొని చెప్పు. నీకు ప్రతి ఒక్కరమూ వెయ్యిన్ని నూరు వెండి నాణెములు యిస్తాము. మేము సమ్సోనును బంధించి అతని గర్వాన్ని అణచాలి" అన్నారు. దెలీలా సమ్సోను పట్ల అధిక ప్రేమ చూపసాగింది. అతడు సంతోషంగా వున్నప్పుడు "నీ బలము యొక్క రహస్యం ఏమిటో చెప్పు” అని అడిగింది. అందుకు సమ్సోను "ఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించవచ్చు" అన్నాడు. సమ్సోను నిద్రపోతున్న ప్పుడు దెలీలా అతన్ని నిరవంజి చువ్వలతో బంధించింది. ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారని చెప్పింది. సమ్సోను ఆ నిరవంజి చువ్వలను నూలు దారాల వలె అతి సులభంగా తెంచి వేశాడు. రెండవసారి కొత్త తాళ్ళతో బంధించమని చెప్పాడు. వాటిని కూడ సులభంగా తెంచి వేశాడు. మూడవ
సారి నా వెంట్రుకలను జడలుగా చేస్తే నేను బంధీనైపోతాను అన్నాడు. దెలీలా సమ్సోను వెంట్రుకలను ఏడు జడలుగా అల్లి వాటిని మేకులతో దిగగొట్టింది. ఈ పర్యాయము సమ్సోను మేకులతో సహా ఊడదీసికొని పోయాడు. అప్పుడు దెలీలా “నీకు నా మీద ప్రేమలేదు. కాని నన్ను ప్రేమిస్తున్నానని అబద్దం చెబుతున్నావు. నన్ను మూడుసార్లు ఎగతాళి చేశావు. యిప్పుడైనా నీ బలం దేనిలో వుందో చెప్పు” అని బ్రతిమిలాడింది. సమ్సోను విసుగు చెంది చచ్చిపోతే మంచిది అనుకొన్నాడు. ఈసారి అతడు ఈ విధంగా నిజం చెప్పాడు "నేను పుట్టినప్పటినుండి దేవునికి నాజీరు చేయబడినవాడిని. నా తల మీదికి మంగలి కత్తి రాలేదు. నాకు క్షవరం చేసినట్లయితే నా బలమంతా పోతుంది.” దెలీలా ఈ నిజాన్ని తెలిసికొని వెంటనే ఫిలిష్తీయుల సర్దార్లను పిలిపించింది. వారు డబ్బు తీసికొని వచ్చారు. ఆ రాత్రి దెలీలా సమ్సోనును తన తొడపై నిద్రపుచ్చి ఒక మనుష్యుని చేత పూర్తిగా క్షవరం చేయించింది. ఆ తరువాత " ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారు. త్వరగా లేచి పారిపో" అని చెప్పింది. సమ్సోను యింతకు ముందు వలెనె లేచి బంధాలు తెంచుకోవాలనుకొన్నాడు. కాని యెహోవా తనను ఎడబాసినాడని గ్రహించలేదు. ఫిలిష్తీయులు సమ్సోనును బంధించి, అతని కన్నులు తీసి వేశారు. ఇత్తడి సంకెళ్ళతో బంధించి చెరసాలలో వేశారు.
సమ్సోను తమకు బంగీగా దొరికినందుకు ఫిలిష్తీయుల సర్దారులు చాలా సంతోషించారు. తమ దేవత అయిన దాగోను గుడిలో కొన్ని వేలమంది అధికారులు, పురుషులు, స్త్రీలు సమావేశమయ్యారు. ఈ సంతోష సమయంలో ఖైదీగా వున్న సమ్సోనును గుడిలోనికి తెచ్చారు. రెండు స్తంభాల మధ్య కట్టి వేశారు. సమ్సోను భటులను అడిగి ఆ గుడికి ఆధారంగా వున్న రెండు స్తంభాలను అనుకొని నిలబడ్డాడు. ప్రజలందరు సంతోషంతో కేకలు వేస్తూ, సమ్సోనును ఎగతాళి చేస్తూ వున్నారు. అప్పుడు సమ్సోను చివరి సారిగా తనకు బలాన్ని యివ్వమని యెహోవా దేవుణ్ణి ప్రార్థించాడు. ఈ ఒక్కసారి ఫిలిప్తీయులను శిక్షించి పగ తీర్చుకొమ్మని వేడుకొన్నాడు.
సమ్సోను గుడికి మూలాధారంగా వున్న రెండు స్తంభాలను రెండు చేతులతో పట్టుకొని బలముతో వంగి “నేనును, ఫిలిష్తీయులను చనిపోదుముగాక” అన్నాడు. అతడు రెండు స్తంభములను పట్టుకొని వంగినప్పుడు, గుడి సర్దారుల మీద, జనులందరి మీద పడింది. అప్పుడు అతడు చంపిన వారి లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారికంటె ఎక్కువ. సమ్సోను దేవుడు ఏర్పరచుకొనిన న్యాయాధిపతి.
యోనా 1-4
బైబిలులోని చిన్న ప్రవక్తలలో యోనా ఒకడు. యోనా దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని ఆజ్ఞలను పాటించేవాడు. దేవుని మాటలను
ప్రజలకు ఉపదేశిస్తూ వుండేవాడు. యోనా తండ్రి పేరు అమిత్తయి. ఒకసారి యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై "నినెవె పట్టణంలో వుండే ప్రజలు నన్ను మరచిపోయి, నాకు వ్యతిరేకంగా, తమ యిష్టం వచ్చిన విధంగా జీవిస్తున్నారు. వారిపై నాకు చాల కోపం వచ్చింది. నీవు వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి రాబోతుందని ప్రకటించు” అని ఆజ్ఞాపించింది. నినెవె ఒక మహానగరము. దాని జనాభా ఒక లక్ష యిరవై వేలు దానిని చుట్టి రావాలంటే మూడు దినాలు పడుతుంది. ఆ నగరంలోని ప్రజలు చాల ధనవంతులు. చాల తెలివి గలవారు. అయితే చాల దుర్మార్గులు కాబట్టి యోనా ఆ పట్టణానికి వెళ్లడానికి జంకాడు వాళ్లు తన మాట వినరనీ, తనను చంపుతారని భయపడ్డాడు. అందువల్ల నినెవె పట్టణానికి పోకుండా, మరో చోటికి
పోవాలని తలంచాడు. యెప్పే అనే రేవు పట్టణానికి వెళ్ళి, డబ్బు చెల్లించి తర్ణీషు వెళ్లే ఓడ ఎక్కాడు. ఓడ క్రింది భాగానికి వెళ్ళి హాయిగా నిపోతున్నాడు.
యోనా చేసిన పనికి యెహోవా దేవునికి చాల కోపం వచ్చింది. ఆయన సముద్రంలో గొప్ప తుఫాను పుట్టించాడు. పెద్ద గాలి అటు ఇటు వీస్తోంది.
గాలికి పెద్ద పెద్ద అలలు లేచాయి. అలల తాకిడికి ఓడబద్దలై పోతుందేమో అనిపిస్తోంది. ప్రయాణీకులు ఎంతో భయపడసాగారు. నావికులు, ఓడను అదుపు
చేయలేకపోతున్నారు. చాల సరుకులు సముద్రంలో వేసి, ఓడను తేలిక చేశారు. అందరూ తమ తమ దేవతలను ప్రార్ధింపసాగారు. అయినా తుఫాను తగ్గలేదు. కొందరు వెళ్ళి యోనాను నిద్ర లేపారు. “నిద్రపోతా! నీకు కొంచెమైనా భయం లేదు. లేచి దేవుని ప్రార్ధించు. ఆయన దయ చూపిస్తే ఈ తుఫాను తగ్గిపోతుంది.” అని చెప్పారు.
ఓడలో వున్నవారు ఒక పని చేయాలనుకొన్నారు. “మనం చిటిలు వేద్దాము. ఈ తుఫాను ఎవరి మూలంగా వచ్చిందో తెలిసిపోతుంది” అనుకొన్నారు. చీట్లు వేశారు. చీటి యోనా పేరుతో వచ్చింది.
అందరూ అతని వైపు అనుమానంగా చూశారు. "ఓయీ! <నీవెవ్వరు? ఎక్కడికి పోతున్నావు? ఏమి పనిమీద పోతున్నావు? దేవునికి కోపం తెప్పించే పని ఏమి చేశావు?" అని అడిగారు.<అప్పుడు యోనా "అయ్యా! నేను హెబ్రీయుడను. ఆకాశనివాసి, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా దేవుని భక్తుడిని. కాని ఆయన నినెవె పట్టణానికి పొమ్మంటే, తన్టీషుకు పారిపోతున్నాను. నా మూలంగానే
ఈ తుఫాను వచ్చింది. కనుక నన్ను సముద్రంలో పారవేస్తే తుఫాను తగ్గిపోతుంది.” అని చెప్పాడు. వాళ్లు వెంటనే దేవుని ప్రార్థించారు. "యెహోవా
దేవా! మేము ఈ మనుష్యుణ్ణి చంపినాము, అన్న అపరాధం మా మీదికి రానియ్యవద్దు" తర్వాత వాళ్లు యోనాను సముద్రంలో పారవేశారు.
వెంటనే సముద్రం శాంతించింది. ఈ సంగతి గమనించిన ప్రయాణీకులు యెహోవా నిజమైన దేవుడని నమ్మారు. దేవునికి మిక్కిలి భయపడ్డారు. ఆయనకు బలులు అర్పించారు. ఆయనే నిజమైన దేవుడని నమ్మారు
దేవుడు పంపిన ఒక పెద్ద చేప యోనాను మ్రింగింది. యోనా చేప కడుపులో మూడు రోజులున్నాడు. తాను చేసిన తప్పుకు క్షమాపణ వేడాడు.
"దేవా! నీవు నన్ను కాపాడితే నేను నీ మందిరానికి వస్తాను. బలులు అర్పిస్తాను. మొక్కుబడులు చెల్లిస్తాను. నీవే నాకు దిక్కు, రక్షణాధారము, నీవు తప్ప నాకు దిక్కెవరూ లేరు” అని దీనంగా ప్రార్థించాడు. యెహోవా దేవుడు యోనా ప్రార్థన ఆలకించాడు. ఆయన చేపకు ఆజ్ఞ ఇవ్వగానే, అది యోనాకు నినెవె పట్టణ ప్రాంతంలో సముద్రపు ఒడ్డున కక్కివేసింది." -
దేవుని వాక్కు ననుసరించి, యోనా నినెవె మహా పట్టణానికి వెళ్లాడు. నగరంలో ఒక రోజంతా తిరిగాడు. నగరంలోని ప్రజలకు కలుగబోయే గొప్ప ఆపదను గురించి ప్రకటించాడు.
ఆ ప్రకటన విన్న నినెవె పట్టణస్థులు గడగడ వణికారు. దేవుని మాటలు విశ్వసించారు. నగరమంతా ఉపవాస దినం ప్రకటించారు. గొప్పవారు, పేదవారు అనే బేధం లేకుండా అందరూ దీనులై గొనెపట్టలు కట్టుకొని దేవుని ప్రార్థింపసాగారు. ఈ విషయం తెలిసికొన్న
రాజు కూడ దీనుడై, గోనె పట్టా కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. రాజు, మంత్రులు ప్రకటన చేయించారు. ప్రజలందరు ఉపవాసం వున్నారు.
పశువులు కూడ మేత మేయలేదు. ప్రజలందరు దీనులై దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించారు. దేవునికి ఆ నగర వాసులపై దయకలిగింది. ఆయన నినెవె పట్టణాన్ని నాశనం చేయడం మానుకొన్నాడు.
నినెవె పట్టణం నాశనం కాలేదని యోనా తెలిసికొన్నాడు. అతడు యెహోవా దేవునితో అన్నాడు - ప్రభువా ! నీవు నినెవె వాసులపై జాలి చూపుతావనీ, వారిని క్షమిస్తావనీ నాకు తెలుసు. అందుకే నేను తరీషు పట్టణానికి పారిపోయాను” అన్నాడు.
యోనా నినెవె పట్టణానికి దూరంగా తూర్పు వైపున ఒక పందిరి వేసికొన్నాడు. దాని క్రింద వుంటున్నాడు. ఏమి జరుగుతుందో చూడాలనుకొన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు ఒక సొరచెట్టును మొలపించాడు. అది పెరిగి పెద్దదై మంచి నీడ యిచ్చింది. ఆ చెట్టును చూసి యోనా సంతోషించాడు.
మరునాడు యెహోవా ఒక పురుగును పంపాడు. అది సొరచెట్టును పూర్తిగా తినివేసింది. యోనా మీద ఎండ పడింది. అందువల్ల యోనా విసుక్కొన్నాడు. చావడం మంచిది అనుకొన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు యోనాతో "నీవు కష్టపడకుండా, పెంచకుండా, తనకు తానే పెరిగి చచ్చిపోయిన సొర చెట్టువాడిపోయినందుకు యింతగా బాధపడుతున్నావే! లక్షా యిరవైవేల
జనాభాతో వేల పశువులతో నిండివున్న నినెవె మహా పట్టణం నాశనమైపోతే నాకు బాధ వుండదా?” అన్నాడు. అప్పుడు యోనా దేవుని దయా గుణాన్ని, తన తొందర పాటును తెలిసికొన్నాడు.
దానియేలు1-12
బబులోను సామ్రాజ్యానికి రాజు “నెబుకద్నెజరు”, అతడు యూదా రాజైన "యెహోయాకీము"ను ఓడించాడు. యెహోవా దేవుని మందిరంలో వున్న విలువైన వస్తువులన్నీ దోచుకొని పోయాడు. వాటిని షీనారు దేశంలో వున్న
దేవతాలయపు ధనాగారంలో వుంచాడు. అతడు తెలివి, అందము గల కొందరు యూదా రాజవంశపు యువకులను బందీలుగా పట్టుకొన్నాడు. వారికి తాను భుజించే ఆహారము, తాను సేవించే ద్రాక్షారసము, మంచి బట్టలు యిచ్చి మూడు సం||లు పోషించమని చెప్పాడు. పట్టుబడిన యువకులలో దానియేలు, హసన్యా, మిషాయేలు, అజర్యా అనువారున్నారు. వారికి రాజు బెత్తెషాజరు, షద్రకు, మేషాకు, అబెద్నగో అను పేర్లు పెట్టాడు. వీరు నలుగురు పవిత్రంగా యెహోవా దేవునికి విధేయులుగా వుండాలనుకొన్నారు. అందువల్ల రాజు యిచ్చిన ఖరీదైన ఆహారం భుజించకుండా మామూలు శాకాహారం భుజించారు. అయినప్పటికి చాల ఆరోగ్యంగా, అందంగా వున్నారు.
రాజు నలుగురు యువకులను రాజ మందిరంలో వుంచుకొన్నాడు. దేవుడు వారికి జ్ఞానమును, వివేచనను, సకల శాస్త్రములలో ప్రావీణ్యము అనుగ్రహించాడు. దానియేలు అన్ని రకముల స్వప్నముల యొక్క అర్ధమును చెప్పగల్గిన తెలివిగలవాడై
యుండెను. అతడు దేవుని ఆత్మగలవాడై వుండెను.
నెబుకద్నెజరు ఒక రాత్రి ఒక కలగన్నాడు. అయితే ఆ కలను మరచిపోయాడు. ఆయన తన రాజ్యంలోని మాంత్రికులను, శకున గాండ్రను అందర్నీ పిలిపించాడు. వాళ్లు కల భావము చెప్పలేకపోయారు. రాజుకు చాల కోపం వచ్చింది. అందరిని చంపమని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలిసికొన్న దానియేలు రాజు సన్నిధికి వెళ్లాడు. "రాజా ! నాకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానం చేత మీ కల యొక్క భావం వివరిస్తాను” అన్నాడు.
దానియేలు కలయొక్క అర్థం యిలా తెలియజేశాడు. “రాజా! తమరు భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ పండుకొన్నారు. కలలో ఒక పెద్ద విగ్రహాన్ని చూశారు. ఆ విగ్రహం తల బంగారంతో, భుజాలు వెండితో, పొట్ట తొడలు యిత్తడితో, పాదములలో ఒక భాగం యినుముతో, ఒక భాగం మట్టితో తయారు చేయబడింది. చేతితో చేయబడని ఒక పెద్దరాయి వచ్చి విగ్రహం పాదాలను విరుగగొట్టి, ముక్కలు ముక్కలుగా చేసింది.
విగ్రహం అంతా ఏకంగా కలపబడి చెత్తవలె అయిపోయింది. ఆ విగ్రహము తమరి మహా గొప్ప సామ్రాజ్యానికి చిహ్నంగా వుంది. మీ తరువాత బలంలేని, ఐకమత్యం లేని రాజులు పరిపాలన చేస్తారు. చివరకు వారు నశించి, దేవుని రాజ్యము వస్తుంది. యిలా జరుగబోతుందని దేవుడు మీకు స్వప్నం ద్వారా తెలుయజేశాడు” అంతా వినిన నెబుకద్నెజరు రాజు దానియేలును మెచ్చుకొని, గౌరవించాడు. అతనిని తన ఆస్థానంలోని జ్ఞానులకు ప్రధానిగా నియమించాడు.
రాజైన నెబుకద్నెజరు “దూరా' అనే మైదానంలో ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని నిలబెట్టించాడు. మంగళ వాద్యములు మ్రోగగనే ప్రజలంతా ఆ ప్రతిమకు మొక్కాలనీ, మొక్కనివారు అగ్ని గుండంలో వేయబడతారనీ ఆజ్ఞ జారీ చేశాడు. ప్రజలందరు రాజు ఆజ్ఞను పాటించారు. కాని షడ్రకు, మెషాకు, అబెద్నగోలు మాత్రం ఆజ్ఞను లెక్కచేయలేదు. వారు బంగారు ప్రతిమకు మొక్కలేదు. యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు.
ఈ సంగతి గమనించిన కొందరు పెద్దలు రాజుకు చాడీలు చెప్పారు. రాజు వారు ముగ్గురిని పిలిపించి అన్నాడు - "మీరు ప్రతిమకు మొక్కడం లేదనీ, రాజాజ్ఞను ధిక్కరిస్తున్నారనీ తెలిసింది. నానుండి మిమ్మల్ని కాపాడేదేవుడెక్కడ వున్నాడు?” అని బెదిరించాడు. అందుకు వారు ముగ్గురు “రాజా! మా దేవుడైన యెహోవా మండుచున్న అగ్నిగుండంలో వేసినా మమ్ములను రక్షింప గలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకున్నా మేము మాత్రం నీవు పెట్టించిన బంగారు ప్రతిమను పూజించము" అని ధైర్యంగా చెప్పారు. వారి మాటలకు రాజుకు చాల కోపము వచ్చింది. ఆయన ముగ్గురినీ మండుచున్న అగ్ని గుండంలో వేయించాడు. వారిని గుండంలో విసిరేసిన మనుషులు కాలి చచ్చిపోయారు. కాని షడ్రకు, మెషాకు, అబెదగో అను వారు మాత్రం కాలిపోలేదు. రాజు, అతని మంత్రులు అగ్నిగుండంలో నలుగురు మనుషులు సంచరించడం చూశారు. తర్వాత నెబుకద్నెజరు పిలవగానే ముగ్గురు స్నేహితులు అగ్నిగుండం నుండి క్షేమంగా బయటికి వచ్చారు. యిదంతా చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. షడ్రకు. మెషాకు, అబెద్నగోల దేవుడే నిజమైన దేవుడని ప్రకటించాడు.
ఒక రాత్రి నెబుకద్నెజరు ఒక కలగన్నాడు. కలలో ఒక పెద్ద చెట్టును చూశాడు. అది కొమ్మలువేసి, ఆకులతో, పండ్లతో చక్కగా పెరిగింది. అప్పుడు ఆకాశం నుండి ఒక దూత వచ్చి చెట్టును నరికి, మొద్దును మాత్రం వుంచమన్నాడు. ఏడు కాలముల తర్వాత మొద్దు మరల చిగురిస్తుంది అన్నాడు. దానియేలు ఆ కలయొక్క భావాన్ని రాజుకు యిలా వివరించాడు. "మహారాజా! ఆ పెద్దచెట్టు మీరే. మీనుండి మీ రాజ్యం తీసివేయబడుతుంది. మనుష్యులు మిమ్మల్ని తరిమి వేస్తారు. మీరు ఏడు సం||లు అడవిలో వుండి పశువువలె గడ్డి తింటారు యెండలో, వానలో, మంచులో తిరుగుతారు. దేవుడు గొప్ప వాడని తెలిసికొన్న తర్వాత మీ రాజ్యము మీకు తిరిగి యివ్వబడుతుంది.”
ఒక దినము రాజు తాను కట్టించిన బబులోను మహానగరాన్ని చూసి గర్వించాడు. ఆ ఘడియనుండే దానియేలు చెప్పిన ప్రకారం జరిగింది. రాజు ఏడు సం||లు అడవిలో సంచరించాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు.
ఆ తర్వాత మరల రాజయ్యాడు నెబుకద్నెజరు తర్వాత అతని కుమారుడు బెలసరు రాజయ్యాడు. అతడు ఒకరోజు తన అధిపతులకు విందు చేయించాడు.
తన తండ్రి యెరూషలేము దేవాలయం నుండి తెచ్చిన బంగారు పాత్రలు తెప్పించాడు. వాటిలో ద్రాక్షారసము పోసి తాగుతూ రాజు, అతని రాణులు, ఉపపత్నులు తమ దేవతలను పొగడుతూ వున్నారు. అప్పుడు రాజుకు ఒక మానవ హస్తము కనిపించింది. ఆ హస్తము గోడమీద ఏమిటో రాసింది.
ఆ వ్రాతను చూడగానే రాజు భయంతో గడగడ వణికాడు. అతని ముఖము వికారమైంది. మోకాళ్లు గడగడ కొట్టుకొన్నాయి. మరుసటి రోజు రాజు తన రాజ్యంలోని గారడీ వాండ్లను, జ్యోతిష్కులను, కల్దీయులను పిలిపించాడు. ఎవరూ కలకు అర్ధం చెప్పలేకపోయారు. చివరకు రాణి సలహా యివ్వగా దానియేలును (బెత్తెషాజరును) పిలిపించాడు.
దానియేలు కల భావం యిలా వివరించాడు - "రాజా! నీ తండ్రి అయిన నెబుకద్నెజరు గర్వపడి, దేవుని కోపానికి గురియై అడవుల పాలయ్యాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. నీవు కూడ గర్వించావు. దేవాలయపు పాత్రలలో ద్రాక్షారసము పోసికొని తాగావు. బంగారము, వెండి, యిత్తడి, యినుముతో చేసిన విగ్రహాలను పొగిడావు. అందువలన దేవుడు నీకు సంభవింపబోయే సంగతులను ఆ గోడ పైన వ్రాశాడు. గోడ మీద “మెనే, మెనే టెకేల్ పార్సిన్" అని వ్రాయబడింది.
మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించాడు. టెకేల్ అనగా - ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి ఉపార్సిన్ అనగా - నీ రాజ్యము నీ నుండి తీసివేయబడి మాదీయులకు, పారసీకులకు ఇవ్వబడుతుంది.” రాజు దానియేలును ఎంతో మెచ్చుకొన్నాడు. అతనికి ఊదారంగు వస్త్రములు దరింపచేశాడు. మెడలో బంగారు హారం వేసి సత్కరించాడు. దానియేలు తన రాజ్యంలో మూడవ అధికారి అని చాటింపు వేయించాడు. ఆ రాత్రే బెలసరు చంపబడ్డాడు. మాదీయుడగు దర్వావేషు రాజయ్యాడు.
రాజైన దర్యావేషు 120 మందిని అధిపతులుగా ఏర్పాటు చేశాడు. వారిపై ముగ్గురిని ప్రధానులుగా నియమించాడు. ఆ ముగ్గురిలో దానియేలుకు ప్రముఖ స్థానం యిచ్చాడు. దానియేలు మంచి ప్రవర్తన, న్యాయ బుద్ధి నమ్మకము గలవాడై, ప్రజలలో అధికారులలో మంచి పేరు సంపాదించాడు. అది చూసి కొందరు అధికారులకు అసూయ కలిగింది. వాళ్ళు రాజుతో ఒక శాసనం చేయించారు. ఆ శానసం ప్రకారం “30 రోజుల వరకు ప్రజలందరు రాజుకు మాత్రమే తమ విజ్ఞాపనలు చెప్పుకోవాలి. యితర దేవతల యొద్దగాని, మనుషుల యెద్ద గాని విజ్ఞాపన చేస్తే వారు సింహముల గుహలో వేయబడతారు”. దానియేలుకు శాసనం చేయబడిందని తెలిసింది. అయినా అతడు ప్రతి రోజు మూడు పర్యాయములు యెహోవా దేవునికి ప్రార్థనలు చేస్తూ, ఆయనను స్తుతిస్తూ వున్నాడు. అధికారులు ఈ సంగతి రాజుకు చెప్పారు. దానియేలు మీ ఆజ్ఞను మీరాడు” అన్నారు. రాజుకు దానియేలు పట్ల చాలా ప్రేమ వుంది. కాని విధిలేక దానియేలును సింహముల బోనులో వేయించాడు. ఆయనకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. మరుసటి దినం ఉదయాన్నే గుహదగ్గరికి వస్తాడు "దానియేలూ! నీవు నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించాడా?” అని అడిగాడు. అప్పుడు దానియేలు “రాజా! నా దేవుడు సింహముల నోళ్లుమూయించాడు. నేను క్షేమంగా వున్నాను'' అన్నాడు. వెంటనే రాజు దానియేలును బయటికి తీయించాడు. చాడీలు చెప్పిన అధికారులను గుహలో వేయించాడు. సింహములు వారిని వెంటనే చంపి, ఎముకలు కూడ తినివేశాయి. దర్యావేషు తన రాజ్యమంతట ఈ విధంగా ప్రకటన చేయించాడు. “దానియేలు పూజించే దేవుడే జీవము గల దేవుడు. ఆయన యుగయుగములు వుండువాడు.
సూచక క్రియలను, ఆశ్చర్య కార్యములను జరిగించు వాడు. ఆయనే సింహముల నోటి నుండి దానియేలును రక్షించాడు.". ఆ తర్వాత కూడ దానియేలు ఎన్నో దర్శనములను చూశాడు. భవిష్యత్తులో రాజ్యాలకు, రాజులకు, ప్రజలకు జరుగబోయే విషయాలు తెలిసికొన్నాడు. యుగాంతంలో పరలోకంలో సంభవించే సంగతులు తెలిసి కొన్నాడు. ఈ విషయాలన్నీ ఒక గ్రంథంలో వ్రాశాడు.
బైబిలు గ్రంథంలో చాలా మంది స్త్రీలను గురించి వ్రాయబడింది వారిలో కొందరి పేర్లు వ్రాయబడలేదు. కాని వారి గొప్ప తనాన్ని గురించి వ్రాయబడింది. బైబిలులో రెండు గ్రంథములు మాత్రమే స్త్రీల పేర్లతో వున్నవి. అవి రూతు, ఎస్తేరు అను గ్రంథములు. ఎస్తేరు యూదురాలు. ఆమె చాల అందమైన రూపము, సుందరమైన ముఖము గలిగిన స్త్రీ. ఎస్తేరు అను మాటకు నక్షత్రము అని అర్ధము. ఎస్తేరుకు హెబ్రీ భాషలో హదస్సా(గొంజి చెట్టు) అను పేరు కూడ వున్నది. పారసీక దేశాన్ని అహష్వేరోషు అను రాజు పరిపాలించేవాడు. అతడు కూషు దేశము మొదలుకొని హిందూదేశము వరకు నూట యిరువది ఏడు సంస్థానములకురాజై పరిపాలన చేశాడు. అతడు తన వైభవానికి, అధికారానికి తగిన విధంగా అధికారులకు, సంస్థానాధిపతులకు, ప్రజలకు ఏడు దినములు గొప్ప విందు చేశాడు. మహారాణి వడ్డీ కూడా స్త్రీలకు గొప్ప విందు చేసింది. రాజు తన అధిపతులకు, ప్రజలకు మహారాణి యొక్క సౌందర్యాన్ని చూపాలనుకొన్నాడు. ఆమె మంచి బట్టలు ధరించి, తల పైకిరీటం కూడ ధరించి సభకు రావాలని సేవకుల ద్వారా కబురుపంపించాడు. రాణి అందుకు యిష్టపడలేదు. రాజు ఈ తిరస్కారాన్ని అవమానంగా భావించాడు. తన మంత్రుల సలహా ప్రకారం ఆమెను తిరస్కరించాడు.
పారసీక దేశంలో వుంటున్న కన్యకలలో చాలా అందమైన ఒకరిని రాణీగా స్వీకరించాలని నిర్ణయం చేయబడింది. చాలా మంది కన్యకలు పిలిపించబడ్డారు. వారిలో ఎస్తేరు అను యువతి రాజుకు బాగా నచ్చింది. ఎస్తేరు యూదా వంశస్తురాలు. యాయీరు వంశస్తుడైన "మొరైకె" అను యూదుని పినతండ్రి కుమార్తె, రాజు ఎస్తేరు అందాన్ని చూసి సంతోషించాడు. మొర్దికై యిచ్చిన సలహా ప్రకారం ఎస్తేరు తాను యూదురాలు అన్న సంగతి మాత్రం చెప్పకుండా రహస్యంగా వుంచింది. ఎస్తేరు యొక్క యోగ క్షేమాలు తెలిసికొనేందుకై మొరెకె ప్రతిరోజూ అంతఃపురం దగ్గర తిరుగుతుండేవాడు. బిడ్డాను, తెరేషు అను యిద్దరు ద్వార పాలకులు వుండేవారు. వాళ్లు రాజును చంపాలని కుట్ర చేశారు. వారి మాటలు వినిన మొర్ధికై ఆ రహస్యం ఎస్తేరుతో చెప్పాడు. ఎస్తేరు రాజుతో చెప్పింది. రాజు విచారించగా కుట్ర నిజమని రుజువైంది. ఆ యిద్దరు సిపాయిలకు ఉరిశిక్ష విధించబడింది. మొత్తెకై రాజుకు చేసిన ఉపకారాన్ని గురించి రాజ్య సమాచార గ్రంథంలో వ్రాయబడింది.
రాజగు అహహ్వేరోషు అగాగీయుడైన హామాను అను వాడిని ఎక్కువ గౌరవించి, ఆదరించాడు. తన సింహాసనం దగ్గర ఉన్నతాసనం వేయించాడు. అందరు హామానుకు నమస్కారం చేయసాగారు. కాని మొర్ధికై మాత్రం నమస్కారం చేయలేదు. నేను యూదుణ్ణి, యితరులకు నమస్కరింపను, అనేవాడు. ఈ విషయం గమనించిన హామాను మొర్దెకై మీద పగబట్టాడు. యూదులందరి మీద కోపంగా వున్నాడు. ఒక రోజు రాజుతో యూదులందరు పొగరుబోతులనీ,రాజు ఆజ్ఞలను గైకొనే వాళ్లు కాదనీ చాడీలు చెప్పాడు.
రాజు యూదులందర్నీ అదారు అనే 12వ నెల 13వ రోజున ఒకేరోజు చంపి వేయాలని, అధికారులకు, సంస్థానముల అధిపతులకు ఆదేశాలు పంపించాడు. ఈ విషయం తెలిసిన మొర్ధికై చాల బాధపడ్డాడు. రాజును బ్రతిమిలాడి ఎలాగైనా యూదుల ప్రాణాలు కాపాడమని ఎస్తేరుకు చెప్పి పంపాడు."ఈ మంచి పని కోసమే నీవు రాణివి అయ్యావేమో కనుక మన జాతివారికి ఈ సాయం చేయమని" చెప్పి పంపాడు.
ముందుగా అనుమతి లేకుండా ఎవరూ రాజు దగ్గరికి వెళ్ళకూడదు. రాజుకు కోపం రావచ్చు. ఈ సంగతి తెలిసి కూడ ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్లాలని తీర్మానించుకొన్నది. ఆమె రాజవస్త్రాలు, ఆభరణాలు ధరించి రాజు యెదుటికి వెళ్ళింది. గాజు ఆమెను చూశాడు. ఎందుకు వచ్చావని అడిగాడు? ఎస్తేరు అసలు విషయం చెప్పలేదు. రేపు తమరు, హామాను నా నగరుకు విందుకు దయ చేయండి అని ఆహ్వానించింది. హామాను యింటికి వెళ్లాడు. తన భార్యతో అన్ని విషయాలు చెప్పాడు. మొద్దెకైని రాజగుమ్మం వద్ద చూస్తూవున్నంత వరకు నాకు మనశ్శాంతి లేదని చెప్పాడు. అందుకు అతని భార్య, స్నేహితులు ఒక సలహా యిచ్చారు. “నీవు యాభైమూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యను చేయించు. రాజాజ్ఞను పొంది మొరైకైని దానిమీద ఉరితీయించు”
అని సలహా యిచ్చారు. హామాను ఒక ఉరికొయ్యను సిద్ధం చేయించాడు.
ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. ఆయన రాజ్యపు సమాచార గ్రంథము చదివించుకొని వింటున్నాడు. దానిలో మొర్ధికై కుట్రదారుల నుండి రాజును కాపాడిన సంగతి విన్నాడు. బదులుగా రాజు అతనికి ఏమీ సన్మానం (గౌరవం) చేయలేదనికూడ తెలిసికొన్నాడు. రాజు మొర్ధికైని సన్మానించాలనుకొన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన హామానుతో “రాజు ఘన పరచాలని ఉద్దేశించే వారిని ఏ విధంగా ఘనపరచాలి?” అని అడిగాడు. హామాను రాజు తననుగొప్పగా ఘనపరచబోతున్నాడని అనుకొన్నాడు. మనసులో చాల సంతోషించాడు. "రాజా! తాము ఘనపరచనుద్దేశించువానికి రాజు ధరించే వస్త్రములను, కిరీటాన్ని దరింపజేసి, రాజు ఎక్కే గుర్రం పై అతనిని ఎక్కించి, రాజ వీధులలో ఊరేగించుచూ, రాజు ఘనపరచాలనుకొనే వానికి ఈ విధంగా జరుగుతుంది అని ఒక ఘనుని ద్వారా చాటింపు వేయించాలి” అన్నాడు.
అప్పుడు రాజు "నేను మొరైకైని నీవు చెప్పిన విధంగా సన్మానించాలను కొన్నాను. నీవు గుర్రం వెంబడి నడుస్తూ చాటింపు వేయించు" అని ఆజ్ఞాపించాడు. హామాను తలచింది ఒకటైతే, జరిగింది వేరొకటి. అతడు రాజు చెప్పినట్లు చేశాడు. తర్వాత విచారంతో యింటికి వెళ్లాడు. జరిగిన విషయమంతా భార్యకు వివరించాడు. అంతలో రాణివాసం నుండి భటులు వచ్చి విందుకు రమ్మని ఆహ్వానించారు.
విందుజరుగుతున్నది. రాజు ఎస్తేరు రాణి యెడల చాల ప్రసన్నంగా వున్నాడు. “నీకేమి కావాలో కోరుకో, నా రాజ్యంలో సగం కోరుకొన్నా యిస్తాను” అన్నాడు. అందుకు ఎస్తేరు రాజుతో “రాజా! ఒక దుష్టుడు నా ప్రాణాలను, నా జనుల ప్రాణాలను తీయడానికి కుట్ర చేశాడు. మీరు మమ్మల్ని కరుణించి, మా ప్రాణాలు కాపాడండి'' అని విన్నవించింది. అప్పుడు రాజుకు చాల కోపం వచ్చింది. “మీ ప్రాణాలు తీయాలని కుట్ర చేసిన ఆ దుర్మార్గుడు ఎవరు?” అని అడిగాడు. అందుకు ఎస్తేరు “మీ ఎదుట వున్న ఈ హామాను అను వాడే ఆ కుట్ర చేసిన వారు” అని చెప్పింది.
రాజు వెంటనే హామానును ఉరితీయమని ఆజ్ఞాపించాడు. మొర్దెకై కోసం తయారు చేయించిన ఉరికొయ్య పైనే హామాను ఉరి తీయబడ్డాడు. తాను తవ్విన గుంటలో తానే పడ్డాడు. అనే సామెత హామాను విషయంలో నిజమైంది. మొర్దెకైని రాజు హామానుకు బదులు ప్రధానిగా నియమించాడు. ఈ విధంగా ఎస్తేరు రాణి స్థానంలో వుండి తన ప్రజల ప్రాణాలను కాపాడింది.
లూకా సువార్త 1 నుండి
గతంలో, దేవుడు తన ప్రవక్తలతో మాట్లాడాడు కాబట్టి వారు తన ప్రజలతో మాట్లాడగల్గారు. అయితే 400 సంవత్సరాలు గడచిపోయాయి, ఈ కాలంలో ఆయన వారితో మాట్లాడలేదు. అప్పుడు దేవుడు జెకర్యా అనే యాజకుని వద్దకు ఒక దేవదూతను పంపాడు. జెకర్యా అతని భార్య ఎలిజబెత్ దేవుణ్ణి ఘనపరచారు. వారు బహుకాలం గడచిన వృద్ధులు. వారికి పిల్లలు లేరు.
దేవదూత జెకర్యాతో ఇలా అన్నాడు, “నీ భార్యకు కుమారుడు పుడతాడు, అతనికి యోహాను అను పేరు పెడతారు. దేవుడు అతనిని పరిశుద్ధాతతో నింపుతాడు, మెస్సీయను స్వీకరించడానికి యోహాను ప్రజలను సిద్ధపరుస్తాడు! జకర్యా ఇలా స్పందించాడు, “నేనునూ, నా భార్యయూ బహుకాలం గడచిన వృద్దులం, మాకు పిల్లలు కలగడం అసాధ్యం, నీవు సత్యం చెపుతున్నట్టు నాకు ఏవిధంగా తెలుస్తుంది?”
దేవుని దూత జకర్యాతో ఇలా జావాబించ్చాడు, “ఈ శుభవార్త నీకు చెప్పడానికి దేవుడు నన్ను పంపాడు, ఈ మాటలు నీవు నమ్మలేదు కనుక నీకు కుమారుడు జన్మించేంత వరకూ మాట్లాడక మౌనివైయుంటావు.” వెంటనే జకర్యా మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు దూత జకర్యాను విడిచి వెళ్ళాడు. జకర్యా తిరిగి తన ఇంటికి వెళ్ళాడు, అతని భార్య గర్భవతి అయ్యింది.
ఎలిజెబెత్ ఆరు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు గబ్రియేలు దూత ఎలిజెబెత్ బంధువు వద్దకు వచ్చాడు. ఆమె పేరు మరియ. ఆమె కన్యక. యోసేపు అను పురుషునితో ప్రధానం చెయ్యబడింది. దేవుని దూత మరియతో ఇలా చెప్పాడు, “నీవు గర్భం ధరిస్తావు, నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆయనకు యేసు అను పేరు పెడతారు. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు, ఆయన యుగయుగములు రాజ్య పాలన చేస్తాడు.”
మరియ ఇలా జవాబిచ్చింది, “ఇది ఎలా జరుగుతుంది, నేను పురుషుని యెరుగని దానను కదా?” దేవుని దూత ఇలా వివరించాడు, “పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొంటాడు, దేవుని శక్తి నీ మీదకు వస్తుంది.” దేవుని దూత చెప్పినదానిని మరియ విశ్వసించింది.
ఇది జరిగిన వెంటనే, మరియ ఎలిజబెతు వద్దకు వెళ్లింది. మరియ ఆమెకు వందన వచనం చెప్పగానే, ఎలిజెబెత్ గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాడు. వారి పట్ల దేవుడు చేసిన ఘనమైన కార్యాలను బట్టి వారు కలిసి ఆనందించారు. మరియ అక్కడ మూడు నెలలు ఉన్నతరువాత తిరిగి తన స్వగ్రామానికి తిరిగి వెళ్లింది.
ఎలిజెబెత్ కు కుమారుడు పుట్టిన తరువాత జకర్యా, ఎలిజెబెత్ లు దేవుని దూత వారికి ఆజ్ఞాపించిన విధంగా ఆ బాలునికి యోహాను అని పేరు పెట్టారు. అప్పుడు దేవుడు జకర్యాకు మాటను ఇచ్చాడు. అప్పుడు జకర్యా ఇలా చెప్పాడు, “దేవునికి స్తోత్రం, సహాయం చెయ్యడానికి ఆయన తన ప్రజలను జ్ఞాపకం చేసుకొన్నాడు! నా కుమారుడా నీవు సర్వోన్నతమైన దేవుని ప్రవక్తవు అవుతావు. ప్రజలు తమ పాపాలకు క్షమాపణ పొందడం గురించి నీవు ప్రజలకు తెలియజేస్తావు!”
మత్తయి 1; లూకా 2 నుండి
మరియకీ యోసేపు అను ఒక నీతిమంతునికి నిశ్చితార్థం జరిగింది. మరియ గర్భవతి అని విన్నప్పుడు, ఆ బిడ్డ తన బిడ్డ కాదని తెలిసినప్పటికీ అతడు మరియను సిగ్గు పరచాలని కోరలేదు, కనుక ఆమె మీద కరుణ చూపించాలని ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించాడు. ఆ పని చెయ్యడానికి ముందే, ఒక దేవదూత అతనికి కలలో కనిపించాడు, అతనితో మాట్లాడాడు.
దేవదూత, "యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకోడానికి నీవు భయపడకు, ఆమె కడుపులో ఉన్న శిశువు పరిశుద్ధాత్మ నుండి కలిగినది. ఆమె ఒక కుమారునికి జన్మనిస్తుంది, అతనికి యేసు అని పేరు పెడతావు. దీని అర్థం 'యెహోవా రక్షించేవాడు.' ఎందుకంటే ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు.
కనుక యోసేపు మరియను వివాహం చేసుకొన్నాడు, తన భార్య గాస్వీకరించాడు, అయితే ఆమె కుమారుని కనేంతవరకూ ఆమెతో లైంగికంగా కలియ లేదు. మరియకు కుమారుడు జన్మించే సమయం వచ్చినప్పుడు ఆమె, యోసేపూ, బెత్లేహెం గ్రామం వరకూ బహు దూరం ప్రయాణం చెయ్యవలసి వచ్చింది. రోమా అధికారులు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజల జనసంఖ్య వివరాలు తెలుసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ తమ పితరుల ప్రదేశానికి వెళ్లాలని ఆజ్ఞాపించారు. రాజైన దావీదు బెత్లేహెం గ్రామంలో పుట్టినవాడు, యోసేపు మరియలకు దావీదు పితరుడు కనుక మరియ యోసేపులు బెత్లేహెం గ్రామానికి ప్రయాణం అయ్యారు.
మరియ, యోసేపులు బెత్లేహెం గ్రామానికి వెళ్ళారు, అయితే వారు ఉండడానికి ఎక్కడా స్థలం లేదు. పశువుల శాలలో మాత్రమే వారికి బస చెయ్యడానికి స్థలం దొరికింది. అక్కడ మరియకు కుమారుడు జన్మించాడు. పశువుల తొట్టిలో చిన్నిబాలుడిని ఉంచారు. ఎందుకంటే బాలునికి మరొక చోటు లేదు. ఆ బాలునికి యేసు అనే పేరు పెట్టారు.
ఆ రాత్రి ఆ ప్రాంతంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో తమ మందను కాచుకొనుచున్నారు. అకస్మాత్తుగా ప్రకాశిస్తున్న దేవుని దూత వారి వద్ద ప్రత్యక్ష్యమయ్యాడు, ఆ గొల్లలతో ఆ దూత ఇలా చెప్పాడు, “భయపడకుడీ, నేను మీకు ఒక శుభవార్త తెలియజేస్తున్నాను, ప్రభువైన మెస్సీయ మీకోసం ఈ దినాన్న బెత్లేహెంలో జన్మించాడు.”
“మీరు వెళ్ళండి, బాలుని కనుగొనండి, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టడం మీరు చూస్తారు.” వెంటనే పరలోక సైన్య సమూహం ఆకాశమంత నిండి, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వారు ఇలా పాడుతున్నారు, “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును గాక!”
అప్పుడు దూతలు వెళ్ళిపోయారు. గొర్రెల కాపరులు శిశువుని చూడడానికి తమ గొర్రెలను విడిచివెళ్ళారు. బాలుడైన యేసు ఉంచిన చోటుకు వారు త్వరపడి వచ్చారు, పశువుల తొట్టిలోని శిశువును దేవుని దూతలు చెప్పిన విధంగా చూచారు. వారు అత్యానందభరితులయ్యారు. తరువాత తమ గొర్రెలు ఉన్న పొలాలకు వారు తిరిగి వెళ్ళారు. వారు చూచిన దాన్నంతటిని బట్టి, వినిన దానిని బట్టి వారు దేవుణ్ణి స్తుతించారు.
తూర్పున ఉన్న ఒక దేశంలో కొందరు జ్ఞానులు ఉన్నారు. వారు ఆకాశంలో ఒక అసాధారణ నక్షత్రాన్ని చూచారు. యూదుల కొత్త రాజు జన్మించినట్లు వారు చెప్పారు. కాబట్టి వారు బాలుడిని చూడడానికి వారి దేశం నుండి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. సుదీర్ఘ ప్రయాణం తరువాత వారు బేత్లెహేముకు వచ్చి యేసు, ఆయన తల్లిదండ్రులు ఉన్న ఇంటిని కనుగొన్నారు.
వారు యేసునూ, ఆయన తల్లి అయిన మరియనూ చూచి సాగిలపడి ఆయనను ఆరాధించారు. బాలుడైన యేసుకు విలువైన కానుకలను అర్పించారు. తమ స్వదేశాలకు తిరిగి వెళ్ళారు.
మత్తయి 3; మార్కు 1:9-11; లూకా 3:1-23 నుండి
జకర్యా, ఎలిజబెత్ కుమారుడు యోహాను పెరిగి పెద్దవాడై ఒక ప్రవక్త అయ్యాడు. అరణ్యంలో నివాసం చేసేవాడు, అడివి తేనె, మిడుతలు అతనికి ఆహారం. ఒంటె రోమాన్ని తన వస్త్రాలుగా ధరించేవాడు.
అనేకమంది ప్రజలు యోహాను మాటలు వినడానికి అరణ్యంలో ఉన్న యోహాను వద్దకు వచ్చేవారు. ఆయన వారికి బోధించేవాడు, “దేవుని రాజ్యం సమీపంగా ఉంది, పశ్చాత్తాప పడండి” అని బోధించేవాడు. ప్రజలు యోహాను సందేశాన్ని వినినప్పుడు వారిలో అనేకమంది తమ పాపాల విషయంలో పశ్చాత్తాప పడేవారు. యోహాను వారికి బాప్తిస్మం ఇచ్చేవాడు. అనేకమంది నాయకులు కూడా యోహాను వద్దకు వచ్చేవారు. అయితే వారు తమ పాపాల విషయంలో పశ్చాత్తాపపడేవారు కాదు.
యోహాను ఆ మతనాయకులకు ఇలా చెప్పేవాడు, “సర్పసంతానమా! పశ్చాత్తాప పడండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మంచి ఫలం ఫలించని ప్రతీ చెట్టును దేవుడు నరికివేస్తాడు. వాటిని అగ్నిలో వేస్తాడు.” నీకు ముందుగా నేను ఒక ప్రవక్తను పంపుదును, ఆయన నీ మార్గమును సరాళము చేయును” అని చెప్పిన మాటలను యోహాను నెరవేర్చాడు.
కొందరు మత నాయకులు మెస్సీయ తానేనా అని యోహానును అడిగారు. యోహాను ఇలా జవాబిచ్చాడు, “నేను మెస్సీయను కాదు, అయితే ఆయన నా వెనుక వచ్చును. ఆయన చెప్పుల వారునైన విప్పుటకు నేను యోగ్యుడను కాను, ఆయన గొప్పవాడు.”
తరవాత రోజు ప్రభువైన యేసు బాప్తిస్మం కోసం యోహాను వద్దకు వచ్చాడు. యోహాను ఆయనను చూచినప్పుడు, యోహాను ఇలా చెప్పాడు, “ఇదిగో లోక పాపములు మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల.”
యోహాను యేసుతో ఇలా చెప్పాడు, “నీకు బాప్తిస్మం ఇవ్వడానికి నేను యోగ్యుడను కాను. అయితే యేసు ఇలా చెప్పాడు, “నీవు నాకు బాప్తిస్మం ఇవ్వాలి. ఎందుకంటే నీతి యావత్తూ ఈ విధంగా జరగవలసి ఉంది.” కనుక యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చాడు, యేసు ఏవిధమైన పాపం చెయ్యలేదు.
యేసు బాప్తిస్మం తీసుకొని నీటిలోనుండి బయటికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ పావురం వలే అగుపడి ఆయన మీదకు వచ్చి నిలిచింది. అదే సమయంలో పరలోకంనుండి దేవుడు పలికాడు, “నీవు నా ప్రియ కుమారుడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ యందు ఆనందించుచున్నాను.”
దేవుడు యోహానుకు ఇలా చెప్పాడు, “పరిశుద్ధాత్ముడు కిందకు దిగి నీవు బాప్తిస్మం ఇచ్చిన వారిలో ఎవని మీద నిలుచునో ఆయన దేవుని కుమారుడు.” ఒక్కడే దేవుడు ఉన్నాడు. అయితే యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు, తండ్రియైన దేవుడు స్వరాన్ని విన్నాడు, దేవుని కుమారుణ్ణి చూచాడు, ఆయన ప్రభువైన యేసు. పరిశుద్ధాత్మను కూడా చూచాడు.
మత్తయి 4:1-11; మారు 1:12-13; లూకా 4:1-13 నుండి
ప్రభువైన యేసు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయనను అరణ్యం లోనికి తీసుకొని వెళ్ళాడు, యేసు అక్కడ నలుబది రోజులు ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఉపవాసం ఉన్నాడు, సాతాను యేసు వద్దకు వచ్చి ఆయనను పాపం లోనికి పడేలా శోధించాడు.
మొదట సాతాను యేసుతో ఇలా చెప్పాడు, “నీవు నిజముగా దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను.” అయితే యేసు సాతానుతో ఇలా సమాధానం ఇచ్చాడు, “దేవుని వాక్యంలో ఇలా రాసి ఉంది. ‘మనుష్యులు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని వాక్యము వలన జీవించును.”
అప్పుడు సాతాను యేసును ఒక ఎత్తైన ప్రాంతానికి తీసుకొని వెళ్లి ఆయనతో “నీవు దేవుని కుమారుడివైతే కిందికి దుముకుము, ‘దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించగా వారు నీ పాదములకు రాయి తగులకుండ నిన్ను ఎత్తి పట్టుకొంటారు” అని చెప్పాడు. సాతాను అడిగిన దానిని చెయ్యడం యేసుకు ఇష్టం లేదు. దానికి బదులుగా ఆయన ఇలా చెప్పాడు, “నీ ప్రభువైన దేవుణ్ణి నీవు శోధించకూడదు.”
తరువాత సాతాను ప్రభువైన యేసుకు ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపించాడు. ఆవి ఎంత శక్తివంతమైనవో ఎంత సంపదలతో కూడుకొన్నవో చూపించాడు. ప్రభువుతో ఇలా చెప్పాడు, “నీవు నాకు మొక్కి నన్ను ఆరాధిస్తే నేను వాటిని నీకు దయచేస్తాను.”
ప్రభువైన యేసు ఇలా సమాధాన మిచ్చాడు, “సాతానా నన్ను విడిచి పొమ్ము! ‘నీ ప్రభువైన దేవుని మాత్రమే నీవు పూజించాలి’ అని రాయబడియున్నది.”
సాతాను శోధనలలో యేసు పడిపోలేదు. కనుక సాతాను ఆయనను విడిచిపెట్టాడు. అప్పుడు దేవుని దూతలు ఆయనకు పరిచర్య చేసారు.
మత్తయి 4:12-25; మార్కు 1:14-14-15, 35-39; 3:13-21; లూకా 4:14-30, 38-44
ప్రభువైన యేసు సాతాను శోధనల నుండి వచ్చిన తరువాత ఆయన గలిలయ ప్రాంతానికి తిరిగి వచ్చాడు. ఇక్కడ ఆయన నివసించాడు. పరిశుద్ధాత్ముడు ఆయనకు గొప్పశక్తిని ఇచ్చాడు. యేసు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్నాడు. ప్రజలకు బోధిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన గురించి మంచి సంగతులు పలుకుతున్నారు.
యేసు నజరేతు పట్టణానికి వెళ్ళాడు. యేసు బాలుడిగా ఉన్నప్పుడు ఇక్కడ జీవించాడు. ఒక సబ్బాతు దినాన్న ఆయన ఆరాధనా స్థలానికి వెళ్ళాడు. మత నాయకులు ఆయన చేతికి ప్రవక్త యెషయా లేఖన చుట్టలను ఇచ్చారు. ఆయనను దానిని నుండి చదవాలని అడిగారు. కనుక యేసు ఆ చట్టను తెరచి ప్రజల కోసం చదివాడు.
యేసు ఇలా చదివాడు, “దీనులకు సువార్తను ప్రకటించడానికి దేవుడు తన ఆత్మను నా మీద ఉంచాడు. చెరలో ఉన్నవారిని విడిపించడానికి ఆయన నన్ను పంపించాడు. చూపులేనివారికి తిరిగి చూపును ప్రసాదించడానికి ఆయన నన్ను పంపించాడు. నలిగిన వారికి స్వేచ్చనివ్వడానికి నన్ను పంపాడు. ఆయన మన యెడల దయగలిగి, మనకు సహాయం చేసే సమయం వచ్చింది.”
ఆ లేఖనాలను చదివి యేసు కూర్చున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయనను గమనిస్తున్నారు. తాను అప్పుడే చదివిన లేఖన భాగం మెస్సీయను గురించినదే అని ఆయనకు తెలుసు. యేసు ఇలా చెప్పాడు, “నేనిప్పుడు చదివిన ఈ లేఖనం మన వినికిడిలో నెరవేరింది.” ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. “ఇతడు యోసేపు కుమారుడు కాదా?” అని అన్నారు.
అప్పుడు యేసు ఇలా అన్నాడు, “స్వదేశంలో ఉన్న ప్రవక్తను ప్రజలు అంగీకరించరు అనేది సత్యమే. ఏలియా కాలంలో ఇశ్రాయేలులో విధవరాండ్రు అనేకమంది ఉన్నారు. అయితే అక్కడ మూడున్నర సంవత్సరాలు వర్షం లేదు. ఇశ్రాయేలులో ఉన్న విధవరాళ్ళకు సహాయం చెయ్యడం కోసం దేవుడు ఏలియాను పంపించలేదు, దానికి బదులు మరో దేశంలో ఉన్న విధవరాలి వద్దకు దేవుడు ఏలియాను పంపించాడు.
యేసు ఇంకా చెప్పడం కొనసాగించాడు. “ఎలిషా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలులో అనేకులు మంది చర్మ రోగులు ఉన్నారు, అయితే వారిని స్వస్థపరచదానికి దేవుడు అక్కడికి ఎలిషాను పంపించలేదు. ఇశ్రాయేలీయుల శత్రువుల సైన్యాధిపతి నయమానుకున్న కుష్టరోగాన్ని మాత్రమే బాగుచేసాడు.” అయితే యేసు మాటలు వింటున్నవారు మాత్రం యూదులు. కాబట్టి యేసు చెప్పిన ఈ మాటను వినినవారు ఆయనమీద కోపగించుకొన్నారు.
నజరేతు ప్రజలు యేసును పట్టుకొన్నారు, ఆరాధనా స్థలంనుండి వెలుపలికి ఈడ్చుకుపోయారు. పట్టణం అంచు వరకూ ఆయనను తీసుకొని వెళ్లి చంపాలని చూసారు. అయితే యేసు సమూహంలోనుండి తప్పించుకొని నజరేతు పట్టణాన్ని విడిచి వెళ్ళాడు. అప్పుడు యేసు గలిలయ ప్రాంతం అంతా సంచారం చేసాడు, గొప్ప జనసమూహాలు ఆయన వద్దకు వచ్చారు. వారు రోగులను, అవిటివారిని అనేకులను ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. వారిలో కొందరు చూడలేనివారు, కొందరు నడవలేని వారు, కొందరు వినలేనివారు, కొందరు మాట్లాడలేని వారు. యేసు వారినందరినీ స్వస్థపరచాడు.
దయ్యాలు పట్టినవారు అనేకులలో నుండి ఆయన దయ్యాలను పారదోలాడు. వారిలో నుండి దయ్యాలను బయటికి రావాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞప్రకారం ఆ దయ్యాలు వెలుపలికి వచ్చాయి. దయ్యాలు ఆయనను చూచి గట్టిగా అరిచాయి, “నీవు దేవుని కుమారుడవు!” జనసమూహాలు ఆయనను చూచి ఆశ్చర్యపడ్డారు, వారు దేవుని స్తుతించారు.
తరువాత ప్రభువైన యేసు పన్నెండు మందిని ఎంపిక చేసుకొన్నాడు, వారిని అపొస్తలులు అని పిలిచాడు. ఈ అపొస్తలులు యేసుతో ప్రయాణం చేసారు, ఆయన నుండి నేర్చుకొన్నారు.
లూకా 10:25-37 నుండి
ఒక రోజు, యూదా ధర్మ శాస్త్రంలో నిపుణుడు యేసు నొద్దకు వచ్చాడు. యేసు తప్పుగా బోధిస్తున్నాడని అందరికీ రుజువు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడిలా అన్నాడు, “బోధకుడా, నిత్యజీవానికి వారసుడవడానికి నేనేమి చెయ్యాలి?” యేసు ఇలా జవాబిచ్చాడు, “దేవుని ధర్మశాస్త్రంలో రాసియన్న దేమిటి?”
అప్పుడా ధర్మశాస్త్రోపదేశకుడు ఇలా చెప్పాడు, “దేవుని వాక్యం ఇలా చెపుతుంది, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమించవలయును, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించవలయును.” యేసు ఇలా జవాబిచ్చాడు, “నీవు సరిగా చెప్పావు! ఈ విధంగా చేస్తే నిత్యజీవాన్ని పొందుతావు.”
అయితే ధర్మశాస్త్రోపదేశకుడు తాను నీతిమంతుడనని చూపించుకోవాలని కోరాడు. కనుక యేసును ఇలా అడిగాడు, “అయితే నా పొరుగువాడు ఎవడు?” ప్రభువైన యేసు ఆ ఉపదేశకునికి ఒక ఉపమానం చెప్పడం ద్వారా జవాబిచ్చాడు, “ఒక యూదుడు యెరూషలెం నుండి యెరికో వైపుకు ప్రయాణం చేస్తున్నాడు.”
“అయితే దొంగలు అతనిని చూచారు, అతని మీద దాడి చేసి అతనిని గాయపరచారు. అతని వద్ద ఉన్నవాటన్నిటినీ తీసుకొని కొనప్రాణం వరకూ అతనిని కొట్టారు. అప్పుడు వారు వెళ్ళిపోయారు.” “అది జరిగిన తరువాత, ఒక యూదా మత యాజకుడు అదే మార్గంలోని నడుస్తూ వచ్చాడు. యాజకుడు ఆ వ్యక్తి మార్గంలో పడిపోవడం చూసాడు. అతడు ఆ వ్యక్తిని చూచినప్పుడు ఆ దారిలో మరొక మార్గం నుండి వెళ్లి పోయాడు. యాజకుడు ఆ వ్యక్తిని పూర్తిగా నిర్లక్ష్యపెట్టాడు.
“కొంచెం సేపు అయిన తరువాత ఒక లేవీయుడు ఆ మార్గం నుండి వచ్చాడు. (లేవీయులు దేవాలయంలో యాజకులకు సహాయం చేసే గోత్రం). లేవీయుడు ఆ మార్గంలో మరొక వైపునుండి ఆ వ్యక్తిని దాటి వెళ్ళాడు. లేవీయుడు కూడా ఆ వ్యక్తిని నిర్లక్ష్యపెట్టాడు.
తరువాత మరొక వ్యక్తి ఆ మార్గంనుండి నడుస్తూ వచ్చాడు. అతడు సమరయ ప్రాంతం వాడు. (సమరయులు, యూదులు ఒకరినొకరు ద్వేషించుకొంటారు). సమరయుడు మార్గంలో పడియున్న వ్యక్తిని చూచాడు. అతడు యూదుడని గుర్తించాడు. అయినప్పటికీ సమరయుడు అతని పట్ల కనికరాన్ని చూపించాడు. అతని వద్దకు వెళ్ళాడు, అతని దెబ్బలకు మందు రాసాడు, పరిచర్య చేసాడు.”
“అప్పుడు ఆ సమరయుడు ఆ వ్యక్తి ఎత్తుకొని తన గాడిద మీద పెట్టుకొన్నాడు. అతడిని ఒక సత్రానికినికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ అతనిని గురించిన శ్రద్ధ తీసుకొన్నాడు. “తరువాత రోజు సమరయుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ వ్యక్తి కోసం ఆ సత్రపు యజమానికి కొంత సొమ్ము చెల్లించాడు. ఇలా అన్నాడు, “ఈ వ్యక్తిని జాగ్రత్తగా చూచుకోండి, ఇతని విషయంలో ఇంకనూ ఖర్చు చేసిన యెడల నేను తిరిగి వచ్చినప్పుడు దానిని నేను చెల్లిస్తాను.”
ప్రభువైన యేసు ఆ ధర్మశాస్త్రోపదేశకుడిని అడిగాడు, “నీవేమి అనుకొంటున్నావు? బందిపోటుల చేత దోచుకోబడి కొట్టబడిన వ్యక్తికి ఈ ముగ్గురిలో ఎవరు నిజమైన పొరుగువాడు?” అతడిలా జవాబిచ్చాడు, “అతని పట్ల జాలి చూపినవాడే!” అందుకు యేసు అతనితో “వెళ్ళు, నీవునూ అదే చెయ్యి” అని చెప్పాడు.
మత్తయి 19:16-30; మార్కు 10:17-31; లూకా 18:18-30 నుండి
ఒక రోజున ధనవంతుడైన యువ అధికారి యేసు వద్దకు వచ్చి ఇలా అడిగాడు, “మంచి బోధకుడా, నిత్యజీవాన్ని స్వతంత్రించుకోడానికి నేనేమి చెయ్యాలి?” యేసు అతనితో ఆలా చెప్పాడు, “మంచి బోధకుడనని నన్ను నీవెందుకు పిలుస్తున్నావు? మంచి బోధకుడు ఒక్కడే ఉన్నాడు, దేవుడొక్కడే మంచి బోధకుడు. నిత్యజీవాన్ని స్వతంత్రించుకోడానికి నీవు దేవుని ధర్మశాస్తాన్ని అనుసరించు.”
అతడు యేసును అడిగాడు, “వేటికి నేను విధేయత చూపించాలి” అందుకు యేసు ఇలా జవాబిచ్చాడు. “నరహత్య చెయ్యవద్దు, వ్యభిచారం చెయ్యవద్దు, దొంగిల వద్దు, అబద్దం చెప్పవద్దు. నీ తండ్రిని, తల్లిని సన్మానించాలి. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలి.”
అయితే ఆ యువకుడు ఇలా అన్నాడు, “నేను చిన్న వయసునుండే వీటన్నిటినీ పాటిస్తున్నాను, నిత్యజీవాన్ని పొందడానికి నేను ఇంకా ఏమి చెయ్యాలి?” యేసు అతని వైపు చూచాడు, అతనిని ప్రేమించాడు.
యేసు అతనికి జవాబిచ్చాడు, “నీవు పరిపూర్ణుడవు కావాలంటే నీవు వెళ్లి నీకున్నదానిని అమ్మి ఆ డబ్బును పేదలకు పంచిపెట్టు, అప్పుడు నీకు పరలోకంలో ధనం అధికం అవుతుంది. అప్పుడు వచ్చి నన్ను వెంబడించు.”
యేసు చెప్పిన ఈ మాట ధనవంతుడైన ఈ యువకుడు విని చాలా దుఃఖపడ్డాడు, ఎందుకంటే అతడు మిక్కిలి ధనవంతుడు కనుక తనకున్న ఆస్తులను విడిచి పెట్టడానికి ఇష్టపడలేదు. అతడు వెనుక తిరిగి యేసు దగ్గర నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు తన శిష్యుల వైపుకు తిరిగి, “ధనవంతులు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం అత్యంత దుర్లభం! అవును, ఒక ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరడం సులభం” అని అన్నాడు.
యేసు చెప్పిన ఈ మాట శిష్యులు వినినప్పుడు, వారు ఆశ్చర్యపోయారు. వారు ఇలా అన్నారు, “ఇలా అయితే దేవుడు ఎవరిని రక్షిస్తాడు?” యేసు తన శిష్యుల వైపు తిరిగి ఇలా చెప్పాడు, “మనుష్యులు తమ్మును తాము రక్షించుకోవడం అసాధ్యం, అయితే దేవునికి సమస్తం సాధ్యమే.”
పేతురు యేసుతో ఇలా అన్నాడు, “శిష్యులమైన మేము సమస్తము విడిచి నిన్ను వెంబడించాం, మాకు వచ్చే బహుమతి ఏమిటి?” యేసు ఇలా జవాబిచ్చాడు, “ఎవడైననూ తన ఇంటినైననూ, అన్నదమ్ములనైననూ, అక్కచెల్లెండ్రనైననూ, తండ్రినైననూ, తల్లినైననూ, పిల్లలనైననూ నా నిమిత్తం విడిచినట్లయితే దానికి నూరు రెట్లు ఫలమునూ, నిత్య జీవాన్ని పొందుతారు, అయితే మొదటివారు కడపటి వారవుతారు, కడపటి వారు మొదటివారు అవుతారు.”
మత్తయి 18:21-35 నుండి
ఒకరోజు శిష్యుడైన పేతురు పభువును ఇలా అడిగాడు, “ప్రభూ, నేను నా సహోదరుడు నా యెడల తప్పిదం చేసినప్పుడు అతడిని ఎన్ని సార్లు క్షమించాలి? ఏడుసార్లు మట్టుకా?” యేసు ఇలా జవాబిచ్చాడు, “ఏడుసార్లు కాదు, డెబ్బది ఏడు మార్లు మట్టుకు.” దీనిని బట్టి మనం ఎల్లప్పుడూ క్షమించాలని ప్రభువు చెపుతున్నాడు. అప్పుడు ప్రభువైన యేసు ఈ కథ చెప్పాడు.
యేసు ఇలా చెప్పాడు, “దేవుని రాజ్యం తన సేవకులకు తగిన జీతం ఇవ్వడాలని కోరిన ఒక రాజును పోలియుంది. ఆయన సేవకులలో ఒకడు రాజుకు 200, 000 సంవత్సరాల వేతనంతో సమానమైన పెద్దమొత్తం రుణపడి యున్నాడు. “అయితే ఆ సేవకుడు తన అప్పు చెల్లించలేక పోయినందున ఆ రాజు తన సేవకులతో, “ఇతనినీ, ఇతని కుటుంబాన్ని ఆమ్మి ఇతని అప్పు తీర్చండి.” అని చెప్పాడు.
“ఆ సేవకుడు రాజు యెదుట మోకరించి ఇలా మనవి చేసాడు, “నా యందు దయ ఉంచుము, నీకు అచ్చియున్న రుణాన్ని మొత్తం నీకు చచెల్లిస్తాను” అయితే రాజు ఆ సేవకుని పట్ల జాలి చూపించాడు, కనుక అతడు అచ్చియున్న అప్పును మొత్తం రద్దు చేసాడు.
“అయితే ఈ సేవకుడు రాజు సన్నిధినుండి బయటకు వెళ్లి తనకు నాలుగు నెలలకు తగిన వేతనంతో సమానమైన అప్పును తీసుకొన్న తన తోటి సేవకుడిని చూచి అతనిని గట్టిగా పట్టుకొని వాడితో, “నాకు అప్పుగా ఉన్న ధనాన్ని వెంటనే చెల్లించు” అని గట్టిగా చెప్పాడు.
తన తోటి సేవకుడు అతని కాళ్ళ మీదపడి ‘దయచేసి నా మీద దయ ఉంచుము, నేను నీకు పూర్తి అప్పును చెల్లించెదను.’ అని బతిమాలాడు, అయితే ఆ మొదటి సేవకుడు తన తోటి సేవకుడిని ఆఖరు నాణెం చెల్లించేవరకూ తనిని చెరసాలలో వేయించాడు. “ఇతర సేవకులు జరిగిన దానిని చూచి చాలా కలవరపడ్డారు. వారు రాజు వద్దకు వెళ్లి జరిగిన దాన్నంతటినీ రాజుతో చెప్పారు.”
“రాజు ఆ మొదటి సేవకుడిని పిలిపించాడు, అతనితో ఇలా చెప్పాడు, “దుష్టుడైన చెడ్డ దాసుడా! నీవు నన్ను వేడుకొన్నందుకు నేను నిన్ను క్షమించాను. నీవునూ అదే క్షమాపణ చూపించాలి గదా.” రాజు చాలా కోపగించుకొన్నాడు, ఆ చెడ్డ దాసుడిని చెరసాలలో అతడు తన అప్పును చెల్లించు వరకూ వేయించాడు.” అప్పుడు యేసు ఇలా చెప్పాడు, “నీ హృదయంలో నుండి నీవు నీ సహోదరుని క్షమించని యెడల నీకునూ ఈవిధంగానే జరుగుతుంది.”
మత్తయి 14:13-21; మార్కు 6:31-44; లూకా 9:10-17; యోహాను 6:5-15 నుండి
ప్రభువైన యేసు తన శిష్యులను సువార్త ప్రకటించడానికీ, దేవుని వాక్యాన్ని బోధించడానికీ యేసు తన అపొస్తలులను అనేక గ్రామాలకు పంపాడు. వారు యేసు ఉన్న చోటకు తిరిగివచ్చినప్పుడు, వారు చేసినదాన్నంతటిని యేసుతో చెప్పారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోడానికి సరస్సు అవతలి వైపుకు వెళ్ళమని ప్రభువు వారితో చెప్పాడు. అందువల్ల, వారు ఒక పదవ ఎక్కి సరస్సుకు ఆవలి వైపుకు వెళ్లారు.
అయితే అనేకులు యేసునూ, ఆయన శిష్యులనూ పడవలో ఉండడం చూచారు. ఈ ప్రజలు సరస్సు ఒడ్డునుండి నది ఆవలి వైపుకు పరుగెత్తి వారికి ముందుగా వెళ్ళారు. కాబట్టి యేసు, ఆయన శిష్యులు వచ్చినప్పుడు, ఒక పెద్ద సమూహం అక్కడ అప్పటికే ఉంది, వారు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
ఈ గుంపులో 5,000 మందికి పైగా పురుషులు ఉన్నారు, మహిళలు, పిల్లలను లెక్కించలేదు. ప్రభువు వారిపై కనికరపడ్డాడు. ప్రజలు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నారని ప్రభువుకు కనిపించింది. కనుక ఆయన వారికి బోధించి, వారిలో వ్యాధులతో ఉన్నవారిని స్వస్థపరిచాడు.
తరువాత ఆయన శిష్యులు ప్రభువుతో ఇలా చెప్పారు, “ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, సమీపంలో ఎటువంటి పట్టణాలూ లేవు. వారు ఏమైనా భుజించుటకు వారిని పంపించివెయ్యి.” అయితే యేసు తన శిష్యులతో, "వారు తినడానికి మీరే ఏదైనా ఇవ్వండి అన్నాడు. వారు "మా వద్ద ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి అన్నారు. యేసు తన శిష్యులతో, ప్రజలందరూ నేలపై గడ్డి మీద ఒక్కొక్క గుంపులో యాభై మంది చొప్పుల కూర్చుండాలని చెప్పాడు.
అప్పుడు యేసు ఐదు రొట్టెలు, రెండు చేపలను తీసుకొని ఆకాశం వైపుకు కన్నులెత్తి చూసి ఆ ఆహారం కోసం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. అప్పుడు యేసు ఆ రొట్టెలనూ, చేపలనూ విరిచి ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ఆహారాన్ని ప్రజలందరికీ పంచిపెట్టారు. అవి తరిగి పోలేదు. ప్రజలంతా తిని, సంతృప్తి చెందారు. ఆ తరువాత, శిష్యులు మిగిలిన ఆహారాన్ని సేకరించారు. అది పన్నెండు గంపలు అయ్యింది. ఆ ఆహారం అంతా ఐదు రొట్టెలు, రెండు చేపల నుండి వచ్చింది.
మత్తయి 14:22-23; మార్కు 6:45-52; యోహాను 6:16-21 నుండి
ఐదువేల మందికి ఆహారాన్ని పంచిన తరువాత ప్రభువైన యేసు తన శిష్యులకు పడవలోనికి వెళ్లాలని చెప్పాడు. సముద్రం ఆవలి వైపుకు వెళ్లాలని ఆయన వారిని కోరాడు. ఆయన సముద్రం ఒడ్డున కొంతసేపు నిలిచాడు. కనుక శిష్యులు పడవలో బయలుదేరారు. యేసు జనసమూహములను తమ గృహాలకు పంపివేసాడు. తరువాత ఆయన ప్రార్థన చెయ్యడానికి కొండమీదకు వెళ్ళాడు, రాత్రంతా పార్థన చెయ్యడంలో ఆయన ఒంటరిగా సమయాన్ని గడిపాడు.
ఈ సమయంలో శిష్యులు పడవ నడుపుతూ ఉన్నారు, అయితే వారి పడవకు వ్యతిరేకంగా పెద్ద గాలి వీస్తుంది, అర్థరాత్రి సమయంలో వారు సముద్రం మధ్యలో ఉన్నారు. ఆ సమయంలో ప్రభువు తన ప్రార్థనను ముగించి తన శిష్యులను కలుసుకోడానికి వెళ్ళాడు. ఆయన నీళ్ళ మీద నడుస్తూ పడవ వద్దకు వస్తున్నాడు.
శిష్యులు ఆయనను చూచారు, వారు చాలా భయపడ్డారు ఎందుకంటే ఆయన ఒక భూతం అని భావించారు. వారు భయపడ్డారని యేసుకు తెలుసు. కనుక ఆయన వారిని పిలిచాడు, “భయపడకండి. నేనే!” అని చెప్పాడు. అప్పుడు పేతురు ప్రభువుతో ఇలా చెప్పాడు, “ప్రభూ, ఇది నీవే అయితే నీటి మీద నడుస్తూ నీ వద్దకు రావడానికి నాకు అనుమతి ఇవ్వు.” అందుకు ప్రభువు పేతురుతో “రమ్ము” అని చెప్పాడు.
కనుక పేతురు పడవలోనుండి బయటకు వచ్చారు, నీటిమీద నడుస్తూ యేసు వైపుకు నడవడం ఆరంభించాడు. అయితే కొంత దూరం నడచిన తరువాత, పేతురు తన చూపును యేసు నుండి మరల్చి అలలను చూడడం ఆరంభించాడు. బలమైన గాలులను చూచాడు.
అప్పుడు పేతురు భయపడ్డాడు, నీటిలోనికి మునిగి పోవడం ఆరంభించాడు. “ప్రభూ నన్ను రక్షించు” అని బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. యేసు తన చేతిని చాపి పేతురు చేతిని పట్టుకొని పైకి లేపాడు. యేసు పేతురుతో ఇలా అన్నాడు, “నీకు కొంచెం విశ్వాసం ఉంది! నేను నిన్ను భద్రంగా ఉంచగలనని ఎందుకు విశ్వసించ లేదు?”
అప్పుడు పెతురు, యేసు పడవలోనికి వచ్చారు. వెంటనే గాలి వీయడం నిలిచిపోయింది. నీరు సద్దుమణిగింది. ఆయనను చూచి శిష్యులు ఆశ్చర్యపోయారు. ఆయనకు మ్రొక్కారు. ఆయనను ఆరాధించి ఆయనతో ఇలా అన్నారు, “నిజముగా నీవు దేవుని కుమారుడవు.”
మత్తయి 8:28-34; 9:20-22; మార్కు 5:1-20; 5:24-34; లూకా 8:26-39; 8:42-48 నుండి
యేసూ, ఆయన శిష్యులూ గెరాసేనుల ప్రాంతానికి ఒక పడవలో ప్రయాణిస్తూ వెళ్ళారు. వారు ఆ ప్రాంతానికి వచ్చి పడవలోనుండి కిందకి దిగారు. అక్కడ దయ్యములు పట్టిన ఒకడు ఉన్నాడు. ఇతడు చాలా బలమైన వాడు, ఎవరునూ అతనిని సాధు చెయ్యలేకపోతున్నారు. కొన్నిసార్లు కొందరు గొలుసులతో అతని కాళ్ళను, చేతులను కట్టియుంచేవారు. అయితే అతడు వాటిని తుత్తునియులుగా చేస్తున్నాడు.
ఆ మనిషి ఆ ప్రాంతంలో ఉన్న సమాధులలో నివాసం చేస్తున్నాడు. రోజంతా గట్టిగా కేకలు వేస్తున్నాడు, సరియైన వస్త్రాలు ధరించలేదు, తరచూ రాళ్ళతో తనను తాను గాయపరచుకొంటూ ఉన్నాడు. ఆ మనిషి యేసును చూసి ఆయన వద్దకు పరుగెత్తి వెళ్లి ఆయన యెదుట సాగిలపడ్డాడు. యేసు అతనిలోని దయ్యాలతో, “ఈ మనిషిలోనుండి బయటకు రమ్ము” అని చెప్పాడు.
వాడిలోని దయ్యాలు గట్టిగా అరిచాయి, “సర్వోన్నతుని దేవుని కుమారుడవైన యేసూ, మాతో నీకేమి? నన్ను బాధపరచకు!” అప్పుడు యేసు ఆ దయ్యంతో ఇలా అన్నాడు, “నీ పేరు ఏమిటి?” వాడు, “నా పేరు సేన, ఎందుకంటే మేము అనేకులం” అని జవాబిచ్చాడు, (“సేన” అంటే రోమా సైన్యంలో అనేక వేల సైనికుల సమూహం.)
వానిలోని దయ్యాలు యేసును బతిమాలుకొన్నాయి, “దయచేసి మమ్మును బయటకు తోలివేయకుము!” అక్కడకు దగ్గరలో కొండమీద ఒక పెద్ద పందుల గుంపు ఉంది, కనుక దయ్యాలు యేసును బతిమాలాయి, “దయచేసి మమ్మల్ని ఆ పందుల మందలోనికి పంపించండి!” అందుకు యేసు “వెళ్ళండి” అని ఆజ్ఞాపించాడు.
ఆ వ్యక్తిలో నుండి దయ్యాలు బయటికి వచ్చి ఆ పందులలో ప్రవేశించాయి. వెంటనే ఆ పందుల గుంపు పరుగున వెళ్లి ఆ సమద్రంలోని ఒక ప్రపాతంలో పడి మునిగి పోయాయి. అక్కడ ఆ గుంపులో దాదాపు 2,000 పందులు ఉన్నాయి. ఆ పందులు కాయుచున్న కాపరులు అక్కడ ఉన్నారు, జరిగిన దానిని వారు చూచినప్పుడు వారు పట్టణం లోనికి పరుగున వెళ్ళారు. యేసు చేసిన దానిని ప్రజలందరికీ చెప్పారు. పట్టణంలోనుండి ప్రజలు యేసు వద్దకు వచ్చి దయ్యముల వెళ్ళిపోయిన వ్యక్తి వస్త్రములు ధరించి యేసు వద్ద స్వస్థ చిత్తుడిగా కూర్చుండడం చూసారు.
జరిగిన దానిని బట్టి వారు చాలా భయపడ్డారు, ఆ స్థలం విడిచిపెట్టాలని యేసును అడిగారు. కనుక యేసు అక్కడనుండి పడవ ఎక్కి బయలుదేరారు. దయ్యములు విడిచిపెట్టిన వ్యక్తి యేసుతో తనను ఉండనిమ్మని బతిమాలాడు. అయితే యేసు అతనితో ఇలా చెప్పాడు, “నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళు, దేవుడు నీకు చేసిన కార్యాలను అందరితో చెప్పు, ఆయన నీ పట్ల ఏ విధంగా తన కనికరాన్ని చూపించాడో పంచుకో.”
కనుక ఆ మనిషి తన ఇంటికి వెళ్ళిపోయాడు, యేసు తనకు చేసిన వాటన్నిటినీ అందరితో పంచుకొన్నాడు. అతను చెపుతున్న వాటిని విని అందరూ ఆశ్చర్యపోయారు. యేసు సముద్రం ఆవలి వైపుకు వచ్చాడు. ఆయన అక్కడకు చేరిన తరువాత, గొప్ప సమూహం ఆయన వద్దకు వచ్చారు, వారు ఆయన మీద పడుతున్నారు. ఆ సమూహంలో పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావరోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. ఆమె స్వస్థత పొందడానికి తన డబ్బునంతా వైద్యులకు ఖర్చుచేసింది, అయితే ఆమె రోగం మరింత ఎక్కువయ్యింది.
యేసు అనేకులైన రోగులను స్వస్థపరచాడని ఆమె వినింది, “యేసు వస్త్రాలను తాకినట్లయితే బాగుపడుదును” అనుకొంది. కనుక ఆమె యేసు వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొంది. ఆయన వస్త్రాన్ని తాకిన వెంటనే ఆమె రక్త స్రావం నిలిచిపోయింది!
వెంటనే, యేసు తనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళినట్లు గ్రహించాడు. కనుక ఆయన వెనుకకు తిరిగి, “నన్ను తాకినది ఎవరు?” అని అడిగాడు. అందుకు శిష్యులు ఇలా జవాబిచ్చారు, “నీ చుట్టూ అనేకమంది సమూహం నీ మీద పడుచుండగా ‘నన్ను తాకినది ఎవరు?’ అని అడుగుచున్నావేమిటి? అని శిష్యులు ఆయనను అడిగారు.
ఆ స్త్రీ యేసు పాదాల మీద పడింది, భయంతో వణికిపోతుంది. అప్పుడు ఆమె ఆయనతో జరిగినదంతా వివరించింది. తాను ఆమె స్వస్థత పొందాననీ చెప్పింది. యేసు ఆమెతో ఇలా అన్నాడు, “నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. సమాధానంతో వెళ్ళు.”
మత్తయి 13:1-8, 18-13; మార్కు 4:1-8, 13-20; లూకా 8:4-15 నుండి
ఒక రోజు యేసు ఒక సరస్సు తీరాన్న ఉన్నాడు. గొప్ప జనసమూహాలకు ఆయన బోధిస్తున్నాడు. ఆయన బోధ వినడానికి అనేకులు ఆయన వద్దకు వస్తున్నారు. వారందరితో మాట్లాడడానికి సరియైన స్థలం లేదు. కనుక ఆయన ఒక దోనేలోనికి ఎక్కాడు. ఆయన అక్కడ కూర్చుండి ప్రజలకు బోధించడం ఆరంభించాడు.
ప్రభువైన యేసు వారితో ఒక కథను చెప్పాడు. “ఒక వ్యవసాయకుడు తన పొలములో విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు విత్తుచుండగా కొన్ని విత్తనాలు మార్గమధ్యలో పడ్డాయి. అయితే పక్షులు వచ్చి ఆ విత్తనాలన్నిటినీ తిని వేసాయి.” “కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి, అక్కడ మన్నులేని రాతి నేల. రాతి నేల మీద పడిన విత్తనాలు త్వరగా మొలిచాయి, అయితే వాటి వేరులు మన్నులోనికి లోతుగా వెళ్ళలేక పోయాయి. సూర్యుడు వచ్చినప్పుడు దాని వేడిమికి మొక్కలు ఎండిపోయి చనిపోయాయి.”
“ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలలో పడ్డాయి. ఆ విత్తనాలు మొలకెత్తాయి, అయితే ముళ్ళ పొదలు వాటి మీద పెరిగి వాటిని అణచివేసాయి. అందుచేత ముళ్ళపొదలలో పడిన విత్తనాలు మొక్కలుగా పెరగలేదు.” “కొన్ని విత్తనాలు మంచి నేలమీద పడ్డాయి. ఈ విత్తనాలు పెరిగి పెద్డై అవి ముప్పదంతలుగానూ, ఆరవదంతలుగానూ, నూరంతలుగానూ ఫలాన్ని ఇచ్చాయి. దేవుణ్ణి అనుసరించాలని కోరుకున్నవారు నా మాటలను శ్రద్ధగా ఆలకించాలి.”
ఈ కథ శిష్యులను చాలా కలవరపరచింది. కాబట్టి యేసు వారికి వివరించాడు, “విత్తనం దేవుని వాక్యం. విత్తనాలు మార్గమధ్యలో పడడం, దేవుని వాక్యాన్ని విని దానిని అర్థం చేసుకోనివారుగా ఉంటారు. శత్రువు వారినుండి వాక్యాన్ని ఎత్తికొని వెళ్తాడు. వారు వాక్యాన్ని అర్థం చేసుకొకుండా సాతాను చేస్తాడు.”
“రాతి నేల దేవుని వాక్యాన్ని విని దానిని ఆనందంతో అంగీకరించిన వ్యక్తిని సూచిస్తుంది. అయితే కష్టాలు కలిగినప్పుడు లేక ఇతరుల అతనికి శ్రమలు కల్గిస్తున్నప్పుడు వాడు దేవుని నుండి దూరం అవుతాడు. అంటే దేవునిలో విశ్వాసం ఉంచడం నిలిపివేస్తారు.”
“ముళ్ళపొదలలో విత్తనం పడడం, దేవుని వాక్యాన్ని వినిన వ్యక్తి అనేక ఇతర విషయాల మీద ఆందోళన పడే వ్యక్తిని సూచిస్తుంది. ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు, అనేక వస్తువులను సంపాదించుకోడానికి ప్రయత్నిస్తాడు. కొంత కాలం జరిగిన తరువాత దేవున్ని ప్రేమించలేదు. దేవుని నుండి నేర్చుకొన్న దానిని బట్టి ఆయనను సంతోషపరచలేకపోతాడు. విత్తనాలను ఉత్పత్తి చెయ్యలేని గోధుమకాడల వలే ఉంటాయి.
“అయితే మంచి నేలను పడిన విత్తనం, దేవుని వాక్యాన్ని విని, దానిని విశ్వసించి, ఫలాన్ని కలిగించే మనుష్యుని పోలి ఉంది.”
మత్తయి 13:31-33, 44-46; మార్కు 4:30-31; లూకా 13:18-21; 18:9-14 నుండి
దేవుని రాజ్యం గురించి ప్రభువైన యేసు అనేక కథలు చెప్పాడు. ఉదాహరణకు, ఆయన ఇలా చెప్పాడు, “దేవుని రాజ్యం ఒకడు పొలములో నాటిన ఆవ గింజను పోలి ఉంది. మీకు తెలుసు, ఆవ గింజ విత్తనాలన్నిటిలో అత్యంత చిన్న గింజ.”
“అయితే ఆ ఆవ గింజ మొలిచి పెరిగినప్పుడు అది చెట్లన్నిటిలో అతి పెద్దదిగా ఉంటుంది, పక్షులు సహితం వచ్చి దానిమీద వాలి వాటి కొమ్మలలో గూడు ఏర్పరచుకొంటాయి.” యేసు మరొక కథ చెప్పాడు, “దేవుని రాజ్యం పులియజేయు పిండి వలే ఉంది, ఒక స్త్రీ దానిని రొట్టెముద్దలో కలిపినప్పుడు అది ఆ ముద్ద అంతటిలో వ్యాపిస్తుంది.”
“దేవుని రాజ్యం ఒకడు తన పొలములో దాచి పెట్టిన ధననిధిలా ఉంది. మరొక వ్యక్తి ఆ ధననిధిని కనుగొని నప్పుడు దానిని పొందాలని కోరుకుంటాడు. కనుక అతడు దానిని తిరిగి దాచియుంచుతాడు, ఆనందంతో నిండియుంటాడు, ఆ పొలమును కొనడానికి తనకున్నదానినంతా అమ్మి ధననిధి ఉన్న పొలమును కొంటాడు.”
“దేవుని రాజ్యము గొప్పవెలగల ముత్యంవలే ఉంది. ముత్యముల వర్తకుడు దానిని చూచినప్పుడు తనకున్న దానినంతా అమ్మి ఆ ముత్యమును కొనును.”
మంచి కార్యాలు చెయ్యడం ద్వారా దేవుడు వారిని అంగీకరిస్తాడని కొందరు తలస్తారు. ఈ వ్యక్తులు ఆ మంచి కార్యాలు చెయ్యని ఇతరులను తృణీకరిస్తారు, కనుక యేసు వారికి ఒక కథ చెప్పాడు: “ఇద్దరు మనుష్యులు ఉన్నారు, పార్థన చెయ్యడానికి ఇద్దరూ దేవాలయానికి వెళ్లారు. వారిలో ఒకడు సుంకం వసూలు చేసేవాడు, ఒకడు మత నాయకుడు.”
“మతసంబంధ నాయకుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ‘దేవా నేను ఇటువంటి పాపిలా లేనందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాడు-నేను బందిపోటును కాను, దుర్నీతిపరుడను కాను, వ్యభిచారుడను కాను, ఇక్కడ ఉన్న ఈ సుంకం వసూలు చేసేవాడులాంటి వాడనూ కాను.” “ఉదాహరణకు, వారంలో రెండు దినాలు ఉపవాసం ఉంటాను, నా రాబడిలోనూ, ఆస్తిలోనూ దశమ భాగం ఇస్తాను.”
“అయితే సుంకం వసూలుదారుడు మతనాయకునికి దూరం నిలిచాడు, ఆకాశం వైపుకు కన్నులు ఎత్తడానికి సహితం భయపడ్డాడు. దానికి బదులు, అతడు తన రొమ్మును చేతితో కొట్టుకొంటున్నాడు, దేవునికి ఇలా ప్రార్థన చేసాడు, ‘దేవా పాపినైన నాయందు కనికరించు.”
అప్పుడు ప్రభువు ఇలా చెప్పాడు, “నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, దేవుడు సుంకం వసూలుదారుని ప్రార్థన విన్నాడు, అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, అయితే మతనాయకుని ప్రార్థన ఇష్టపడలేదు. దేవుడు గర్విష్టులను గౌరవించడు, అయితే తమను తాము తగ్గించుకోనే వారిని ఆయన ఘనపరుస్తాడు.
లూకా 15:11-32 నుండి
ఒక రోజున యేసు అనేకమందికి బోధిస్తున్నాడు, వారు ఆయన చుట్టూ చేరారు. వీరు సుంకం వసూలు చేసేవారు, మోషే ధర్మశాస్త్రానికి లోబడని వారు. ఈ ప్రజలతో ఆయన తన స్నేహితులుగా మాట్లాడుతూ ఉండడం కొందరు మత నాయకు చూసారు కనుక ఆయన తప్పిదం చేస్తున్నాడని ఒకరితో ఒకరు చెప్పుకొంటున్నారు వారు మాట్లాడుకొంటున్నదాన్ని యేసు విన్నాడు కనుక ఆయన వారితో ఈ కథ చెప్పాడు.
“ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు తన తండ్రితో, “తండ్రీ, నాకు ఇప్పుడే ఆస్తిలో నా స్వాస్థ్యం నాకు కావాలి!” కనుక తండ్రి తన ఆస్తిని ఆ ఇద్దరి కుమారుల మధ్య పంచి ఇచ్చాడు.” “వెంటనే చిన్న కుమారుడు తనకున్నదానంతటినీ పోగు చేసుకొని దూర దేశం వెళ్లి పాప జీవితంలో తన ధనాన్ని వృధా చేసాడు.”
“అది జరిగిన తరువాత చిన్న కుమారుడు ఉన్న దేశంలో కరువు వచ్చింది, ఆహారం కొనడానికి అతని వద్ద డబ్బు లేదు. కనుక తనకు దొరికిన చిన్న ఉద్యోగాన్ని తీసుకొన్నాడు, అది పందులను మేపడం. తాను చాలా ఆకలితోనూ విచారకరమైన పరిస్థితిలో ఉన్నాడు, పందుల పొట్టును సహితం తినాలని ఆశ పడ్డాడు.”
“చివరకు, చిన్న కుమారుడు తనలో తాను ఇలా చెప్పుకొన్నాడు, ‘నేను చేస్తున్నదేమిటి? నా తండ్రి వద్ద ఉన్న సేవకులందరికి తినడానికి సమృద్ధిగా ఉంది, అయితే నేను ఆహారం లేక క్షీణిస్తున్నాను, నేను నా తండ్రి వద్దకు తిరిగి వెళ్తాను, ఆయన సేవకులలో ఒకనిగా చేర్చుకోనివ్వమని ఆయన బతిమాలతాను.”
“కనుక చిన్న కుమారుడు తన తండ్రి ఇంటికి ప్రయాణం అయ్యాడు. అతడు ఇంకా చాలా దూరంగా ఉండగానే, అతని తండ్రి కుమారుని చూచాడు, అతని పట్ల కరుణ కలిగింది. తన కుమారుని వద్దకు పరుగెత్తి వెళ్ళాడు, అతనిని కౌగలించుకొన్నాడు, ముద్దు పెట్టాడు.”
“కుమారుడు తన తండ్రితో ఇలా చెప్పాడు, ‘తండ్రీ దేవుని యెదుటనూ, నీ యెదుటనూ నేను పాపం చేసాను. నీ కుమారుడనని అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను.”
“అయితే తండ్రి తన సేవకులను పిలిచి, ‘త్వరగా వెళ్ళండి, శ్రేష్ఠమైన వస్త్రాలు తీసుకొని రండి, నా కుమారునికి వాటిని ధరింపచెయ్యండి! అతని వేలుకు ఉంగరాన్ని ధరింపజెయ్యండి, పాదాలకు చెప్పులను తొడగండి. శ్రేష్ఠమైన గొర్రెపిల్లను వధించండి, మనం వేడుక చేసుకొందాం, ఎందుకంటే చనిపోయిన నా కుమారుడు సజీవుడయ్యాడు, నశించిన వాడు, ఇప్పుడు మనం అతనిని కనుగొన్నాం!”
“కనుక ప్రజలు సంతోషించడం ఆరంభించారు. ఆ సమయంలో పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చాడు, ఇంటిలో సంగీతం, నాట్యం చూసాడు, జరుగుతున్న దానిని బట్టి ఆశ్చర్యపోయాడు.
“తన సోదరుడు ఇంటికి వచ్చిన కారణంగా జరుగుతున్న వేడుకను చూచినప్పుడు అతడు చాలా కోపగించుకొన్నాడు. ఇంటిలోనికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అతని తండ్రి వెలుపలికి వచ్చి లోనికి రమ్మని, వేడుకలో పాల్గొనమని అతనిని బతిమాలాడు, అయితే అతడు దానికి ఒప్పుకొనలేదు.”
“పెద్ద కుమారుడు తన తండ్రితో ఇలా అన్నాడు, “అనేక సంవత్సరాలు నీ కోసం నమ్మకంగా పని చేసాను! నేను ఎన్నడూ నీకు అవిధేయత చూపించలేదు, అయినా నీవు నా స్నేహితులతో ఆనందించడానికి నాకు ఎప్పుడూ ఒక చిన్న గొర్రెపిల్లనైనా ఇవ్వలేదు, అయితే నీ ఆస్తి అంతయూ వృధాగా వెచ్చించిన ఈ నీ చిన్నకుమారుడు వచ్చినప్పడు అతని కోసం నీవు వేడుక కోసం శ్రేష్ఠమైన గొర్రెను వధించావు!”
“తండ్రి ఇలా జవాబిచ్చాడు, ‘నా కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు, నాకున్న సమస్తమూ నీదే, అయితే మనం ఆనందించడం సరియైనదే ఎందుకంటే నీ సోదరుడు చనిపోయాడు, ఇప్పుడు బ్రతికాడు, తప్పిపోయాడు , ఇప్పుడు దొరికాడు!”
మత్తయి 17:1-9; మార్కు 9:2-8; లూకా 9:28-36 నుండి
ఒక రోజున ప్రభువైన యేసు తన ముగ్గురు శిష్యులను, పేతురు, యాకోబు, యోహానులను తనతోపాటు వెంటపెట్టుకొని వెళ్ళాడు. (శిష్యుడైన యోహాను, బాప్తిస్మం ఇచ్చు యోహాను ఒకటి కాదు) వారు ఒక కొండ మీదకు ప్రార్థన చెయ్యడానికి వెళ్ళారు. యేసు ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖం సూర్యుని వలే కాంతివంతంగా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు తెల్లనివిగా భూమిమీద ఎవ్వరూ చెయ్యలేనివిగా ప్రకాశంగా ఉన్నాయి.
అప్పుడు మోషే, ఏలియాలు ప్రత్యక్షం అయ్యారు. ఈ ఇద్దరు మనుష్యులు అనేక వందలాది సంవత్సరాల క్రితం జీవించారు. వారు యేసుతో ఆయన మరణం గురించి మాట్లాడారు, ఎందుకంటే ఆయన త్వరలో యెరూషలెంలో చనిపోబోతున్నాడు. మోషే, ఏలియాలు యేసుతో మాట్లాడుతుండగా పేతురుతో ఇలా అన్నాడు, “మనమిక్కడ ఉండడం మంచిది. ఒకటి నీకునూ, ఒకటి మోషేకునూ, ఒకటి ఏలియాకునూ మనం మూడు పర్ణశాలలు కడదాం.” అయితే పేతురు ఏమి మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు.
పేతురు మాట్లాడుచుండగా ఒక ప్రకాశమానమైన మేఘం కిందకు వచ్చి వారిని ఆవరించింది. ఆ మేఘంలోనుండి ఒక స్వరాన్ని వారు విన్నారు, “ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను.” ఆ ముగ్గురు శిష్యులు మిక్కిలి భయపడ్డారు, నేలమీద పడిపోయారు. అప్పడు యేసు వారిని తాకి ఇలా చెప్పాడు, “భయపడకండి. లేవండి.” అప్పుడు వారు చుట్టూ చూచినప్పుడు యేసు తప్ప ఎవరునూ అక్కడ వారికి కనపడలేదు.
యేసునూ, ఆయన ముగ్గురు శిష్యులునూ కొండ దిగి కిందకు వెళ్ళారు. అప్పుడు యేసు వారితో ఇలా చెప్పాడు, “జరిగిన దానిని గురించి ఎవ్వరితోనూ ఏమియూ చెప్పవద్దు, తరువాత మీరు ప్రజలతో చెప్పవచ్చు.”
యోహాను 11:1-46 నుండి
లాజరు అనే పేరుగల ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి మరియ, మార్త అను ఇద్దరు సోదరీలు ఉన్నారు. వారు యేసుకు అత్యంత సమీప స్నేహితులు. ఒక రోజున లాజరు రోగియై ఉన్నాడని యేసుకు చెప్పారు. యేసు ఈ సంగతి వినినప్పుడు, “ఈ వ్యాధి లాజరు చనిపోవడానికి రాలేదు, ప్రజలు దేవుణ్ణి మహిమ పరచడానికి వచ్చింది” అని చెప్పాడు.
యేసు ఆయన స్నేహితుల యెంతో ప్రేమించాడు. అయితే తాను నిలిచియున్న చోటనే యేసు రెండు రోజులు ఆగిపోయాడు. ఆ రెండు రోజుల గడచిన తరువాత ఆయన తన శిష్యులతో, “మనం యూదయకు వెల్లుదము రండి” అని చెప్పాడు. అందుకు శిష్యులు, “ప్రభువా కొద్ది కాలం క్రితమే వారు నిన్ను చంపాలని చూచారు కదూ!” అని యేసును అడిగారు. యేసు ఇలా అన్నాడు, “మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు, మనం ఆయనను మేల్కొల్పుదాం రండి.”
యేసు శిష్యులు ఇలా జవాబిచ్చారు, “ప్రభూ, లాజరు నిద్రిస్తున్నట్లయితే మనం వెళ్ళడం మంచిదే.” అప్పుడు యేసు వారితో “లాజరు చనిపోయాడు. మీరు నా యందు విశ్వాసం ఉంచులాగున మనం అక్కడ లేకుండా ఉండడం మంచిది.”
యేసు లాజరు గ్రామానికి వచ్చినప్పుడు, లాజరు అప్పటికి చనిపోయి నాలుగు రోజులయ్యింది. మార్త యేసును ఎదుర్కొనడానికి బయటకు వెళ్లింది. ఆమె యేసుతో ఇలా అంది, “ప్రభూ నీవిక్కడ ఉండిన యెడల నా సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు, అయిననూ తండ్రిని నీవేమి అడిగిననూ ఆయన నీకు అనుగ్రహించునని నేనెరుగుదును.”
యేసు జవాబిచ్చాడు, “పునరుత్థానమునూ, జీవమునూ నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయిననూ జీవించును. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు మరెన్నటికూ చనిపోడు. ఈ మాట నీవు నమ్ముచున్నావా?” మార్త ఇలా జవాబిచ్చింది, “అవును ప్రభూ! నేను నమ్ముచున్నాను, నీవు దేవుని కుమారుడవైన మెస్సీయ అని నమ్ముచున్నాను.”
అప్పడు మరియ అక్కడికి వచ్చింది. “ప్రభూ, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు.” అని ప్రభువుతో చెప్పింది. యేసు ఆమెను ఇలా అడిగాడు, “లాజరును ఎక్కడ ఉంచారు?” వారు, “సమాధిలో ఉంచాము, వచ్చి చూడుము.” అని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచాడు.
సమాధి ఒక గుహలా ఉంది, దాని ముందు భాగంలో ఒక రాయి దొర్లించబడి ఉంది. యేసు సమాధి వద్దకు వచ్చినప్పుడు, “ఆ రాయిని దొర్లించండి” అని వారితో చెప్పాడు. అయితే మార్త ఆయనతో, “లాజరు చనిపోయి నాలుగు రోజులు అయ్యింది. చెడు వాసన వస్తుంది.” అని చెప్పింది.
యేసు వారితో ఇలా జవాబు ఇచ్చాడు, “మీరు నాయందు విశ్వాసముంచిన యెడల దేవుని శక్తిని చూస్తారని నేను మీతో చెప్పలేదా?” కనుక వారు సమాధిమీద నుండి రాయిని దొర్లించారు.
అప్పుడు యేసు ఆకాశం వైపుకు తన కన్నులెత్తి ఇలా ప్రార్థించాడు, “తండ్రీ నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతలు. నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటావని నాకు తెలుసు. ఇక్కడ నిలిచిన వారందరికీ సహాయపడేలా ఈ ప్రార్థన చేస్తున్నాను, తద్వారా నీవు నన్ను పంపావని వారు తెలుసుకుంటారు..” తరువాత ఆయన బిగ్గరగా అరిచాడు, “లాజరూ బయటి రా!”
కనుక లాజరు బయటికి వచ్చాడు! అతడింకా సమాధి వస్తాలతోనే ఉన్నాడు. యేసు వారితో చెప్పాడు, “అతని వస్త్రాలు తొలగించండి, అతని విడిపించండి!” ఈ ఆశ్చర్యకార్యాన్ని బట్టి అనేకు యేసు నందు విశ్వాసముంచారు. యూదుల నాయకులు యేసు విషయంలో అసూయ చెందారు కనుక వారు కలిసి యేసునూ, ఆయనతో కూడా ఉన్న లాజరును చంపాలని కుట్రపన్నారు.
మత్తయి 26:14-56; మార్కు 14:10-50; లూకా 22:1-53; యోహాను 12:6; 18:1-11 నుండి
ప్రతీ సంవత్సరం యూదులు పస్కాపండుగను ఆచరిస్తారు. అనేక శతాబ్దాల క్రితం తమ పితరులను దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి తప్పించిన దానిని బట్టి చేసే పండుగ. యేసు బహిరంగ బోధ ప్రారంభించిన మూడు సంవత్సరాలకు యేసు తన శిష్యులతో తాను యెరూషలెంలో పస్కా పండుగ ఆచరించబోతున్నాడని చెప్పాడు. ఆయన అక్కడ చనిపోతున్నాడని వారితో చెప్పాడు. యేసు శిష్యులలో యూదా అను ఒక శిష్యుడు, శిష్యుల డబ్బు సంచికి భాద్యత వహిస్తున్నాడు. అయితే తరచుగా అతడు ఆ డబ్బు సంచిలోనుండి దొంగిలిస్తూ ఉండేవాడు. యేసూ, ఆయన శిష్యులూ యెరూషలెంకు వచ్చిన తరువాత యూదా మతనాయకుల వద్దకు యూదా వెళ్ళాడు. తనకు డబ్బు ఇస్తే దానికి ప్రతిగా యేసును వారికి పట్టిస్తానని వారితో చెప్పాడు. యూదులు యేసును మెస్సీయగా అంగీకరించడం లేదని అతనికి తెలుసు. ఆయనను వారు చంపాలని ఎదురు చూస్తున్నట్టు అతనికి తెలుసు. ప్రధాన యాజకుని నాయకత్వంలో యూదా నాయకులు యేసును పట్టిస్తున్నందుకు యూదాకు ముప్పై వెండి నాణాలు ఇచ్చారు. ఈ విధంగా జరుగుతుందని ప్రవక్తలు చెప్పిన విధంగా జరిగింది. యూదా అంగీకరించాడు. ఆ డబ్బును తీసుకొన్నాడు, వెళ్ళిపోయాడు. యేసును బంధించే అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చాడు. యెరూషలెంలో యేసు తన శిష్యులతో పస్కా పండుగ ఆచరిస్తున్నాడు. పస్కా విందు చేస్తున్న సమయంలో యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని విరిచి ఈ విధంగా చెప్పాడు, “దీనిని తీసుకొని తినుడి. నేను మీకు అర్పిస్తున్న నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని తీసుకోండి.” ఈ విధంగా వారి కోసం తాను చనిపోతున్నట్టు వారికి చెప్పాడు. తన శరీరాన్ని వారికొరకు బలిగా అర్పించబోతున్నట్టు చెప్పాడు. ఆ తరువాత ఆయన ఒక పాత్రను పట్టుకొని శిష్యులతో ఇలా చెప్పాడు, “దీనిలోనిది త్రాగండి, దేవుడు మీ పాపాలు క్షమించేలాగున మీకొరకు చిందింపబడుతున్న కొత్తనిబంధన రక్తం. దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనుటకై దీనిని చేయ్యుడి.” అప్పుడు యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, “మీలో ఒకడు నన్ను పట్టిస్తాడు.” ఆ మాటకు శిష్యులు ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి ఎవరు అని ఆయనను అడిగారు. అందుకు యేసు ఇలా చెప్పాడు, “నేను ఎవనికి ఈ రొట్టె ముక్కను ఇవ్వబోతున్నానో అతడే నన్ను అప్పగిస్తున్నాడు.” ఆ రొట్టెను ఆయన యూదాకు ఇచ్చాడు. యూదా ఆ రొట్టె ముక్కను తీసుకొన్న తరువాత సాతాను వానిలోనికి ప్రవేశించాడు. యూదా ఆ చోటనుండి యేసును బంధించడంలో యూదా నాయకులకు సహాయం చెయ్యడానికి వెలుపలికి వెళ్ళాడు. అది రాత్రి సమయం. భోజనం అయిన తరువాత యేసునూ, ఆయన శిష్యులునూ ఒలీవల కొండకు వెళ్ళారు. యేసు వారితో ఇలా చెప్పాడు, “ఈ రాత్రి మీరందరూ నన్ను విడిచిపెడతారు, “నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదరిపోవును” అని రాయబడియున్నదని వారితో చెప్పాడు. పేతురు యేసుకు జవాబిస్తూ, “మిగిలిన అందరూ నిన్ను విడిచినా నేను నిన్ను విడువను!” అని చెప్పాడు. అప్పుడు పేతురుతో యేసు ఇలా అన్నాడు, “సాతాను మిమ్ములనందరినూ చెదరగొట్టాలని చూస్తున్నాడు, అయితే పేతురూ నీ విశ్వాసం తప్పిపోకుండునట్లు నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను, కోడి కూయకముందే నీవు నన్ను యెరుగనని మూడు సార్లు బొంకుతావు.” పేతురు ప్రభువుతో ఇలా అన్నాడు. “నేను చావవలసి వచ్చినా నేను నిన్ను యెరుగనని చెప్పను!” మిగిలిన శిష్యులందరూ ఆ విధంగానే చెప్పారు. అప్పుడు యేసు తన శిష్యులతో గెత్సెమనే అనే చోటుకి వెళ్ళాడు. సాతాను వారిని శోధించకుండునట్లు ఆయన వారిని ప్రార్థన చెయ్యమని చెప్పాడు. అప్పుడు యేసు తనకోసం ప్రార్థన చెయ్యడానికి వెళ్ళాడు. యేసు మూడు సార్లు ప్రార్థన చేసాడు. “నా తండ్రీ సాధ్యమైతే ఈ శ్రమల పాత్రను నా నుండి తొలగించు. అయితే ప్రజల పాపాలు క్షమించబడే మార్గం మరొకటి లేనియెడల నీ చిత్తమే జరుగును గాక.” యేసు యెంతో వేదన చెందాడు, ఆయన చెమట రక్తపు బిందువుల వలే కారింది. యేసుకు పరిచర్య చెయ్యడానికి దేవుడు తన దూతలను పంపాడు. ప్రార్థన ముగించిన ప్రతీ సారి యేసు తన శిష్యుల వద్దకు వచ్చినప్పుడు వారు నిద్రిస్తుండడం ఆయన చూచాడు. మూడవసారి ఆయన ప్రార్థించిన తరువాత ఆయన శిష్యుల వద్దకు వచ్చి, “లెండి, నన్ను అప్పగించే సమయం ఆసన్నం అయ్యింది.” అని వారితో చెప్పాడు. ఇస్కరియోతు యూదా మత నాయకులతో అక్కడికి వచ్చాడు, వారితో పాటు ఒక గొప్ప సమూహంకూడా ఉంది. వారు కత్తులతోనూ, బల్లెములతో ఉన్నారు. యూదా యేసు వద్దకు వచ్చి, “బోధకుడా, నీకు శుభం,” అని ఆయనకు ముద్దు పెట్టాడు. యూదానాయకులు యేసును బందించదానికి గుర్తుగా యూదా ఈ పని చేసాడు. అప్పడు యేసు ఇలా చెప్పాడు, “యూదా ఒక ముద్దుతో నీవు నన్ను పట్టిస్తున్నావు.” సైనికులు యేసును బంధిస్తుండగా పేతురు తన కత్తిని బయటకు తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవిని తెగనరికాడు. యేసు ఇలా చెప్పాడు, “నీ కత్తి తీసి వెయ్యి, నన్ను రక్షించడానికి ఒక సైన్యం కోసం నేను తండ్రిని అడిగియుండేవాడను, అయితే నేను తండ్రికి లోబడవలసి ఉంది.” అప్పుడు యేసు ఆ సైనికుడి చెవిని బాగు చేసాడు. అప్పుడు శిష్యులందరూ పారిపోయారు.
మత్తయి 26:57-27:26; మార్కు 14:53-15:15; లూకా 22:54-23:25; యోహాను 18:12-19:16 నుండి
మధ్య రాత్రి సమయంలో సైనికులు యేసును ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొని వెళ్ళారు, ప్రధాన యాజకుడు యేసును ప్రశ్నించాలని కోరాడు. పేతురు ఆయనను అనుసరిస్తూ ఉన్నాడు. సైనికులు యేసును ప్రధాన యాజకుని మందిరంలోనికి తీసుకొని వెళ్తుండగా పేతురు వెలుపట కూర్చుండి చలి కాచుకొంటున్నాడు.
ప్రధాన యాజకుని గృహంలో యూదా నాయకులు యేసును తీర్పు తీరుస్తున్నారు. ఆయనను గురించి అనేక తప్పుడు సాక్ష్యాలను తీసుకొని వచ్చారు. అయితే వారి మాటలు ఒకదానితో ఒకటి పొంతనలేకుండా ఉన్నాయి. అందుచేత యూదా నాయకులు ఆయనను దోషి అని దేనిలోనూ రుజువు చెయ్యలేకపోయారు. యేసు వారితో ఒక్క మాట కూడా పలుకలేదు.
చివరకు ప్రధాన యాజకుడు నేరుగా యేసుతో ఇలా అడిగాడు, “మాతో చెప్పు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన మెస్సీయవా?”
అందుకు యేసు, “నేను మెస్సీయను, నేను తండ్రి కుడిపార్శ్వమందు కూర్చోవడం, పరలోకం నుండి రావడం మీరు చూస్తారు.” అది విని ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకొన్నాడు, ఎందుకంటే యేసు పలికినదాని విషయంలో చాలా కోపగించుకొన్నాడు. అతడు ఇతర నాయకులతో బిగ్గరగా చెప్పాడు, “ఇతడు చేసిన వాటి విషయంలో మనకిక ఇతర సాక్ష్యాలతో పని లేదు, అయన దేవుని కుమారుడని చెప్పిన మాట మీరే విన్నారు. ఇతని గురించి మీ నిర్ణయం ఏమిటి?”
యూదా నాయకులందరూ ప్రధాన యాజకునితో, “ఇతను చావవలసి ఉంది!” అని జవాబిచ్చారు. అప్పుడు వారు యేసు కళ్ళకు గంతలు కట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయనను కొట్టారు, ఆయనను హేళన చేసారు. పేతురైతే ఇంటిముందు ఆవరణలో కూర్చుండి ఉన్నాడు. చిన్న బాలిక అతనిని చూసింది, ఆమె పేతురుతో ఇలా అంది, “నీవు యేసుతో ఉన్నవాడవు కదూ!” పేతురు దానిని త్రోసిపుచ్చాడు. తరువాత మరొక అమ్మాయి అదే మాట పేతురును అడిగింది. పేతురు మరల ఆ మాటను త్రోసిపుచ్చాడు. చివరిగా కొందరు వ్యక్తులు ఇలా అన్నారు, “నీవు యేసుతో ఉన్నవాడవని మాకు తెలుసు, ఎందుకంటే మీరిద్దరూ గలిలయవారు.”
అప్పుడు పేతురు, “ఈ వ్యక్తిని నేను యెరిగియుంటే దేవుడు నన్ను శపించును గాక!” పేతురు ఈ విధంగా ఒట్టుపెట్టు కొన్న వెంటనే కోడి కూసింది. యేసు తిరిగి పేతురు వైపు చూచాడు. పేతురు వెలుపలకు పోయి సంతాపపడి బిగ్గరగా ఏడ్చాడు. అదే సమయంలో యేసును అప్పగించిన యూదా నాయకులు యేసును శిక్షించడం చూసాడు. అతడు పూర్తి దుఃఖంతో నిండిపోయి వెలుపలికి పోయి తనను తాను చంపుకొన్నాడు.
పిలాతు ఆ రాష్ట్రానికి అధిపతి. రోమా ప్రభుత్వంలో ఆయన పని చేయుచున్నాడు. యూదా నాయకులు యేసును అతని వద్దకు తీసుకొని వచ్చారు. యేసును శిక్షించాలని, ఆయనను చంపాలని వారు పిలాతును అడిగారు. “నీవు యూదులకు రాజువా” అని అడిగాడు. యేసు ఇలా సమాధానం ఇచ్చాడు, “నీవు సత్యాన్నే పలికావు. అయితే నా రాజ్యం భూసంబంధమైనది కాదు. అలా అయినట్లయితే నా సేవకులు నా నిమిత్తం యుద్ధం చేస్తారు. దేవుని గురించి సత్యం చెప్పడానికి భూమి మీదకు వచ్చాను. సత్యాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరూ సత్యాన్ని వింటారు.” “సత్యం అంటే ఏమిటి?” అని పిలాతు యేసును అడిగాడు.
యేసుతో మాట్లాడిన తరువాత పిలాతు జనసమూహంలోనికి వెళ్లి, “ఈ వ్యక్తి చనిపోయేలా ఇతనిలో ఏ తప్పిదాన్ని నేను కనుగొనలేదు.” అని వారితో చెప్పాడు. అయితే యూదా నాయకులు, జన సమూహం బిగ్గరగా “సిలువ వెయ్యండి” అరిచారు. పిలాతు వారికి జవాబిచ్చాడు, “ఈయన ఏ తప్పిదాన్ని చెయ్యలేదు.” అందుకు వారి మరింత బిగ్గరగా కేకలు వేసాడు. అప్పుడు పిలాతు మూడవసారి ఇలా అన్నాడు, “ఆయనలో ఎటువంటి దోషమూ లేదు.”
ప్రజలలో కలవరం కలుగుతుందని పిలాతు భయపడ్డాడు. కనుక సైనికులు యేసును సిలువ వేయడానికి అనుమతి ఇచ్చాడు. రోమా సైనికులు ఆయనను కొరడాలతో కొట్టారు. ఆయనకు ఒక అంగీని తొడిగారు. ముళ్ళతో అల్లిన కిరీటాన్ని ఆయనకు ధరింప చేసారు. ఆయనను హేళన చేసారు, “చూడండి, యూదులకు రాజు!” అని పలికారు.
మత్తయి 27:27-61; మార్కు 15:16-47; లూకా 23:26-56;
యోహాను 19:17-42 నుండిసైనికులు యేసును హేళన చేసిన తరువాత, వారు ఆయనను సిలువను వెయ్యడానికి తీసుకొని వెళ్ళారు. ఆయన సిలువ మీద చనిపోయేలా ఆ సిలువను ఆయన మీద ఉంచారు. “కపాలం” అనే స్థలానికి యేసును తీసుకొని వచ్చారు, ఆయన చేతులను, కాళ్ళనూ సిలువకు మేకులతో కొట్టారు. అయితే యేసు, “తండ్రీ వారిని క్షమించు, ఎందుకంటే వారు చేయుచున్నది వారికి తెలియదు.” ఆయన తలకు పైగా వారు ఒక గుర్తును ఉంచారు. “యూదులకు రాజు” అని దాని మీద రాశారు. ఈ విధంగా రాయాలని పిలాతు చెప్పాడు.
యేసు వస్త్రాల విషయంలో సైనికులు చీట్లు వేసారు. వారు ఆ విధంగా చేసినప్పుడు, “వారు తమ మధ్య నా వస్త్రాలను గురించి చీట్లు వేస్తారు” అనే ప్రవచన నేరవేరింది. ఆ సమయంలో అక్కడ ఇద్దరు బందిపోటు దొంగలు ఉన్నారు, అదే సమయంలో సైనికులు వారిని కూడా సిలువ వేసారు. వారిని యేసుకు రెండువైపులా వారిని సిలువ వేశారు. ఆ ఇద్దరు దొంగలలో ఒకరు యేసును హేళన చేసాడు, అయితే మరొకడు అతనితో, “దేవుడు నిన్ను శిక్షిస్తాడని నీవు దేవునికి భయపడవా? మనం చేసిన చెడు కార్యాలను బట్టి ఈ శిక్ష మనకు తగినదే. ఈయనలో ఏ పాపమూ లేదు” అని చెప్పాడు. తరువాత యేసు వైపు తిరిగి, “యేసూ నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో” అని అడిగాడు. యేసు అతనికి ఇలా జవాబిచ్చాడు, “ఈ రోజున నీవు నాతో పరదైసులో ఉంటావు.”
యూదా మతపెద్దలూ, సమూహంలోని ఇతర ప్రజలు యేసును హేళన చేసారు. వారు ఆయన వైపు తిరిగి, “నీవు నిజముగా దేవుని కుమారుడవైతే సిలువనుండి కిందకు దిగుము, నిన్ను నీవు రక్షించుకో! అప్పుడు మేము నిన్ను విశ్వసిస్తాం” అని అన్నారు. అప్పుడు ఆ ప్రాంతం అంతటిలో అది మధ్యాహ్న సమయ అయినప్పటికీ ఆకాశం పూర్తిగా చీకటి అయ్యింది, పగలు మిట్టమధ్యాహ్నం చీకటి అయ్యింది. మూడు గంటల పాటు చీకటి అయ్యింది. అప్పుడు యేసు, “సమాప్తం అయ్యింది, అని తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను” అని బిగ్గరగా అరిచాడు. తరువాత ఆయన తన తలను వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆయన చనిపోయినప్పుడు భయంకరమైన భూకంపం కలిగింది, ప్రజలను దేవునికి మధ్య ఉన్న దేవాలయపు తెర పైనుండి కిందకు రెండుగా చీలిపోయింది
ఆయన మరణం ద్వారా మనుష్యులు దేవుని వద్దకు రాగలిగే మార్గాన్ని యేసు తెరచాడు. జరిగినదాన్నంతటినీ చూసిన అక్కడ ముఖ్య సైనికుడు, “నిజముగా ఇతడు దేవుని నిర్దోషి, ఈయన దేవుని కుమారుడు” అని చెప్పాడు. యోసేపు, నికోదేము అనే ఇద్దరు యూదా నాయకులు అక్కడికి వచ్చారు. యేసే మెస్సీయ అని వారు విశ్వసించారు. యేసు దేహాన్ని తమకు ఇవ్వాలని వారు పిలాతును మనవి చేసారు. యేసు దేహాన్ని వారు వస్త్రంతో చుట్టారు, రాతినుండి తొలిచిన ఒక సమాధిలో యేసు దేహాన్ని ఉంచడానికి వారు తీసుకొనివెళ్లారు. అప్పుడు వారు సమాధి యెదుట ఉన్న పెద్ద రాయిని తొలగించి సమాధిని తెరిచారు.
మత్తయి 27:62-28:15; మారు 16:1-11; లూకా 24:1-12; యోహాను 20:1-18 నుండి
సైనికులు యేసును సిలువ వేసిన తరువాత యూదా నాయకులు పిలాతుతో ఇలా చెప్పారు, “ఆ అబద్ధికుడు, యేసు మూడు రోజుల తరువాత మృతులలో నుండి తిరిగి లేస్తానని చెప్పాడు. శరీరాన్ని సమాధిలోనుండి శిష్యులు ఎత్తికొనిపోకుండా దానిని కాపాడాలి. వారు ఆ విధంగా చేస్తే, ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని చెపుతారు.”
పిలాతు ఇలా చెప్పాడు, “కొందరు సైనికులను తీసుకొని వెళ్ళండి, సమాధిని మీ చేతనైనంత వరకు భద్రపరచండి.” కనుక సమాధి మీద ఉన్న రాతి మీద ముద్ర వేసారు. దేహాన్ని ఎవరూ దొంగిలించకుండా సైనికులను కావలి యుంచారు.
యేసు చనిపోయిన మరుసటి రోజు సబ్బాతు దినం. ఏ ఒక్కరూ సబ్బాతు దినాన పని చెయ్యరు. కనుక యేసు స్నేహితులెవరూ సమాధి వద్దకు వెళ్ళలేదు. అయితే సబ్బాతు దినం మరుసటి రోజు ఉదయాన్నే అనేక మంది స్త్రీలు యేసు దేహాన్ని ఉంచిన సమాధి వద్దకు వెళ్ళడానికి సిద్దపడ్డారు. యేసు దేహానికి ఎక్కువ సుగంధ ద్రవ్యాలు పూయాలని కోరారు.
ఆ స్త్రీలు సమాధి వద్దకు రావడానికి ముందు సమాధి వద్ద గొప్ప భూకంపం కలిగింది. పరలోకం నుండి ఒక దూత వచ్చాడు. సమాధి ద్వారాన్ని మూసియుంచిన రాయిని తొలగించాడు. దాని మీద కూర్చుండి యున్నాడు. ఆ దూత మెరుపులా ప్రకాశమానంగా వెలిగిపోతున్నాడు. సమాధి వద్ద సైనికులు ఆ దూతను చూచారు. వారు చాలా భయపడ్డారు కనుక వారు చచ్చిన వారిలా నేల మీద పడిపోయారు.
ఆ స్త్రీలు సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆ దూత వారితో ఇలా చెప్పాడు, “భయపడకండి, యేసు ఇక్కడ లేడు, ఆయన చెప్పిన విధంగా మరణం నుండి తిరిగి లేచాడు! సమాధిలో చూడండి.” ఆ స్త్రీ యేసు దేహాన్ని ఉంచిన సమాధిలోనికి తొంగి చూసింది. ఆయన దేహం అక్కడ లేదు!
దూత ఆ స్త్రీతో ఇలా చెప్పాడు, “మీరు వెళ్ళండి, ‘మరణం నుండి యేసు తిరిగి లేచాడు, మీకు ముందుగా గలిలయకు వెళ్తాడని శిష్యులతో చెప్పండి.” ఆ స్త్రీలు మిక్కిలో ఆశ్చర్యపడ్డారు, ఆనందించారు. సంతోషకరమైన వార్తను శిష్యులకు చెప్పాడానికి వారు పరుగెత్తి వెళ్ళారు. సంతోషకరమైన వార్తను శిష్యులకు చెప్పడానికి వారు పరుగున వెళ్తుండగా యేసు వారికి ప్రత్యక్ష్యం అయ్యాడు. వారు ఆయన పాదాల వద్ద మొక్కారు. అప్పుడు యేసు ఇలా చెప్పాడు, “భయపడకండి. శిష్యులు గలిలయకు వెళ్ళమని చెప్పండి. ఆక్కడ వారు నన్ను చూస్తారు.”
మత్తయి 28:16-20; మార్కు 16:12-20; లూకా 24:13-53; యోహాను 20:19-23; అపొస్తలుల కార్యములు 1:1-11 నుండి
దేవుడు యేసును మృతులలో నుండి లేపిన దినాన్న ఆయన శిష్యులలో ఇద్దరు మార్గమధ్యలో తమ ఊరికి వెళ్తున్నారు. వారు నడుస్తున్నప్పుడు యేసుకు జరిగిన దానిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసే మెస్సీయ అని వారు తలంచారు. అయితే ఆయనను చంపివేశారు. ఇప్పుడు కొందరు స్త్రీలు ఆయనను లేచాడని చెపుతున్నారు. దేనిని వారు నమ్మాలో వారికి తెలియదు.
యేసు వారిని కలుసుకున్నాడు. వారితో కలిసి నడవడం ఆరంభించాడు. అయితే వారు ఆయనను గుర్తు పట్టలేదు. వారు దేనిని గురించి మాట్లాడుతున్నారు అని ఆయన వారిని అడిగాడు. గత కొద్ది రోజులుగా యేసుకు జరుగుతున్న దానిని గురించి మాట్లాడుతున్నట్టుగా వారు ఆయనతో చెప్పారు. యెరూషలెంలో జరుగుతున్న వాటిని గురించి తెలియని ఒక విదేశీయునితో వారు మాట్లాడుతున్నట్టు వారు తలంచారు.
మెస్సీయను గురించి దేవుని వాక్యం చెపుతున్న దానిని యేసు వారికి వివరించాడు. దుష్టులైన మానవులు మెస్సీయను శ్రమపెడతారనీ, ఆయనను చంపివేస్తారని చాలా కాలం క్రితం ప్రవక్తలు చెప్పారు. అయితే యేసు మూడవ రోజున తిరిగి సజీవుడుగా లేస్తాడనీ ప్రవక్తలు పలికారు.
వారు పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు వారిద్దరూ అక్కడ నిలిచి యుండాలని కోరారు. దాదాపు పొద్దుపోయిన సమయం. వారితో ఉండాలని యేసును వారు బలవంతం చేసారు. కనుక యేసు వారితో పాటు ఇంటిలోనికి వెళ్ళాడు. సాయంకాల భోజనం చెయ్యడానికి వారు కూర్చున్నప్పుడు యేసు ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించి దానిని విరిచాడు, వెంటనే ఆయన యేసు అని వారు గుర్తుపట్టారు. అయితే ఆ క్షణంలో ఆయన వారి మధ్యనుండి అదృశ్యడయ్యాడు.
ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు, “ఆయన నిజముగా యేసు! ఆయన మనకు దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు మన హృదయాలు సంతోషంతో ఉప్పొంగాయి!” వెంటనే వారు యెరూషలెంకు వారు వెళ్ళారు. వారు అక్కడికి చేరినప్పుడు “యేసు సజీవుడు! మేము ఆయనను కన్నులారా చూచాం!” అని వారితో చెప్పారు.
శిష్యులు మాట్లాడుకొంటుండగా, అకస్మాత్తుగా యేసు గదిలో వారి మధ్యకు ప్రత్యక్ష్యమయ్యాడు. “మీకు సమాధానం కలుగుతుంది గాక!” అని యేసు వారితో చెప్పాడు. ఆయన ఒక భూతం అని శిష్యులు తలంచారు. అయితే యేసు వారితో ఇలా చెప్పాడు, “మీరెందుకు భయపడుచున్నారు? నేను యేసును అని మీరెందుకు తలంచడం లేదు? నా చేతులు చూడండి, నా కాళ్ళను చూడండి. భూతాలకు నాకున్నట్టు దేహాలు ఉండవు.” ఆయన భూతం కాదని చూపించడానికి ఆయన తినడానికి ఆహారాన్ని అడిగాడు. వారు ఆయనకు ఒక చేప ముక్కను ఇచ్చారు. ఆయన దానిని భుజించాడు.
యేసు ఇలా చెప్పాడు, “నా గురించి దేవుని వాక్యం చెప్పిన ప్రతీది జరుగుతుంది. ఇది జరగవలసి యున్నదని నేను మీతో చెప్పాను.” దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం అయ్యేలా చేసాడు. ఆయన ఇలా చెప్పాడు, “చాలా కాలం క్రితం నేను మెస్సీయను, అనేక శ్రమలు అనుభావిస్తాను, చనిపోయి మృతులలో నుండి తిరిగి లేస్తానని ప్రవక్తలు రాసారు,”
“నా శిష్యులు దేవుని సందేశాన్ని ప్రచురిస్తారని కూడా ప్రవక్తలు రాసారు. ప్రతిఒక్కరు పశ్చాత్తాపపడాలని చెపుతారు. వారు పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు. శిష్యుల ఈ సందేశాన్ని మొదట యెరూషలెంలో ప్రకటించడం ఆరంభిస్తారు. అన్ని ప్రాంతాలలోని ప్రతీ ప్రజాగుంపు వద్దకు వారు వెళ్తారు. నేను చెప్పిన, చేసిన ప్రతీ దానికీ, నాకు జరిగిన ప్రతీదానికీ మీరు నాకు సాక్ష్యులుగా ఉంటారు.
తరువాత నలుబది రోజులలో, అనేక మార్లు యేసు శిష్యులందరికీ కనిపించాడు. ఒకసారి, ఆయన 500 మంది ప్రజలకు కూడా కనిపించాడు. ఆయన సజీవుడిగా అనేక మార్లు తన శిష్యులకు రుజువు పరచుకొన్నాడు! దేవుని రాజ్యం గురించి వారికి బోధించాడు. యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు, “పరలోకమందునూ, భూమిమీదనూ నాకు సర్వాదికారం ఇవ్వబడియున్నది. కనుక నేనే మీకిది చెపుతున్నాను: సమస్త దేశములకు వెళ్ళండి. సమస్త ప్రజలను శిష్యులనుగా చెయ్యండి. తండ్రి యొక్కయూ, కుమారుని యొక్కయూ, పరిశుద్ధాత్మ యొక్కయూ నామములోనికి బాప్తిస్మం ఇవ్వాలి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించాలి, జ్ఞాపకం ఉంచుకోండి, సదాకాలం నేను మీతో ఉంటాను.”
మృతులలో నుండి తిరిగి లేచిన నలుబది రోజుల తరువాత ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు, “నా తండ్రి శక్తిని అనుగ్రహించేవరకు మీరు యెరూషలెంలో నిలిచియుండండి. ఆయన మీ మీదకు పరిశుద్ధాత్మను పంపిస్తాడు.” అప్పుడు ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఒక మేఘం ఆయనను కమ్ముకొంది. ప్రభువైన యేసు పరలోకం తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు సమస్తాన్ని పరిపాలించదానికి కూర్చుండి యున్నాడు.
అపొస్తలుల కార్యములు 2 నుండి
యేసు పరలోకానికి ఆరోహణుడైన తరువాత, యేసు తమకు ఆజ్ఞాపించిన విధంగా ఆయన శిష్యులు యెరూషలెంలో నిలిచిపోయారు. విశ్వాసులు ప్రార్థన చెయ్యడానికి నిరంతరం కలుసుకొంటూ ఉండేవారు. ప్రతీ సంవత్సరం, పస్కాపండుగ జరిగిన తరువాత 50 రోజులకు యూదులు పెంకోస్తు అనే ఒక ప్రాముఖ్యమైన పండుగను ఆచరించేవారు. ఈ పెంతెకోస్తు పండుగ యూదులు గోదుమల పంటకోత సందర్భంగా వచ్చేది. ప్రపంచం నలుమూలల నుండి యూదులు యెరూషలెంకు వచ్చి కలిసి పెంతెకోస్తు పండుగను ఆచరించేవారు. ఈ సంవత్సరం యేసు పరలోకానికి ఆరోహణుడైన తరువాత పెంతెకోస్తు పండుగ వచ్చింది.
విశ్వాసులందరూ కలిసి ఉన్నప్పుడు, అకస్మాత్తుగా వారు ఉన్న ఇల్లు ఒక బలమైన గాలి శబ్దంతో నిండిపోయింది. అగ్ని నాలుకల వలే విశ్వాసులందరి తలలమీద నిలిచినట్లు కనిపించింది. వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఇతర భాషలలో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఈ భాషలు మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడు వారిని బలపరచాడు.
యెరూషలెంలో ఉన్న ప్రజలు ఈ శబ్దాన్ని వినినప్పుడు జరుగుతున్నదానిని చూడదానికి సమూహాలుగా వచ్చారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను విశ్వాసులు ప్రకటించడం వారు విన్నారు. ఈ మాటలను వారు తమ సొంత భాషలలో వింటున్నందుకు వారు చాలా ఆశ్చర్య పోయారు.
శిష్యులు మద్యపానంతో నిండిపోయారని కొందరు చెప్పారు. అయితే పేతురు నిలిచి వారితో ఇలా చెప్పాడు, “నా మాట వినండి! ఈ మనుష్యులు మద్యంతో నిండి ఉండలేదు. మీరు చూస్తున్నది, యోవేలు ప్రవక్త చెప్పినదే ఇప్పుడు జరుగుతుంది. దేవుడు ఇలా చెప్పాడు, “అంత్య దినములలో నేను నా ఆత్మను కుమ్మరింతును.”
“ఇశ్రాయేలు ప్రజలారా, యేసు అను మనుష్యుడు ఆయనను కనుపరచుకోడానికి అనేక అద్భుత కార్యాలు చేసాడు. దేవుని శక్తి చేత అనేక గొప్ప కార్యాలు చేసాడు. మీకిది తెలుసు. ఈ కార్యాలు మీరు చూచారు. అయితే మీరు ఆయనను సిలువ వేసారు!” “ప్రభువైన యేసు చనిపోయాడు, అయితే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ప్రవక్త రాసిన వచనం నెరవేర్పు జరిగింది: ‘నీ పరిశుద్ధుని నీవు సమాధిలో కుళ్ళు పట్టనీయవు.’ తండ్రియైన దేవుడు మృతులలో నుండి ఆయన సజీవునిగా లేపిన దానికి మేము సాక్ష్యులం.”
“తండ్రియైన దేవుడు తన కుడిపార్శ్వమున ఆయనను కూర్చుండపెట్టడం ద్వారా ఆయనను ఘనపరచాడు. ప్రభువైన యేసు తాను వాగ్దానం చేసిన విధంగా తన పరిశుద్ధాత్మను మన వద్దకు పంపాడు. మీరు చూచుచున్న, వినుచున్న కార్యములను పరిశుద్దాత్మ జరిగించుచున్నాడు.” “మీరు యేసు అను ఈ మనుష్యుని సిలువ వేశారు. అయితే దేవుడు ఈయనను సమస్తము పైన ప్రభువుగానూ, మెస్సీయగానూ చేసాడు.
ప్రజలు పేతురు మాటలు వినుచున్నారు, ఆయన చెపుతున్న మాటలను బట్టి వారు లోతుగా ఒప్పించబడ్డారు. కనుక వారు పేతురునూ, మిగిలిన అపొస్తలులను అడిగారు, “సహోదరులారా, మేమేమి చెయ్యాలి?”
పేతురు వారికి ఇలా జావాబు చెప్పాడు, “మీలో ప్రతీ ఒక్కరూ దేవుడు మిమ్మును క్షమించునట్లు మీ పాపముల విషయంలో పశ్చాత్తాప పడాలి. యేసు క్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహిస్తాడు. దాదాపు 3,000 మంది ప్రజలు పేతురు బోధను విశ్వసించారు. ప్రభువైన యేసుకు శిష్యులు అయ్యారు. వారి బాప్తిస్మం పొంది యెరూషలెం లోని సంఘంలో భాగం అయ్యారు.
విశ్వాసూ అపొస్తలుల బోధను నిరంతరం వింటూ వచ్చారు. వారు తరచుగా కలుస్తూ వస్తున్నారు. తరచుగా వారు ఒకరికొకరు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. వారు కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నారు. వారికున్న సమస్తాన్ని ఒకరికొకరు పంచుకొంటున్నారు. పట్టణంలో ప్రతీ ఒక్కరూ వీరిని గురించి మంచిగా మాట్లాడుతున్నారు. ప్రతీ దినం అనేకమంది విశ్వాసులుగా మారుతున్నారు.
అపొస్తలుల కార్యములు 6:8-8:5; 8:26-40 నుండి
ఆదిమ సంఘం క్రైస్తవులలో ఒక ముఖ్య నాయకుడు స్తెఫను. ప్రతీ ఒక్కరూ ఆయనను గౌరవించేవారు. పరిశుద్ధాత్మ వారికి అధిక శక్తినీ, జ్ఞానాన్నీ ఇచ్చాడు. స్తెఫను అనేక అద్భుతాలు చేసాడు. యేసు నందు విశ్వాసముంచాలని స్తెఫను బోధిస్తున్నప్పుడు అనేకులైన ప్రజలు యేసునందు విశ్వాసముంచారు.
ఒక రోజున స్తస్టేఫను యేసును గురించి బోధిస్తున్నాడు, యేసు నందు విశ్వాసం ఉంచని కొందరు యూదులు అక్కడికి వచ్చారు. అతనితో వాదించడం ఆరంభించారు. వారు చాలా కోపంగా ఉన్నారు. వారు మత నాయకుల వద్దకు వెళ్లి స్తెఫను గురించి అబద్దాలు చెప్పారు. వారు ఇలా చెప్పాడు, “ఇతడు దేవుని గురించీ మోషే గురించీ దుష్టమైన మాటలు పలుకుతుండడం మేము విన్నాం!” కనుక మతనాయకులు స్తెఫనును బంధించి ప్రధానయాజకుని వద్దకూ, ఇతర యూదా నాయకుల వద్దకూ తీసుకొని వచ్చారు. ఇంకా అనేకమంది అబద్దపు సాక్ష్యులు అతనికి వ్యతిరేకంగా అబద్దాలు చెప్పారు.
ప్రధాన యాజకుడు స్తెఫనును ఇలా అడిగాడు, “నీ గురించి వీరు చెప్పినవి సత్యములేనా?” ప్రధాన యాజకునికి జవాబు ఇవ్వడానికి స్తెఫను అనేక సంగతులు చెప్పడం ఆరంభించాడు. అబ్రాహాము కాలం మొదలుకొని యేసు కాలం వరకూ దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం అనేక అద్భుత కార్యాలు చేసాడని స్తెఫను వారితో చెప్పాడు. అయితే ప్రజలు ఎల్లప్పుడూ దేవుని అవిధేయత చూపిస్తూ వచ్చారు. “మీరు మూర్ఖులుగానూ దేవునికి తిరుగుబాటుదారులుగానూ ఉన్నారు. మీ పితరులు అన్ని సమయాలలో దేవునిని తృణీకరించి, ఆయన ప్రవక్తలను చంపిన విధంగా మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను తృణీకరించారు. వారు చేసిన దానికంటే దుర్మార్గపు కార్యం చేసారు. మీరు మెస్సీయను చంపారు!”
మతనాయకులు ఈ సంగతి వినినప్పుడు, వారు చాలా కోపగించుకొన్నారు, వారి చెవులు మూసుకొని గట్టిగా అరచారు. స్తెఫనును పట్టణం వెలుపలికి ఈడ్చుకొనిపోయి అతనిని చంపడానికి అతని మీద రాళ్ళు రువ్వారు. స్తెఫను చనిపోతున్నప్పుడు అతడు బిగ్గరగా అరిచాడు, “యేసూ నా ఆత్మను నీ వద్దకు చేర్చుకో.” అతడు తన మోకాళ్ళమీద పడి మరల గట్టిగా అరచాడు, “ప్రభూ, ఈ పాపాన్ని వారిమీద మోపకుము.” అప్పుడు తన ప్రాణాన్ని విడిచాడు.
ఆ దినం, యెరూషలెంలోని అనేకులు యేసు అనుచరులను హింసించడం ఆరంభించారు. కనుక విశ్వాసులు ఇతర ప్రదేశాలను పారిపోయారు. అయితే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వారు వెళ్ళిన ప్రతీ స్థలంలోనూ యేసును గురించి ప్రకటించారు. ఫిలిప్పు అనే విశ్వాసి ఉండేవాడు. అతడు ఇతర విశ్వాసుల వలెనే అతడు యెరూషలెంనుండి సమరయ అనే ప్రాంతానికి పారిపోయాడు. అక్కడ యేసును గురించి బోధించాడు. అతడు చెప్పిన బోధను అనేకులు విశ్వసించారు, రక్షణ పొందారు. ఒకరోజు దేవుని దూత ఫిలిప్పును అరణ్యప్రదేశంలోని ఒక మార్గానికి వెళ్ళమని చెప్పాడు. ఒకడు తన రధం మీద ప్రయాణం చెయ్యడం చూసాడు. అతడు ఇతియోపియా దేశానికి సంబంధించిన ముఖ్యమైన అధికారి. అతని వద్దకు వెళ్లి అతనితో మాట్లాడాలని పరిశుద్ధాత్మ చెప్పాడు.
కాబట్టి ఫిలిప్పు రధం వద్దకు వెళ్ళాడు. ఇతియోపీయుడైన అధికారి దేవుని వాక్యాన్ని చదవడం ఫిలిప్పు విన్నాడు. యెషయా ప్రవక్త రాసిన వచన భాగాన్ని అతడు చదువుతున్నాడు. అతడు “అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను. ఆ తరము వారిలో అతని గురించి ఆలో చించినవారెవరు?“ అను భాగాన్ని చదువుతున్నాడు.
ఫిలిప్పు అతనిని ఇలా అడిగాడు, “నీవు చదువుతున్నదానిని నీవు అర్థం చేసుకొంటున్నావా?” అందుకతడు ఇలా జవాబిచ్చాడు, “లేదు, ఒకరు నాకు వివరించకపోతే నాకు ఎలా అర్థం అవుతుంది, దయచేసి పైకి రమ్ము, నా ప్రక్కన కూర్చోనుము. ప్రవక్త తన గురించి మాట్లాడుచున్నాడా? లేక మరొకరి గురించి మాట్లాడుచున్నాడా?”
ఫిలిప్పు రథంలోనికి వెళ్ళాడు, అతనితో కూర్చున్నాడు. అప్పుడు యెషయా ప్రవక్త ప్రభువైన యేసును గురించి రాస్తున్నాడని ఐతియోపీయుడైన అధికారికి వివరించాడు. దేవుని వాక్యంలోని అనేక ఇతర భాగాలను గురించి ఫిలిప్పు చెప్పాడు. ఈ విధంగా ఆ అధికారికి ఫిలిప్పు యేసును గురించిన సువార్తను ప్రకటించాడు.
ఫిలిప్పు, ఆ అధికారితో కలసి ప్రయాణిస్తుండగా వారు ఒక నీరున్న ప్రదేశానికి వచ్చారు. అప్పుడు ఆ ఐతియోపీయుడు ఇలా అన్నాడు, “చూడుము! ఇక్కడ కొంత నీరు ఉంది! నేను బాప్తిస్మం తీసుకోవచ్చునా?” అతడు తన రధమును నిలిపాడు. కనుక వారు ఆ నీటి వద్దకు వెళ్ళారు, ఫిలిప్పు ఆ అధికారికి బాప్తిస్మం ఇచ్చాడు. వారు నీటి నుండి వెలుపలికి వచ్చినప్పుడు, అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ ఫిలిప్పును మరొక స్థలానికి కొనిపోయాడు. అక్కడ ఫిలిప్పు ప్రభువైన యేసును గురించి ప్రకటిస్తూ వచ్చాడు. ఇతియోపీయుడు తన ఇంటి వైపుకు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. యేసును కనుగొన్నందుకు అతడు అధిక సంతోషాన్ని పొందాడు.
అపొస్తలుల కార్యములు 8:3; 9:1-31; 11:19-26; 13:1-3 నుండి
సౌలు అనే ఒక వ్యక్తి ఉండేవాడు, అతడు యేసు నందు విశ్వాసం ఉంచలేదు. అతడు యువకునిగా ఉన్నప్పుడు, స్తెఫనును చంపినవారి వస్త్రాలకు కావలి ఉన్నాడు. తరువాత విశ్వాసులను హింసించాడు. యెరూషలెంలో ఇంటి ఇంటికి వెళ్లి స్త్రీ పురుషులను బంధించి వారిని చెరసాలలో వేస్తున్నాడు. అప్పుడు ప్రధాన యాజకులు దమస్కు అనే పట్టణానికి వెళ్ళడానికి సౌలుకు అనుమతి ఇచ్చారు. అక్కడ క్రైస్తవులను బంధించి వారిని యెరూషలెంకు తీసుకొని రావాలని చెప్పాడు.
కనుక సౌలు దమస్కు వెళ్ళడం ప్రారంభించాడు. ఆ పట్టణానికి చేరుతున్నప్పుడు ఆకాశంనుండి ప్రకాశమైన వెలుగు అతని చుట్టూ వెలిగింది. సౌలు కింద పడిపోయాడు. అప్పుడు సౌలు ఒక స్వరాన్ని విన్నాడు, “సౌలా! సౌలా! నీవేల నన్ను హింసించుచున్నవు?” అందుకు సౌలు, “ప్రభువా నీవు ఎవరవు?” అని ప్రభువును అడిగాడు. యేసు ఇలా జవాబిచ్చాడు, “నీవు హింసించుచున్న యేసును!”
సౌలు పైకి లేచినపుడు, తాను ఎవరినీ చూడలేకపోయాడు. అతని స్నేహితులు అతనిని దమస్కులోనికి నడిపించారు. సౌలు మూడు రోజులు ఏమియూ తినకనూ, ఏమియూ తాగకయూ ఉన్నాడు.
దమస్కులో అననియ అనే ప్రభువు శిష్యుడు ఉన్నాడు. దేవుడు అననియతో, “సౌలు ఉన్న ఇంటికి వెళ్ళుము, అతడు తిరిగి చూపు పొందునట్లు అతని మీద చేతులుంచి ప్రార్థన చెయ్యి” అని చెప్పాడు. అయితే అననియ దేవునితో ఇలా చెప్పాడు, “ప్రభూ ఈ మనిషి విశ్వాసులను హింసించాడని నేను విన్నాను.” అందుకు దేవుడు, “నీవు వెళ్ళుము, ఇతడు యూదులకునూ, ఇతర ప్రజలకునూ నా నామమును ప్రకటించడానికి నేను ఎన్నుకొన్న నా సాధనం. నా నామము నిమిత్తం అనేక శ్రమలను భరిస్తాడు.”
కనుక అననియ సౌలు వద్దకు వెళ్ళాడు. అతని మీద చేతులుంచాడు. ఇలా చెప్పాడు, “నీ మార్గంలో నీకు కనిపించిన ప్రభువైన యేసు నీవు చూపు పొందేలా నన్ను నీ వద్దకు పంపాడు, పరిశుద్దాత్ముడు నిన్ను నింపుతాడు.” వెంటనె సౌలు చూపు పొందాడు. అప్పుడు అననియ సౌలుకు బాప్తిస్మం ఇచ్చాడు. అప్పుడు సౌలు ఆహారాన్ని తీసుకొన్నాడు, తిరిగి బలాన్ని పొందాడు.
వెంటనే సౌలు దమస్కులోని యూదులకు బోధించడం ఆరంభించాడు. సౌలు ఇలా బోధించాడు, “యేసు దేవుని కుమారుడు!” యూదులు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే సౌలు విశ్వాసులను చంపడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు యేసు నందు విశ్వాసం ఉంచాడు! సౌలు యూదులతో వాదించాడు. యేసు మెస్సీయ అని వారికి చూపించాడు.
అనేక సంవత్సరాల తరువాత, యూదులు సౌలును చంపాలని ప్రణాళిక వేసారు. పట్టణ ద్వారాల వద్ద అతనిని పట్టుకొని చంపాలని కోవాలని వారు కొందరిని పంపారు. అయితే సౌలు ఈ పన్నాగాన్ని గురించి విన్నాడు, సౌలు తప్పించుకోడానికి అతని స్నేహితులు సౌలుకు సహాయం చేసారు. ఒక రాత్రి పట్టణ ప్రాకారం నుండి ఒక బుట్టలో ఉంచి తాళ్ళతో అతనిని దించివేసారు. సౌలు దమస్కు నుండి తప్పించుకొన్న తరువాత యేసును గురించి ప్రకటించడం కొనసాగించాడు.
సౌలు అపొస్తలులను కలుసుకోడానికి యెరూషలెం వెళ్ళాడు. అయితే వారు సౌలును గురించి భయపడ్డారు. అప్పుడు బర్నబా అను ఒక విశ్వాసి సౌలును అపొస్తలుల వద్దకు తీసుకొని వెళ్ళాడు. దమస్కులో సౌలు ధైర్యంగా బోధించాడని వారికి చెప్పాడు. దాని తరువాత అపొస్తలులు సౌలును అంగీకరించారు.
యెరూషలెంలో శ్రమలను బట్టి చెదరిపోయిన కొందరు విశ్వాసులు దూరంలో ఉన్న అంతియొకయ పట్టణానికి పారిపోయారు. అక్కడ యేసును గురించి బోధించారు. అంతియొకయలో ఉన్న వారు యూదులు కాదు. అయితే మొట్టమొదటిసారి వారిలో అనేకులు విశ్వాసులు అయ్యారు. బర్నబా, సౌలు అక్కడ నూతన విశ్వాసులకు యేసును గురించి బోధించారు, సంఘాన్ని బలపరచారు. అతియొకయలో ఉన్న యేసు విశ్వాసులు మొట్టమొదట “క్రైస్తవులుగా” పిలువబడ్డారు.
ఒక రోజును, అంతియొకయలోని క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు వారితో ఇలా చెప్పాడు, “నేను పిలిచిన పని చెయ్యడానికి నా కొరకు బర్నబానూ, సౌలునూ ప్రత్యేక పరచండి.” కనుక అంతియొకయలోని సంఘం వారి మీద చేతులుంచారు. అప్పుడు వారు బర్నబానూ, సౌలునూ అనేక ఇతర ప్రాంతాలకు పంపారు. బర్నబా, సౌలు అనేక ఇతర ప్రజా గుంపులకు బోధించారు. అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు.
అపొస్తలుల కార్యములు 16:11-40 నుండి
రోమా దేశం అంతా ప్రయాణం చేస్తుండగా అతని రోమా పేరును “పౌలు” వినియోగించడం ఆరంభించాడు. “పౌలు” అతని స్నేహితుడు సీల తో కలిసి ఒక రోజున ఫిలిప్పు పట్టణానికి యేసును గురించిన సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. వారు ఒక నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ కొందరు ప్రార్థన చెయ్యడానికి కూడుకొన్నారు. అక్కడ లూదియ అనే ఒక స్త్రీని కలుసుకొన్నారు. ఆమె ఒక వ్యాపారస్తురాలు. ఆమె దేవుణ్ణి ప్రేమించింది, ఆయన ఆరాధిస్తుంది.
యేసును గురించిన వార్త విని విశ్వసించడానికి దేవుడు లూదియను బలపరచాడు. పౌలు, సీల ఆమెకునూ, ఆమె కుటుంబానికీ బాప్తిస్మం ఇచ్చారు. వారు తన ఇంటికి రావాలని ఆమె వారిని కోరింది. కనుక వారు అక్కడ ఉన్నారు. యూదులు ప్రార్థించే చోట పౌలు, సీల తరచుగా వారిని కలుస్తున్నారు. ప్రతీ దినం వారు అక్కడికి నడిచి వెళ్తున్నప్పుడు ఒక బానిస బాలిక దయ్యముతో నిండి వారిని అనుసరిస్తూ ఉండేది. ఆమె ప్రజల భవిష్యత్తును ముందుగా ఊహించి చెపుతుండేది. తద్వారా ఆమె సోది చెప్పడం ద్వారా తన యజమానులకు అధికమైన డబ్బును సంపాదిస్తూ ఉండేది.
ఆ బానిస బాలిక వారు నడుస్తున్నప్పుడు తరచుగా, “వీరు సజీవుడైన దేవుని సేవకులు. వారు మీకు రక్షణ సువార్తను బోధించుచున్నారు.” ఈ విధంగా ఆమె తరచుగా చెయ్యడం ద్వారా పౌలు కోపగించుకొన్నాడు. చివరిగా ఒక రోజున ఆ బానిస బాలిక అరుస్తుండగా పౌలు ఆమె వైపు తిరిగి ఆమెలో ఉన్న దయ్యంతో, “యేసు నామంలో ఈమెలోనుండి బయటికి రమ్ము.” అని గద్దించాడు. వెంటనే ఆమెలో ఉన్న దయ్యము ఆమెను విడిచిపెట్టింది.
ఆ బాలిక యజమాని జరిగిన దానిని బట్టి చాలా కోపగించుకొన్నాడు! దయ్యము లేక పోవడం చేత ఆ బానిస బాలిక ప్రజల భవిష్యత్తు విషయంలో సోది చెప్పలేదు అని యజానులు గుర్తించారు. దానిని బట్టి ప్రజలు తమకు జరుగుతున్నదానిని గురించి సోది చెప్పడం వల్ల తమకు కలిగే లాభసాధనం వారికి ఇక రాదు.
కనుక ఆ బాలిక యజమానులు పౌలునూ, సీలనూ రోమా అధికారుల వద్దకు తీసుకొని వెళ్ళారు. వారు పౌలునూ సీలనూ కొట్టారు, వారిద్దరినీ చెరసాలలో వేసారు. వారు పౌలునూ, సీలను చెరసాలలో ఉంచారు, వారికి ఎక్కువమంది రక్షక భటులను ఉంచారు. వారి కాళ్ళకు బొండలు బిగించి బంధించారు. అయితే మధ్య రాత్రి సమయంలో పౌలు, సీలలు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు.
అకస్మాత్తుగా ఒక భయంకరమైన భూకంపం కలిగింది! చెరసాల తలుపులు తెరచుకొన్నాయి, ఖైదీల గొలుసులు తెగిపోయాయి. అప్పుడు చెరసాల అధికారి మేల్కొన్నాడు. చెరసాల తలుపులు తెరచుకోవడం చూచాడు. ఖైదీలందరూ పారిపోయారని తలంచాడు. తాను ఖైదీలు పారిపోడానికి అనుమతించానని తలంచి రోమా అధికారులు తనను చంపుతారని భయపడ్డాడు. కనుక తనను తాను చంపుకోవాలని చూచాడు. అయితే పౌలు, “ఆగుము! నిన్ను నీవు చంపుకోవాల్సిన అవసరం లేదు. మేమందరం ఇక్కడే ఉన్నాం” అని బిగ్గరగా అరిచాడు.
చెరసాల అధిపతి భయంతో వణుకుతూ పౌలు, సీల వద్దకు వచ్చాడు. “రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యాలి?” అని వారిని అడిగాడు. పౌలు ఇలా జవాబిచ్చాడు, “ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారునూ రక్షణ పొందుదురు.” ఆ చెరసాల అధికారి వారిద్దరిని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. వారి గాయాలను బాగుచేసాడు. అతని ఇంటిలోని ప్రతీ ఒక్కరికీ పౌలు దేవుని గురించిన సువార్త చెప్పాడు.
చెరసాల అధికారి, అతని కుటుంబం యేసు నందు విశ్వాసముంచారు. కనుక పౌలు, సీల వారికి బాప్తిస్మం ఇచ్చారు. అప్పుడతడు వారికి ఆహారాన్ని పెట్టాడు. వారు కలిసి ఆనందించారు. తరువాత దినం పట్టణపు అధికారులు పౌలు, సీలలను చెరసాలనుండి బయటకు తీసుకొని వచ్చి తమ పట్టణాన్ని విడిచి వెళ్ళమని చెప్పారు. పౌలు, సీల లూదియాను, ఇతర స్నేహితులను దర్శించి ఫిలిప్పు పట్టణాన్ని విడిచిపెట్టారు. యేసును గురించిన మంచి వార్త ఆ ప్రాంతం అంతా వ్యాపించించింది. సంఘం ఎదుగుతుంది.
పౌలూ, ఇతర క్రైస్తవ నాయకులూ అనేక నగరాలకు ప్రయాణం చేసారు. యేసును గురించిన మంచి వార్తను అనేకులకు ప్రకటించారు, బోధ చేసారు. సంఘాలలోని విశ్వాసులను ప్రోత్సహించడానికీ, బోధ చెయ్యడానికీ వారికి అనేక పత్రికలు కూడా రాసారు.
ఆదికాండం 1-3; 14, 22, నిర్గమ 12, 20; 2 సమూయేలు 7; హెబ్రీ 3:1-6, 4:14-15:10, 7:1-8:13, 9:11-10:18; ప్రకటన 21 నుండి
దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు, సమస్తం సంపూర్ణంగా ఉంది. పాపం లేదు. ఆదాము, హవ్వ ఒకరిపట్ల ఒకరు ప్రేమతో ఉన్నారు. వారు దేవుణ్ణి ప్రేమించారు. వ్యాధి లేదు, మరణం లేదు. ఈ రీతిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. సాతాను సర్పం ద్వారా హవ్వతో మాట్లాడాడు. ఆమెను మోసం చెయ్యాలని వాడు కోరాడు. అప్పుడు ఆమెయూ, ఆదామునూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసారు. వారు పాపం చేసారు కాబట్టి భూమి మీద ఉన్నవారందరి మీదకు మరణం వచ్చింది.
ఆదాము, హవ్వ పాపం చేసారు కాబట్టి, మరింత దారుణమైన ఫలితం కలిగింది. వారు దేవునికి శత్రువులయ్యారు. దాని ఫలితంగా అప్పటినుండి ప్రతీ మానవుడు పాపం చేసారు. ప్రతీ వ్యక్తి జన్మనుండి దేవునికి శత్రువు అయ్యారు. ప్రజలకు, దేవునికి మధ్య సమాధానం లేదు. దేవుడు సమాధం కలిగించాలని కోరాడు.
హవ్వ సంతానం సాతాను తలను చితకగొడతాడని దేవుడు వాగ్దానం చేసాడు. సర్పం ఆయన మడెమె మీద కొడతాడని చెప్పాడు. అంటే సాతాను మెస్సీయను చంపాలని చూసాడు. అయితే దేవుడాయనను తిరిగి లేపుతాడు. తరువాత మెస్సీయ సాతాను శక్తిని శాశ్వత కాలం తీసివేస్తాడు. అనేక సంవత్సారాల తరువాత ఆ మెస్సీయాయే యేసు అని దేవుడు చూపించాడు.
దేవుడు తాను పంపబోవు జలప్రళయంనుండి కాపాడుకోవడానికి ఒక ఓడను తయారు చేసుకొమ్మని దేవుడు నోవాహుతో చెప్పాడు. ఆయన యందు విశ్వాసముంచిన వారిని ఆయన ఈ విధంగా రక్షించాడు. ప్రతి ఒక్కరూ దేవుడు ఇచ్చే మరణ శిక్షకు పాత్రులే. ఎందుకంటే వారు పాపం చేసారు. అయితే దేవుడు ఆయన యందు విశ్వాసముంచు ప్రతిఒక్కరిని రక్షించడానికి తన కుమారుడైన యేసును ఈ లోకానికి పంపించాడు.
అనేక వందలాది సంవత్సరాలు, యాజకులు దేవునికి బలులు అర్పిస్తూ వచ్చారు. అయితే ఆ బలులు వారి పాపాలను క్షమించలేవు. యేసు గొప్ప ప్రధాన యాజకుడు. యాజకులు చేయలేని దానిని ఆయన చేసాడు. ప్రతిఒక్కరి పాపాన్ని తీసివేయడానికి ఆయన తన్నుతాను బలిగా అర్పించుకొన్నాడు. మనుష్యులందరి పాపాలకు దేవుని శిక్షను ఆయన పొందడానికి అంగీకరించాడు. ఈ కారణంచేత యేసు ప్రధానయాజకునిగా సంపూర్ణుడు.
దేవుడు అబ్రాహాముతో ఇలా చెప్పాడు, “నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనాంగమును ఆశీర్వదిస్తాను.” ప్రభువైన యేసు ఈ అబ్రాహాము సంతానం. యేసు నందు విశ్వాస ముంచిన ప్రతీ ఒక్కరిని తమ పాపాలనుండి దేవుడు రక్షించిన కారణంగా ఈ సమస్త జనాంగమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ ప్రజలు యేసునందు విశ్వాసముంచినప్పుడు దేవుడు వారిని అబ్రాహాము సంతానంగా వారిని యెంచుతాడు.
తన సొంత కుమారుడు ఇస్సాకును ఆయనకు బలిగా అర్పించాలని దేవుడు అబ్రాహాముకు చెప్పాడు. అయితే దేవుడు ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రెపిల్లను అనుగ్రహించాడు. మనం అందరం మన పాపాలకు శిక్షను పొందడానికి అర్హులం! అయితే మన స్థానంలో మనకు బదులుగా బలిగా చనిపోడానికి దేవుడు తన ఏకైక కుమారుడైన యేసును మనకోసం అనుగ్రహించాడు. ఆ కారణంగా ప్రభువైన యేసును దేవుని గొర్రెపిల్ల అని పిలుస్తాం.
ఐగుప్తు మీద దేవుడు చివరి తెగులును పంపించినప్పుడు ప్రతీ ఇశ్రాయేలు కుటుంబం ఒక గొర్రెపిల్లను చంపాలని ఆయన చెప్పాడు. గొర్రెపిల్లలో ఎటువంటి లోపమూ ఉండకూడదు. అప్పుడు దాని రక్తాన్ని వారు తమ ద్వారాల మీద, ప్రక్కల ప్రోక్షించాలి. దేవుడు ఆ రక్తాన్ని చూచినప్పుడు ఆ గృహాలను ఆయన దాటిపోయాడు. వారిలో జ్యేష్టసంతానాన్ని సంహరించలేదు. ఇది జరిగినప్పుడు దేవుడు దీనిని పస్కా అని పిలిచాడు.
యేసు పస్కా గొర్రెపిల్లలా ఉన్నాడు. ఆయన ఎన్నడూ పాపం చెయ్యలేదు. కనుక ఆయనలో ఏ దోషమూ లేదు. పస్కాపండుగ సమయంతో ఆయన చనిపోయాడు. యేసునందు విశ్వాసముంచిన వారెవరైనా ఆ వ్యక్తి పాపం కోసం ఆయన రక్తం వెల చెల్లిస్తుంది. దేవుడు తానే ఆ వ్యక్తిని దాటిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని శిక్షించడు.
దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసాడు. ఎందుకంటే వారు తనకు చెందినవారిగా ఉండడానికి ఆయన వారిని ఎంపిక చేసుకొన్నాడు. ఇప్పుడు దేవుడు ప్రతిఒక్కరికోసం ఒక నూతన నిబంధన చేసాడు. ఏ ప్రజాతెగలో ఎవరైనా ఈ నూతన నిబంధనను అంగీకరిస్తే వారు దేవుని ప్రజతో కలుస్తారు. దేవుడు ఇలా చేస్తాడు, ఎందుకంటే వారు యేసునంది విశ్వాసముంచారు.
దేవుని వాక్యాన్ని మహాశక్తితో ప్రకటించిన ప్రవక్త మోషే. అయితే యేసు ప్రవక్తలందరిలో శ్రేష్టుడు. ఆయన దేవుడు. కనుక ఆయన చేసిన సమస్తం, ఆయన మాట్లాడిన ప్రతీ మాట దేవుని కార్యాలు, దేవుని మాటలు. ఈ కారణం చేత యేసు దేవుని వాక్కుగా పిలువబడ్డాడు. దావీదు సంతానంలో ఒకరు దేవుని ప్రజలను శాశ్వతం పాలిస్తాడని దేవుడు దావీదుతో వాగ్దానం చేసాడు. ప్రభువైన యేసు దేవుని కుమారుడు, మెస్సీయ. కనుక శాశ్వతకాలం పాలించడానికి ఆయన దావీదు కుమారుడు.
దావీదు ఇశ్రాయేలు రాజు. అయితే ప్రభువైన యేసు సర్వలోకానికీ రాజు! ఆయన మరల రాబోతున్నాడు. ఆయన రాజ్యాన్ని నీతితోనూ, సమాధానంతోనూ శాశ్వత కాలం పాలిస్తాడు.
రోమా 3:21-26; 5:1-11; యోహాను 3:16; మార్కు 16:16; కొలస్సీ 1:13-14; 2 కొరింథు 5:17-21; 1 యోహాను 1:5-10 నుండి
దేవుని దూత మరియ అనే కన్యకతో ఆమె దేవుని కుమారునికి జన్మనిస్తుందని చెప్పాడు. ఆమె ఇంకా కన్యకగానే ఉంది. అయితే పరిశుద్ధాత్ముడు ఆమెను కమ్ముకొంటాడు, ఆమె గర్భం ధరించేలా చేస్తాడు. ఆమె ఒక కుమారుడిని కనింది. ఆ బిడ్డకు యేసు అను పేరు పెట్టారు. కానుక యేసు దేవుడూ, మానవుడూ కూడా.
తాను దేవుడనని చూపించడానికి యేసు అనేక సూచకక్రియలు చేసాడు. ఆయన నీటి మీద నడిచాడు, తుఫానులు ఆపాడు. రోగులనేకులను ఆయన బాగు చేసాడు, అనేకులలో ఉన్న దయ్యాలను పారదోలాడు. చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలను 5,000 మంది ప్రజలకు సరిపడే ఆహారంగా మార్చాడు.
ప్రభువైన యేసు ఒక గొప్పనాయకుడు కూడా. ఆయన బోధించినదంతా సరియైనదే. ఆయన దేవుని కుమారుడు కనుక ఆయన చెప్పిన దానిని ప్రజలు చెయ్యాలి. ఉదాహరణకు, నిన్ను నీవు ఏవిధంగా ప్రేమించుకొంటున్నావా అదే విధంగా పొరుగువారిని ప్రేమించాలి అని ఆయన చెప్పాడు.
అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలని కూడా ఆయన బోధించాడు. ఈ లోకంలో ఉన్నవాటన్నిటినీ సంపాదించుకోవడం కంటే దేవుని రాజ్యంలో ఉండడం శ్రేష్ఠమైన సంగతి అని యేసు చెప్పాడు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే దేవుడి నీ పాపాలను క్షమించాలి. కొందరు యేసును అంగీకరిస్తారని యేసు చెప్పాడు. దేవుడు వీరిని క్షమిస్తాడు. అయితే కొందరు ఆయనను అంగీకరించరు. కొందరు మంచి నేలలా ఉంటారని యేసు చెప్పాడు. ఎందుకంటే యేసును గురించిన సువార్త వారు అంగీకరిస్తారు, దేవుడు వారిని రక్షిస్తాడు. దేవుని వాక్యం ఒక త్రోవలో పడిన విత్తనం లాంటిది. అయితే అక్కడ ఏమీ మొలవదు. ప్రజలు యేసును గురించిన సువార్తను తృణీకరిస్తారు. ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి నిరాకరిస్తున్నారు.
దేవుడు పాపులను ప్రేమిస్తున్నాడని యేసు బోధిస్తున్నాడు. ఆయన వారిని క్షమించడానికి కోరుతున్నాడు. వారిని ఆయన కుమారులుగా చేసుకోడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడని కూడా యేసు చెప్పాడు. ఆదాము, హవ్వ పాపం చేసారు కనుక వారి సంతానం యావత్తూ కూడా పాపం చేసింది. ఈ లోకంలో ఉన్న ప్రతీ వ్యక్తీ పాపం చేసినవాడే. దేవునికి దూరంగా ఉన్నారు. ప్రతీ ఒక్కరూ దేవునికి శత్రువులుగా ఉన్నారు.
అయితే లోకంలో ఉన్నవారినందరినీ ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు, ఆయనయందు విశ్వాసముంచు ప్రతీవాడునూ నశింపక నిత్యజీవం పొందేలా ఆయనను ఈ లోకానికి అప్పగించాడు. నీవు చనిపోవడానికి అర్హుడవు. ఎందుకంటే నీవు పాపం చేసావు. దేవుడు నీ విషయంలో కోపంగా ఉండడం సరియైనదే. దానికి బదులు ఆయన యేసు విషయంలో కోపాన్ని చూపించాడు. సిలువ మీద యేసును బలిగా అర్పించడం ద్వారా దేవుడు యేసును శిక్షించాడు.
ప్రభువైన యేసు ఎన్నడూ పాపం చెయ్యలేదు. అయితే దేవుడు ఆయనను శిక్షించేలా ఇష్టపడ్డాడు. మరణించడానికి ఆయన అంగీకరించాడు. ఈ విధంగా మన పాపాలూ, లోకంలో ఉన్న మనుష్యులందరి పాపాలు తీసివేయడానికి ఆయన సంపూర్ణమైన బలిఅర్పణగా ఉన్నాడు. ప్రభువైన యేసు తనను తాను దేవునికి అర్పించుకొన్నాడు. కనుక దేవుని ఏ పాపాన్నైనా క్షమించగలడు. భయంకర పాపాలు అయినా ఆయన క్షమించగలడు.
నీవు ఎంత మంచి కార్యాలు చేసినా దేవుడు నిన్ను క్షమించేలా చెయ్యవు. దేవునితో స్నేహితునిగా మారడానికి నువ్వు ఏమీ చెయ్యలేవు. దానికి బదులు ప్రభువైన యేసు దేవుని కుమారుడనీ, నీకు బదులుగా సిలువలో చనిపోయాడనీ, దేవుడాయనను మృతులలోనుండి తిరిగి లేపాడనీ నీవు విశ్వాసించినట్లయితే దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు.
ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రభువుగా అంగీకరించిన వారిని దేవుడు రక్షిస్తాడు. ఆయన యందు విశ్వాసముంచని వారిని దేవుడు క్షమించడు. నీవు ధనవంతుడవైనా, పేదవాడివి అయినా, పురుషుడు లేక స్త్రీ అయినా, ముసలి వాడవు లేక యవనస్థుడవైనా, ఎక్కడ నివసిస్తున్నా వ్యత్యాసం లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు యేసు నందు విశ్వాసముంచాలని ఆయన కోరుతున్నాడు. ఆయన నీ స్నేహితుడు కావాలని ఆయన కోరుతున్నాడు.
నీవు ఆయన యందు విశ్వాసముంచి, బాప్తిస్మం పొందాలని యేసు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభువైన యేసు మెస్సీయ అని నీవు విశ్వసిస్తున్నావా? ఆయనే దేవుని ఏకైక కుమారుడని నమ్ముతున్నావా? నీవు పాపి అనీ దేవుని శిక్షకు పాత్రుడవనీ నమ్ముతున్నావా? నీ పాపాలు తీసివేయడానికి యేసు సిలువలో చనిపోయాడని నీవు విశ్వసిస్తున్నావా?
యేసు నీ కోసం చేసినదానిని నీవు విశ్వసించినట్లయితే నీవు క్రైస్తవుడవు! సాతాను తన చీకటి రాజ్యంలో నీ మీద పాలన చెయ్యడు. ఆయన వెలుగు రాజ్యంలో నీ మీద ఆయన ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. మీరింతకుముందు చేస్తున్న పాపం చెయ్యకుండా దేవుడు నిన్ను ఆపాడు. నీకు ఒక నూతనమైన సరియైన జీవన విధానాన్ని ఆయన నీకు అనుగ్రహించాడు.
నీవు క్రైస్తవుడైతే దేవుడు నీ పాపాలను క్షమించాడు, ఎందుకంటే ప్రభువైన యేసు చేసిన కార్యాన్ని బట్టి ఆయన నిన్ను క్షమించాడు. ఇప్పుడు దేవుడు నిన్ను తన శత్రువులా కాదు స్నేహితునిగా యెంచుతాడు.
నీవు దేవుని స్నేహితుడవూ, ప్రభువైన యేసు సేవకుడిగా ఉన్నట్లయితే యేసు నీకు బోధించినదానికి నీవు విధేయత చూపించడానికి ఇష్టపడతావు. నీవు క్రైస్తవ విశ్వాసివి అయినప్పటికీ నీవు పాపం చేసేలా సాతాను నిన్ను సాధిస్తాడు. అయితే దేవుడు దేనిని చేస్తానని చెపుతాడో దానినే చేస్తాడు. నీవు నీ పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమిస్తానని ఆయన చెపుతున్నాడు. పాపానికి వ్యతిరేకంగా పోరాడడానికి శక్తిని ఇస్తాడు.
దేవుని వాక్యాన్ని అధ్యయనం చెయ్యాలనీ, ప్రార్థన చెయ్యాలనీ దేవుడు చెపుతున్నాడు. ఇతర క్రైస్తవ విశ్వాసులతో కలిసి మీరు దేవున్ని ఆరాధించాలని ఆయన చెప్పాడు. ప్రభువైన యేసు నీకు చేసిన దానిని ఇతరులతో పంచుకోవాలి అని ప్రభువు నీకు చెపుతున్నాడు. ఈ కార్యాలన్నిటినీ చేస్తే నీవు ఆయనకు బలమైన స్నేహితుడవు అవుతావు.
మత్తయి 24:14; 28:18; యెహాను 15:20,16:33; ప్రకటన2:10; మత్తయి13:24-30,36-42;1 తెస్సలోనీ 4:13-5:11; యాకోబు 1:12; మత్తయి 22:13; ప్రకటన 20:10,21:1-2,000
సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా మనుష్యులు అనేకులు మెస్సీయ యేసును గురించిన బోధ వింటున్నారు. సంఘం అనుదినం వృద్దిచెందుతుంది. లోకాంతంలో ప్రభువు తిరిగి రాబోతున్నాడని వాగ్దానం చేసాడు. ఆయన ఇంకా రాకపోయినప్పటికీ ఆయన తన వాగ్దానాన్నినెరవేరుస్తాడు.
ప్రభువైన యేసు రాకడకోసం మనం ఎదురు చూస్తుండగా ఆయనను ఘనపరచే పరిశుద్ధ జీవితం జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. ఆయన రాజ్యం గురించి ఇతరులకు చెప్పాలని కూడా కోరుతున్నాడు. యేసు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఇలా చెప్పాడు, “సమస్త దేశాలలో ప్రతి ఒక్కరికీ నా శిష్యులు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటిస్తారు, అప్పుడు అంతం వచ్చును.”
అనేక ప్రజా గుంపులు ఇంకా యేసును గురించి వినలేదు. ఆయన పరలోకానికి వెళ్ళడానికి ముందు, సువార్త వినని వారికి సువార్తను ప్రకటించాలని ఆయన తన శిష్యులతో చప్పాడు. ఆయన ఇలా ఆజ్ఞ ఇచ్చాడు, “సమస్త దేశాలను వెళ్ళండి, సమస్త జనులను శిష్యులనుగా చెయ్యండి!”, “కొత్త విస్తారంగానూ సిద్ధంగానూ ఉంది!”
యేసు ఇలా కూడా చెప్పాడు, “ఒక దాసుడు అతని యజమానుని కంటే గొప్పవాడు కాదు. ఈ లోకంలో ఘనులైనవారు నన్ను ద్వేషించారు. వారు మిమ్మును కూడా శ్రమలపాలు చేస్తారు. నా నిమిత్తం మిమ్మల్ని చంపుతారు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. అయితే ధైర్యం తెచ్చుకొండి, ఎందుకంటే నేను ఈ లోకాధికారి సాతానును జయించి యున్నాను. అంతము వరకు నమ్మకముగా ఉన్న యెడల దేవుడు మిమ్మును రక్షిస్తాడు.
లోకం అంతమైనప్పుడు మనుష్యులకు ఏమి జరుగుతుందో చెప్పడానికి యేసు ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఇలా చెప్పాడు, “ఒక మనుష్యుడు తన పొలములో మంచి విత్తనాన్ని నాటాడు. ఆయన నిద్రపోతున్నప్పుడు అతని శత్రువు వచ్చి గోదుమ మొక్కలలో కలుపు మొక్కలను నాటి వెళ్ళిపోయాడు.
“మొక్కలు పెరిగినప్పుడు, ఆ మనుష్యుని సేవకులు వచ్చి ఆయనతో, “యజమానుడా, నీవు నీ పొలములో మంచి విత్తనాలను నాటావు, అయితే వాటిలో కలుపు మొక్కలు ఉన్నాయి” అని అన్నారు. దానికి యజమాని ఇలా జవాబిచ్చాడు, “కేవలం నా శత్రువులు మాత్రమే వాటిని నాటాలని కోరాడు, వాటిని వాడే నా టిఉంటాడు.”
“సేవకులు యజమానితో ఇలా అడిగారు, ‘మేము కలుపు మొక్కలను పెరికివేయవచ్చునా?’ అందుకు యజమాని, “వద్దు, మీరు అలా చేస్తే వాటితో పాటు గోధుమలను కూడా పెరికి వేస్తారు. పంట కాలం వరకూ ఎదురు చూడండి. అప్పుడు కలుపు మొక్కలను ఒక చోట సమకూర్చండి, వాటిని కాల్చివెయ్యండి. అయితే గోధుమ పంటని నా కొట్లలో సమకూర్చండి.’”
ఆ కథనంలోని అర్థాన్ని శిష్యులు తెలుసుకోలేదు. కనుక యేసు వారికి అర్థపరచాడు. ప్రభువు ఇలా చెప్పాడు, “మంచి విత్తనాన్ని విత్తువాడు ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుంది, పొలం లోకాన్ని చూపుతుంది. మంచి మొక్కలు దేవుని రాజ్య ప్రజలను సూచిస్తుంది.”
“కలుపు మొక్కలు సాతాను చెందిన వ్యక్తులను సూచిస్తుంది, వాడు దుష్టుడు. వాడు మనుషులకు శత్రువు, కలుపు మొక్కలను నాటుతాడు. వాడు సాతానును చూపుతాడు. దాని పంట లోక అంతాన్ని సూచిస్తుంది. కోత కోయువారు దేవుని దూతలు.”
“లోకం అంతం అయినప్పుడు, దేవుని దూతలు సాతానుకు చెందిన వారందరిని పోగుచేస్తారు. వారిని చాలా వేడిగల అగ్నిలో వేస్తారు. అక్కడ ప్రజలు ఏడుస్తారు, మహా వేదనతో పండ్లు కోరుకుతారు, అయితే యేసును అనుసరించిన నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునివలే ప్రకాశిస్తారు.”
లోకఅంతానికి ముందు యేసు ఈ లోకానికి వస్తాడని ఆయన చెప్పాడు. ఆయన ఏవిధంగా వెళ్ళాడో అదే రీతిగా తిరిగి వస్తాడు. అంటే ఆయనకు నిజమైన దేహం ఉంటుంది, ఆకాశంలోని మేఘాల మీద ఆయన తిరిగి వస్తాడు. యేసు తిరిగి వచ్చినప్పుడు మృతుడైన ప్రతీ క్రైస్తవుడు మరణం నుండి తిరిగి లేస్తాడు, మధ్యాకాశంలో ఆయనను కలుసుకొంటాడు.
సజీవులుగా ఉండే క్రైస్తవులు ఆకాశంలోనికి కొనిపోబడతారు, మరణంనుండి తిరిగి లేచిన ఇతర క్రైస్తవులతో కలుసుకొంటారు. వారందరూ యేసుతో ఉంటారు. దాని తరువాత యేసు తన ప్రజలతో ఉంటాడు. వారు కలిసి ఉండడం ద్వారా సంపూర్ణ నెమ్మదిని యుగయుగములు కలిగియుంటారు.
ఆయన యందు విశ్వాస ముంచిన ప్రతీ ఒక్కరికీ నీతి కిరీటాన్ని ఇస్తానని యేసు వాగ్దానం చేసాడు. ఆయనతో కలసి సమస్తం మీద వారు శాశ్వతకాలం పరిపాలన చేస్తారు. యేసు నందు విశ్వాశం ఉంచని వారిని దేవుడు తీర్పు తీరుస్తాడు. వారిని నరకంలో వేస్తాడు. అక్కడ వారు ఏడుస్తారు, పండ్లు కొరుకుతారు, శాశ్వత శ్రమల పాలవుతారు. అక్కడున్న అగ్ని ఆరిపోదు, నిరంతరం మండుతుంది. దానిలోని పురుగు చావదు.
ప్రభువైన యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన సాతానునూ, వాడి రాజ్యాన్ని సమూలంగా నాశన చేస్తాడు. సాతానును నరకంలో పడవేస్తాడు. అక్కడ వాడు శాశ్వతంగా కాలిపోతుంటాడు. వాడితో బాటు దేవునికి విధేయత చూపించకుండా సాతానును అనుసరించువారు నరకంలో పడతారు. ఆదాము, హవ్వ దేవునికి అవిధేయత చూపించిన కారణంగా పాపాన్ని ఈ లోకానికి తీసుకొని వచ్చిన కారణంగా, దేవుడు పాపాన్ని శపించాడు, దానిని నాశనం చెయ్యాలని నిర్ణయించాడు.
ప్రభువైన యేసూ, ఆయన ప్రజలు భూమి మీద నివసిస్తారు, ఆయన సమస్తం మీద యుగయుగాలు పరిపాలన చేస్తాడు. ఆయన వారి ప్రతీ కన్నీటి బాష్ప బిందువునూ తుడుస్తాడు. ఏ ఒక్కరూ శ్రమ పొందారు, దుఃఖం ఉండరు. రోగం ఉండదు, మరణం ఉండదు. దుష్టత్వం ఉండనే ఉండదు. నీతితోనూ, సమాధానంతోనూ యేసు పరిపాలన చేస్తాడు. ఆయన తన ప్రజలతో శాశ్వతం ఉంటాడు.